‘సై రా’ షూటింగ్ ఆగిపోయిందా..? | Chiranjeevi new look becomes talk of the town | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 2 2018 3:58 PM | Last Updated on Tue, Jan 2 2018 4:01 PM

Chiranjeevi new look becomes talk of the town - Sakshi

ఖైదీ నంబర్ 150 సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాగా సైరా నరసింహారెడ్డి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగిందన్న టాక్ వినిపించింది. రెండో షెడ్యూల్ ను ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారన్న ప్రచారం జరిగింది.

అయితే కొత్త సంవత్సర వేడుకల్లో మెగాస్టార్ ను చూసిన అభిమానులకు కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లుక్ కోసం మెగాస్టార్ కొంత కాలంగా గెడ్డంతో కనిపిస్తున్నారు. ఇటీవల జరిగిన షూటింగ్ లో కూడా చిరు అదే లుక్ లో పాల్గొన్నారు. కానీ తాజాగా మెగాస్టార్ క్లీన్ గా షేవ్ చేసుకొని అభిమానులకు దర్శనమిచ్చారు.

దీంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ అనుమానాలు మొదలయ్యాయి. క్యారెక్టర్ కంటిన్యూటి ఉండాలంటే చిరంజీవి అదే లుక్ లో ఉండాలి. కానీ చిరు గెడ్డం తీసేసారంటే షూటింగ్ ఆగిపోయిందా..? లేక సై రా కోసం చిరు మరో లుక్ ను ట్రై చేస్తున్నారా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విషయంపై చిత్రయూనిట్ మాత్రం ఇంత వరకు స్పందించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement