ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలులో ఉన్నారు. అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిన మార్చి 21 నుంచి సుమారు 8 కేజీల బరువు తగ్గినట్లు ఆప్ చెబుతోంది. అరెస్ట్‌కు ముందు ఆయన బరువు 70 కేజీలు ఉండగా.. అనంతరం ఆయన బరువు జూన్ 22 వరకు 8 కేజీలు తగ్గి 62 కేజీలకు పడిపోయిందని ఆప్ నేతలు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల్లో అరవింద్ కేజ్రీవాల్ 8 కేజీల బరువు తగ్గారని తెలిపారు.
ఇలా బరువు తగ్గటంపై అసలైన కారణం తెలుసుకోవటం కోసం వెంటనే ఆయన డాక్టర్లను సంప్రదించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరోవైపు.. అరవింద్ కేజ్రీవాల్ బరువు తగ్గటంపై ఎయిమ్స్ వైద్యులు ఆయనకు ఇచ్చే ఆహారంలో పూరీలు, పరాటాలు చేర్చాలని సూచింనట్లు ఆప్ పేర్కొంది.
ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్‌కు వారం రోజులు పాటు మధ్యంత బెయిల్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మాక్స్ ఆస్పత్రి వైద్యులు ఆయనకు పలు పరీక్షలు చేసీ.. బరువు తగ్గడానికి గల కారణాలను తెలుసుకోవాలన్నారని ఆప్ తెలిపింది. ఇటీవల సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌజ్ అవెన్యూ ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ట్రయిల్ కోర్టు తీర్పుపై మధ్యంతర స్టే విధించింది.
Comments
Please login to add a commentAdd a comment