ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై.. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈడీ లాకప్ ఉండి పారిపాలన కొనసాగించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు ఆదేశాలు కూడా జారీ చేశారు. తాజాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి పంపిన సందేశాన్ని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ మీడియాకు చదవి వినిపించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లోని ప్రాంతాలను ప్రతిరోజూ సందర్శించాలని కేజ్రీవాల్ సూచించినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నాట్లు వివరించారు. ‘నేను జైలులో ఉన్నందున ఢిల్లీ ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులకు గురికావొద్దు. ప్రతిరోజూ ఎమ్మెల్యేలంతా వారి నియోజకవర్గాలోని ప్రాంతాలను సందర్శించాలి. అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలి’ అని కేజ్రీవాల్ సందేశం పంపినట్లు సునీతా కేజ్రీవాల్ మీడియకు తెలిపారు.
అంతకు ముందు లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో బెయిల్ లభించిన ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సునీతా కేజ్రీవాల్ కలిశారు. ఇక.. ఇటీవల అరవింద్ కేజ్రీవాల్‌ను ఆశీర్వదిస్తూ..వాట్సప్‌లో సందేశాలు పంపి మద్దతు పలకాలని సునీతా కేజ్రీవాల్ ఒక వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 15 వరకు కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment