విజయనగరం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సాలూరు: విజయనగరం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాలూరులో గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నారని స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా ట్రాన్స్‌పోర్టు ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 20 బస్తాల గుట్కా, జర్దా, ఖైనీ ప్యాకెట్లను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకన్న ప్యాకెట్ల విలువ సుమారు రూ. 5 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.