ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ( ఆప్) ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎంపీపై దాడి కేసులో బెయిల్, అరెస్ట్‌ను సవాల్ చేస్తూ బిభవ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితుడు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీలో 100 రోజులు ఉన్నారని, ఛార్జ్‌షీట్ నమోదైనట్లు సుప్రీం కోర్టు తెలిపింది.
‘స్వాతి మలివాల్‌కు గాయాలు అయ్యాయి. కానీ ఈ కేసులో బెయిల్ ఇవ్వడాన్ని అడ్డుకోలేం. బెయిల్ నిరాకరిస్తూ జైలులోనే ఉంచేలా చేయలేం’ అని న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. ఢిల్లీ పోలీసుల తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఈ కేసులో కొందరు ముఖ్యమైన సాక్షులపై నిందితుడు బిభవ్ కుమార్ ప్రభావం ఉంది. వారిని విచారించడానికి అనుమతి ఇవ్వండి. అప్పుడు తాము బెయిల్‌ను వ్యతిరేకించమని కోర్టుకు తెలిపారు.
అలా అయితే.. సొలిసిటర్ జనరల్ చెప్పిన విధంగా తాము ఎవరికీ బెయిల్ మంజూరు చేయలేమని జస్టిస్ భుయాన్ అన్నారు. బెయిల్ మంజూరు చేయకుండా ఉంచటం ఆందోళన కలిగించే విషయమని సుప్రీకోర్టు పేర్కొంది. ఈ దాడి కేసులో సాక్షులందరినీ విచారించే వరకు నిందితుడు బిభవ్ కుమార్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోకి ప్రవేశించవద్దని సుప్రీం కోర్టు షరుతు విధించింది.
మే 13న స్వాతి మలివాల్‌పై బిభవ్ కుమార్ తనపై దాడి చేసినట్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. స్వాతి మలివాల్ ఫిర్యాదు మేరకు బిభవ్ కుమార్‌పై పోలీసులు మే 18న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment