‘‘తెలుగులో నా తొలి సినిమా ‘ఏజెంట్’. మంచి సినిమాతో పరిచయం కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు సాక్షీ వైద్య. అఖిల్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూ΄పొందిన చిత్రం ‘ఏజెంట్’. అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో సాక్షీ వైద్య మాట్లాడుతూ – ‘‘వృత్తి రీత్యా నేను ఫిజియోథెరపిస్ట్‌ని. కోవిడ్ సమయంలో ఖాళీగా ఉండటం ఇష్టం లేక సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ చేశాను. అవి వైరల్ అయ్యాయి.
ఆ తర్వాత నా స్నేహితుల సలహా మేరకు కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను. కొన్ని అవకాశాలు వచ్చినా నచ్చలేదు. కాగా ‘ఏజెంట్’ ప్రొడక్షన్ టీమ్ నుంచి ఒకరు ఫోన్ చేసి హీరోయిన్ చాన్స్ గురించి చెప్పారు. ఈ ఆఫర్‌ను నేను మొదట్లో స్కామ్ అనుకున్నాను. కానీ ముంబైలో ఉన్న ఓ కాస్టింగ్ డైరెక్టర్ ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పెద్ద బేనర్ అని, పెద్ద దర్శకుడు, పెద్ద స్టార్ అని చెప్పగానే హైదరాబాద్ వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను. ‘ఏజెంట్’ కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రంలో పైలెట్ పాత్రలో కనిపిస్తాను. ‘ఏజెంట్’ నాకు మంచి అనుభూతిని ఇచ్చింది. ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో ‘గాంఢీవదారి అర్జున’ చేస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment