ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనది అధికార దురహంకారమని, అందరినీ అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఢిల్లీ మద్యం పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ విచారణకు సంబంధించి తన భర్త, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం ఆమె ఇంటిపై దాడి చేసిన ఒక రోజు తర్వాత సునీతా కేజ్రీవాల్ ఇలా ప్రతిస్పందించారు.
"మూడుసార్లు ఎన్నికైన మీ ముఖ్యమంత్రిని మోదీజీ అధికార అహంకారంతో అరెస్టు చేశారు. అందరినీ అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఢిల్లీ ప్రజలకు చేసిన ద్రోహం. మీ ముఖ్యమంత్రి ఎప్పుడూ మీ వెంటే ఉన్నారు. లోపల (జైలు) అయినా బయట అయినా.. ఆయన జీవితం దేశానికే అంకితం చేశారు. ప్రజలకు ప్రతిదీ తెలుసు. జై హింద్" అని సునీతా కేజ్రీవాల్ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు.
आपके 3 बार चुने हुए मुख्यमंत्री को मोदीजी ने सत्ता के अहंकार में गिरफ़्तार करवाया।सबको crush करने में लगे हैं। यह दिल्ली के लोगो के साथ धोखा है।आपके मुख्यमंत्री हमेशा आपके साथ खड़े रहें हैं।अंदर रहें या बाहर, उनका जीवन देश को समर्पित है।जनता जनार्दन है सब जानती है।जय हिन्द🙏
— Sunita Kejriwal (@KejriwalSunita) March 22, 2024
Comments
Please login to add a commentAdd a comment