
టిమిండియా ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా కుమారుడు అగస్త్యాకు బుధవారం(సెప్టెంబర్ 30)తో రెండు నెలలు నిండాయి. అగస్త్యాకు రెండులు నెలలు నిండిన సందర్భంగా అతడి తల్లి, హార్థిక్ భార్య నటసా తన కుమారుడి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘రెండు నెలల అగస్త్యుడు’ అనే క్యాప్షన్‌తో నటషా పోస్టు చేశారు. అదే ఐపీఎల్ నేపథ్యంలో దుబాయ్‌లో ఉన్న హార్థిక్ కూడా తన ముద్దుల తనయుడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. ముంబై ఇండియన్ జెర్సీపై (హ్యాపీ 2 మంథ్స్ అగస్త్యా’ అని రాసి ఉన్న షాట్ ఫొటోను పోస్టు చేశాడు. (చదవండి: నటాషా, అగస్త్య ఫోటో షేర్ చేసిన పాండ్యా)
దీనికి ‘నా కుమారుడికి రెండు నెలలు’ అంటూ తన పోస్టును పంచుకున్నాడు. కాగా జులై 30న హార్థిక్ తాను తండ్రినయ్యాను అంటూ సోషల్ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నటషా పోస్టుకు టిమిండియా బ్యాట్స్‌మన్ కెఎల్ రాహుల్‌తో పాటు టిమిండియా ఆటగాళ్లంతా అగస్త్యకు ఎమోజీలతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న ఐపీఎల్ 2020కి హార్థిక్ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ ఆడిన 3 మ్యాచ్‌లో రెండు పరాజయం పొందింది.
Comments
Please login to add a commentAdd a comment