వైఎస్సార్ జిల్లాలో నీళ్లలో దాచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లాలో నీళ్లలో దాచిన ఎర్రచందనం దుంగలను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వేకోడూరు మండలం మాధవరంపాడు రైల్వేట్రాక్ బ్రిడ్జి కింద పోలీసులు, అటవీశాఖాధికారులు సంయుక్తంగా చేసిన దాడుల్లో 120 ఎర్రచందనం దుంగలను అదుపులోకి తీసుకున్నారు. అధికారులు కనిపెట్టకుండా ఉండేందుకు దొంగలు నీళ్లలో దాచిపెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.