ఇటు తెలంగాణలో అటు సీమాంధ్రలో పీఆర్‌టీయూ ద్వంధ్వ వైఖరి అవలంభిస్తోందంటూ టీఆర్‌ఎస్ మద్ధతుతో గెలిచిన ఎమ్మెల్సీ పాతూరి సుధాక ర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీఆర్‌టీయూ, పీఆర్‌టీయూ ఎమ్మెల్సీలు మండి పడ్డారు. తెలంగాణ ఉద్యమం కోసం స్వచ్ఛందంగా తాము పని చేస్తున్నామని పేర్కొన్నారు. 2011 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సమైక్య సంఘం మద్ధతు పొంది ఓడిపోయిన సుధాకర్‌రెడ్డి ఇపుడు టీఆర్‌ఎస్ చేరి టీఆర్‌ఎస్‌ను, తెలంగాణ ఉద్యమాన్ని సొంత రాజకీయ ప్రయోజనాలకు, ఎమ్మెల్సీగా గెలుపొందేందుకు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.
పీఆర్‌టీయూను, పీఆర్‌టీయూ ఎమ్మెల్సీలను విమర్శించే హక్కు సుధాకర్‌రెడ్డికి లేదన్నారు. హైదరాబాద్‌లోని పీఆర్‌టీయూ కార్యాలయంలో ఎమ్మెల్సీలు జనార్ధన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, రవీందర్‌లు విలేకరులతో మాట్లాడారు. సకల జనుల సమ్మె సందర్భంగా తెలంగాణలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలను కూడగట్టి టీటీజేఏసీని ఏర్పాటు చేసి ఛైర్మన్‌గా పూల రవీందర్ నేతృత్వంలో తాము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లామని పేర్కొన్నారు. తరువాత సమ్మెలో పాల్గొన టీచర్లకు ఆన్‌డ్యూటీ సదుపాయం ఇప్పించిన ఘనత కూడా తమదేనన్నారు.
తాము సకల జనుల సమ్మె, ఉద్యమం చేస్తున్న సమయంలో నీవెక్కడున్నావని సుధాకర్‌రెడ్డిని విమర్శించారు. ఎమ్మెల్సీగా గెలుపొందేందుకు టీఆర్‌ఎస్‌లో చేరి తెలంగాణ పేరుతో గెలిచావని దుయ్యబ ట్టారు. తాము మాత్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం స్వచ్ఛందంగా పనిచేశామని, తెలంగాణ పేరుతో, ఉద్యమం పేరుతో తాము ఏనాడు రాజకీయ ప్రయోజనాలు పొందలేదని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డిపై పీఆర్‌టీయూ ధ్వజం
Published Wed, Sep 11 2013 9:29 PM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM
Advertisement
Advertisement