Akhil Akkineni 'Agent' Movie Trailer Review: ‘ఏజెంట్‌’ ట్రైలర్‌ ఎలా ఉందంటే.. - Sakshi
Sakshi News home page

Agent trailer: ‘ఏజెంట్‌’ ట్రైలర్‌ ఎలా ఉందంటే..

Published Wed, Apr 19 2023 9:00 AM | Last Updated on Wed, Apr 19 2023 1:38 PM

Akhil Agent Movie Trailer Review - Sakshi

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా నటించిన స్పై యాక్షన్‌ ఫిల్మ్‌ ‘ఏజెంట్‌’. మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. సాక్షివైద్య హీరోయిన్‌గా నటించింది. ఏప్రిల్‌ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృంది.  ట్రైలర్ యాక్షన్ సన్నివేశాలతో అదిరిపోయింది.

‘నువ్వెందుకు ఏజెంట్‌ అవ్వాలనుకుంటున్నావు’అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. సిండికేట్‌కి ఒక పవర్‌ హౌస్‌ ఉంది. దాని పేరు గాడ్‌. దాన్ని ట్రేస్‌ చేయగలిగితే మొత్తం నెట్‌వర్క్‌ని నాశనం చేయొచ్చు. ఈ మిషన్‌ కోసం మమ్ముట్టి టీమ్‌ అఖిల్‌ని రంగంలోకి దించుతుంది. ‘సింహం బోనులోకి వెళ్లి తిరిగొచ్చేది కోతి మాత్రమే’అని మమ్ముట్టి చెప్పే డైలాగ్‌తో అఖిల్‌ పాత్ర ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

(చదవండి: నా బెడ్‌రూమ్‌లో ఇప్పటికీ ఆయన పోస్టర్స్‌ ఉంటాయి: ఖుష్బూ)

కోతిలాంటి బిహేవియర్‌ ఉన్న అఖిల్‌ ఏజెంట్‌గా మారతాడు. అయితే ఒకానొక దశలో అఖిల్‌నే చంపేయాలని మమ్ముట్టి తన టీమ్‌ సభ్యులను ఆదేశిస్తాడు. అసలు మమ్ముట్టి అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆ మిషన్‌ని పూర్తి చేసే క్రమంలో అఖిల్‌కు ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు ఆ మిషన్‌ ఎలా సక్సెస్‌ అయింది? అనేదే ఈ సినిమా కథ అని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. 

అయితే ఈ తరహా యాక్షన్‌ అఖిల్‌కి కొత్త కానీ ఆడియన్స్‌కి కాదు. గతంలో వచ్చిన స్పై యాక్షన్‌ ఫిల్మ్స్‌ మాదిరే ఇందులో కూడా గన్‌తో బుల్లెట్ల వర్షం కురిపించడం, అదిరిపోయే స్టంట్స్‌ ఉన్నాయి. ఇక కేజీయఫ్‌ తర్వాత పెద్ద గన్‌తో క్లైమాక్స్‌ని సెట్‌ చేయడం ఆనవాయితీగా మారింది. విక్రమ్‌ నుంచి మొన్నటి పఠాన్‌ వరకు ప్రతి యాక్షన్‌ సినిమాలో పెద్ద గన్‌తో బుల్లెట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఏజెంట్ ట్రైలర్ చివర్లో కూడా ఇలాంటి సీన్ ఒకటి పెట్టారు.

ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.  హిప్‌ హాప్‌ తమిళ్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంది. సినిమాకు  భారీ ఖర్చు చేసినట్లు ట్రైలర్‌లో కనిపిస్తోంది. మొత్తం మీద అఖిల్‌ పెద్ద సాహసమే చేశాడు. అది ఏ మేరకు వర్కౌట్‌ అవుతుందనేది ఏప్రిల్‌ 28న తెలుస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement