తాడిపత్రి మండలంలోని ఊరిచింతల, వెంకటాంపల్లి గ్రామాల్లో ఇరువర్గాలకు చెందిన 23 మందిని మంగళవారం బైండోవర్ చేసినట్లు రూరల్ ఎస్‌ఐ నారాయణరెడ్డి తెలిపారు.
తాడిపత్రి రూరల్ : తాడిపత్రి మండలంలోని ఊరిచింతల, వెంకటాంపల్లి గ్రామాల్లో ఇరువర్గాలకు చెందిన 23 మందిని మంగళవారం బైండోవర్ చేసినట్లు రూరల్ ఎస్‌ఐ నారాయణరెడ్డి తెలిపారు. ఊరిచింతల గ్రామానికి చెందిన రామాంజనేయులు మరో ఎనిమిది మంది, ఆదెన్న మరో ఏడుగురిని అలాగే వెంకటాంపల్లికి చెందిన శివారెడ్డి,మరో ఇద్దరు, గంగిరెడ్డి, మరో ఇద్దరిని తహశీల్దార్ ఎల్లమ్మ వద్ద బైండోవర్ చేయించామని తెలిపారు.
రామాంజనేయులు వర్గం, ఆదెన్న వర్గం పాతకక్షలతో తరచూ గొడవలు పడుతున్నారు. అలాగే శివారెడ్డి, గంగిరెడ్డి భూమి విషయంలో గొడవలు పడుతున్నారు. ముందస్తు చర్యలో భాగంగా వారిని బైండోవర్ చేయించామని ఎస్‌ఐ తెలిపారు.