
చెక్ అందిస్తున్న వీవీ వినాయక్, కాదంబరి కిరణ్
నటుడు కాదంబరి కిరణ్ సారథ్యంలోని ‘మనం సైతం’ ఆధ్వర్యంలో కరోనా కాలంలో ఇప్పటికే వేలాదిమందికి వంట సరుకులు ఉచితంగా అందించిన సంగతి తెలిసిందే. తాజాగా 230 మంది సినీ కార్మికులు, నిరుపేదలకు మంతెన వెంకట రామరాజువారి ‘వసుధ ఫౌండేషన్’ ద్వారా ఆర్థికసాయం అందించారు. దర్శకులు వీవీ వినాయక్, హీరోయిన్ పూనమ్ కౌర్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. కాదంబరి కిరణ్ చేస్తున్న నిస్వార్థ సేవకు తమ వంతుగా మరింత ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశ్యంతో ‘మనం సైతం’ కు ‘వసుధ ఫౌండేషన్’ చేయూత అందిస్తోందని మంతెన వెంకట రామరాజు అన్నారు. అనంతరం పూనమ్ కౌర్ చేతుల మీదుగా ‘మనం సైతం’ కార్యాలయం వద్ద మొక్క నాటించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, బీబీజీ రాజు, ‘మనం సైతం’ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment