
న్యూఢిల్లీ/పాట్నా: ఎన్డీయే కీలక భాగస్వామి, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఆయనకు జెడ్– కేటగిరీ భద్రత కల్పించింది. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు ఇప్పటిదాకా శశస్త్ర సీమాబల్‌కు చెందిన చిన్న బృందం రక్షణ కల్పించేది.
41 ఏళ్ల చిరాగ్ పాశ్వాన్.. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు కూడా. లోక్ జనశక్తి బిహార్‌లో బీజేపీ, జేడీయూలతో పొత్తుపెట్టుకొని పోటీచేసిన ఐదు లోక్‌సభ స్థానాలను నెగ్గిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment