అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటెట్ మూవీ ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఏప్రిల్ 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సారి ‘అయ్యగారి’కి పక్కా హిట్ వస్తుందని అక్కినేని అభిమానులు ఆశపడ్డారు. కానీ వారి కోరిక నెరవేరలేదు. తొలిరోజు ఈ ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద తొలి రోజు తక్కువ వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రం ఫస్ట్‌డే ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ. 7 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే సాధించింది. అందులో తెలుగు రాష్ట్రాలలోనే రూ.4 కోట్లు వసూలు చేయడం గమనార్హం.
(చదవండి: కొడుకుపై ట్రోలింగ్.. తొలిసారి రియాక్ట్ అయిన అమల అక్కినేని)
ఇక ప్రాంతాల వారిగా చూస్తే నైజాంలో 1.33 కోట్లు, సీడెడ్ - రూ. 64 లక్షలు, ఉత్తరాంధ్ర - రూ. 54 లక్షలు, ఈస్ట్ - రూ. 29 లక్షలు, వెస్ట్ - రూ. 30 లక్షలు, గుంటూరు - రూ. 52 లక్షలు, కృష్ణా - రూ. 22 లక్షలు, నెల్లూరు - రూ. 16 లక్షలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.అఖిల్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్(సుమార్ రూ.80 కోట్లు)తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వైడ్‌గా రు. 37 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే రు. 38 కోట్ల షేర్ వస్తేనే అఖిల్ బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కుతాడు.
(చదవండి: బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన పీఎస్ 2.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..)
కానీ తొలి రోజే ఇంత తక్కువ వసూళ్లను రాబట్టిందంటే.. బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమేనని ట్రేడ్ పండితులు అంటున్నారు. అయితే అఫీషియల్‌గా ఫస్ట్ డే వసూళ్ల వివరాలు రాకపోయినా, ఈ రిపోర్ట్స్ చూస్తే మాత్రం నిజంగానే అఖిల్ కెరీర్‌లో ఏజెంట్ అతిపెద్ద డిజాస్టర్‌గా కాబోతున్నట్లు తెలుస్తుంది. కాగా, ఈ మూవీలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి, డినో మోరియా ప్రధాన పాత్రలు పోషించారు. సాక్షి వైద్య హీరోయిన్ కాగా, హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment