
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు డబుల్ ధమాకాలా ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ పుట్టినరోజు కూడా మంగళవారం రావడం కలిసివచ్చింది. భార్య బర్త్‌డే వేడుకలతో పాటు ఢిల్లీ ప్రజలు తన సర్కార్‌కు మరోసారి పట్టం కట్టడంతో కేజ్రీ ఉత్సాహం రెట్టింపైంది. తన భర్త కోసం విస్తృతంగా ప్రచారం చేసిన సునీతా కేజ్రీవాల్ (54)కు ట్విటర్‌లో నెటిజన్ల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కేజ్రీవాల్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వకముందు ఇద్దరూ ఐఆర్‌ఎస్ అధికారులుగా పనిచేసిన విషయం తెలిసిందే.
హ్యాపీబర్త్‌డే సునీతా మేడమ్..మా హీరోకు మీరే బలం..మిమ్మల్ని చూసి గర్విస్తున్నామని ఓ ట్విటర్ యూజర్ పేర్కొనగా, ఎన్నికల ఫలితాలు సానుకూలంగా వచ్చిన రోజే పుట్టినరోజు జరుపుకోవడం సంతోషకరమని, కేజ్రీవాల్ వెనుకున్న శక్తి మీరేనంటూ మరో ట్విటర్ యూజర్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఓటింగ్ రోజున పోలింగ్ బూత్ వెలుపల కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటోను ట్వీట్ చేసిన సునీత తమ కుమారుడు తొలిసారిగా ఎన్నికల్లో ఓటు వేస్తున్నాడని పేర్కొన్నారు. తన భర్త కేజ్రీవాల్‌పై బీజేపీ విమర్శలను దీటుగా తిప్పికొడుతూ ఆప్ శ్రేణులతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment