'ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న' అంటుంటారు. ఇండస్ట్రీలో ఎవరైనా ఆపదలో ఉన్నారంటే చాలు ఆదుకునే సెలబ్రిటీలు ఎందరో! అందులో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా ఒకరు. ఆపత్కాలంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌కు సాయపడి తన గొప్ప మనసు చాటుకున్నాడు చెర్రీ. తాజాగా ఈ విషయాన్ని కాదంబరి కిరణ్ సోషల్ మీడియాలో వెల్లడించాడు.
'మనకు తెలిసి రామ్ చరణ్ మెగాస్టార్ తనయుడు, స్టార్ హీరో. కానీ నాకు తెలిసి ఆయన పెద్ద మనసున్న మనిషి. భక్తి , ప్రేమ, గౌరవం..ఇలాంటి విలువలు తెలిసిన మనిషి. సాటి మనిషిని మనిషిగా చూసే వ్యక్తిత్వం అతనిది. గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే ఖర్చులకు సుకుమార్ అన్న చొరవతో రామ్ చరణ్‌ను సాయం అడిగి రూ.2 లక్షలు తీసుకుని మనం సైతం ద్వారా ఆ కార్యక్రమం పూర్తి చేశాను. అంతేకాకుండా సుక్కన్న, మనం సైతం, విజయ్ అన్న, రాము తదితరుల వద్ద లక్షా ఇరవై వేల రూపాయలు పోగుచేసి చనిపోయినామె నెలల పాప పేరున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయమని ఇచ్చాం.
ఇప్పుడు ఇన్నిరోజుల తర్వాత నేను ఎదురుపడితే రామ్‌చరణ్ ఆ పాప ఎలా ఉంది కాదంబరి గారూ? అని అడిగారు. అతని వ్యక్తిత్వానికి నాకు గుండె నిండిపోయింది. బంగారు చెంచాతో పుట్టడం వేరు, బంగారు మనసుతో బతకడం వేరు. ప్రియచరణ్, నీకు భగవదాశీస్సులు' అంటూ వరుస ట్వీట్లు చేశాడు. దీన్ని ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తన ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.
మనకు తెలిసి రామ్ చరణ్ మన మెగాస్టార్ తనయుడు, స్టార్ హీరో నేను తెలుసుకున్నా..ఆయన అంతకంటే పెద్ద మనసున్న మనిషని భక్తి , ప్రేమ, గౌరవం..ఇలాంటి విలువలు తెలిసిన మనిషి. సాటి మనిషిని మనిషిగా చూసే వ్యక్తిత్వం అతనిది. గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే pic.twitter.com/tjB9gTv66u
— Manam Saitham kadambari kiran (@manamsaitham) April 12, 2022
నేను ఎదురుపడితే రామ్ చరణ్ "ఆపాప ఎలా వుంది కాదంబరి గారూ?" అని అడిగారు. అతని వ్యక్తిత్వానికి నాకు గుండె నిండిపోయింది.
— Manam Saitham kadambari kiran (@manamsaitham) April 12, 2022
బంగారు చెంచాతో పుట్టడం వేరు, బంగారు మనసుతో బతకడం వేరు. ప్రియ చరణ్! నీకు భగవదాశీస్సులు.
Comments
Please login to add a commentAdd a comment