'మా' అమ్మకు 700 మంది పిల్లలు: కాదంబరి | kadambari kiran kumar supports rajendra prasad | Sakshi
Sakshi News home page

'మా' అమ్మకు 700 మంది పిల్లలు: కాదంబరి

Published Wed, Mar 25 2015 5:31 PM | Last Updated on Sat, Sep 2 2017 11:22 PM

'మా' అమ్మకు 700 మంది పిల్లలు: కాదంబరి

'మా' అమ్మకు 700 మంది పిల్లలు: కాదంబరి

హైదరాబాద్: మూవీ ఆర్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో సినిమా పాలిటిక్స్ వేడేక్కాయి. అధ్యక్ష బరిలో నిలిచిన రాజేంద్రప్రసాద్ ప్యానల్ బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం పెట్టి మురళీమోహన్ వర్గంపై విరుచుకుపడింది. నాగబాబు, శివాజీ రాజా, కాదంబరి కిరణ్ కుమార్... రాజేంద్రప్రసాద్ కు మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ... మూవీ ఆర్ట్ అసోసియేషన్(మా) తమకు అమ్మ లాంటిదనాన్నరు. 'మా' అమ్మకు 700 మంది పైచిలుకు పిల్లలున్నారని చెప్పారు. తమ అసోసియేషన్ పేద కళాకారులకు ఎందుకు దూరమవుతుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో కొంతమంది కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పేద కళాకారులకు సేవ చేయాలన్న లక్ష్యంతో బతుకుతున్నానని కిరణ్ తెలిపారు. తన ఊపిరి ఉన్నంతవరకు సేవ చేస్తూనే ఉంటానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement