‘‘ఏజెంట్’ ఒక యాక్షన్ ఫిల్మ్. ముగ్గురు ఏజెంట్స్ మధ్య జరిగే కథ ఇది. కథ భిన్నంగా ఉంటుంది. భావోద్వేగాలు కూడా బలంగా ఉంటాయి. అఖిల్ కెరీర్‌లో ‘ఏజెంట్’కి ముందు, ‘ఏజెంట్’కి తర్వాత అనేలా ఉంటుంది. విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉంటాయి. ప్రేక్షకులకు గొప్ప అనుభూతి ఇచ్చే చిత్రం ఇది’’ అని నిర్మాత అనిల్ సుంకర అన్నారు. అఖిల్ అక్కినేని, సాక్షీ వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనిల్ సుంకర మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు యంగ్ హీరోలు డూప్ లేకుండా చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఒక నిర్మాతగా సేఫ్టీ చూసుకోమని యాక్షన్ కొరియోగ్రాఫర్‌కి చెప్తాను.
ఈ మధ్య విజయవాడలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌లో అఖిల్ దాదాపు 170 అడుగుల ఎత్తు నుంచి దూకాడు. రోప్స్ కట్టినప్పటికీ రిస్క్ ఎందుకని నేను వద్దన్నాను. అయితే అఖిల్ చేస్తానన్నాడు. క్రెడిట్ అంతా తనకే దక్కుతుంది. ‘ఏజెంట్’లో ప్రేక్షకులు ఇలాంటి సాహసాలు చాలా చూస్తారు. ఇది భారీ స్పాన్ ఉన్న సినిమా. ఇందులో గంటన్నర కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉంటాయి. అందుకే చాలా సమయం పట్టింది.
‘ఏజెంట్’ని ముందు తెలుగులో రిలీజ్ చేసి, రెండో వారం నుంచి ఇతర భాషల్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం. హిందీలో ఇప్పటికే డబ్బింగ్ పూర్తయింది. నాకు దర్శకత్వం చేసే ఆలోచన ఉంది. నా డైరెక్షన్‌లో స్పై జోనర్‌లో సినిమా ఉంటుంది. మా 14 రీల్స్ బ్యానర్‌లో ఈ ఏడాది బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్స్ ఉంటాయి. ప్రస్తుతం చిరంజీవిగారితో నిర్మిస్తున్న ‘భోళా శంకర్’ సినిమా యాక్షన్ సీన్స్ జరుగుతున్నాయి. ఆగస్ట్ 11న ఈ సినిమా విడుదలకి డేట్ ఫిక్స్ చేశాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment