మావోయిస్టు అగ్రనేత అశోక్ లొంగుబాటు
హైదరాబాద్: తెలంగాణలో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత గణపతి సోదరుడు, పార్టీ దండకారణ్య కమిటీ కార్యదర్శి గాజర్ల అశోక్ హైదరాబాద్‌లో గురువారం పోలీసుల ఎదుట లొంగిపోయారని తెలుస్తోంది. ఆయన అనేక ఎన్కౌంటర్లతో పాటు, పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ప్రభుత్వం.. అశోక్పై రూ.20 లక్షల రివార్డు ప్రకటించి ఉంది.
గత కొన్ని సంవత్సరాలుగా గాజర్ల అశోక్ దండకారణ్యంలో యాక్టివ్గా పని చేస్తున్నారు. ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా చిట్యాల మండలం వెలిశాల. అనారోగ్యం వల్లే అశోక్ .. పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఆయనను వెంటనే విడుదల చేయాలని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు డిమాండ్ చేస్తున్నారు. కాగా అశోక్ లొంగుబాటును పోలీసులు ఇంకా ప్రకటించలేదు.