Paturi Sudhakar Reddy
-
కుర్చీల కొట్లాటలో భాగమే బస్సు యాత్ర
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న కుర్చీల కొట్లాటలో భాగంగానే బస్సు యాత్ర జరుగుతున్నదని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ విప్ బి.వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, భూపాల్‌రెడ్డితో కలిసి బుధవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పెత్తనంకోసం ఈ కుర్చీల కొట్లాట జరుగుతున్నదన్నారు. రైతు సమన్వయ సమితులను రౌడీ సమితులు అంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడటం దారుణమని, దీనిపై తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఆ మాటలను కాంగ్రెస్ నేతలు ఉపసంహరించుకోవాలన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్వయంగా చెప్పినా గత ఎన్నికల్లో ప్రజలు నమ్మలేదని, భవిష్యత్తులోనూ ఆ పార్టీని నమ్మరని పాతూరి అన్నారు. ప్రభుత్వ విప్ బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులను రౌడీలు అంటూ మాట్లాడిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల బస్సుయాత్ర ఎందుకో వారికే తెలియదన్నారు. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ అబద్ధాలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలపై 420 కింద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. -
రైతుల దుస్థితికి గత పాలకులే కారణం: పాతూరి
సాక్షి,హైదరాబాద్: వ్యవసాయ రంగంలో తెలంగాణను అగ్ర భాగాన నిలబెట్టడం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని శాసనమండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ రైతు సంక్షేమం కోసం తీసు కుంటున్న చర్యల ఫలితాలు ఇప్పటికే కనిపి స్తున్నాయన్నారు. వచ్చే ఏడాది నుంచి పెట్టుబడి పథకం కింద ఎకరాకు రూ.8 వేల పంపిణీ వ్యవసాయ రంగంలో సరికొత్త శకానికి నాంది పలకబోతోందన్నారు. ప్రస్తుతం రైతుల దుస్థితికి గత పాలకులు వ్యవసాయ రంగం మీద చూపిన నిర్లక్ష్యమే కారణమన్నారు. సెప్టెంబర్ 1,2 తేదీల్లో కడపలో జరిగే పీపుల్స్ పార్లమెంట్ బ్రోచర్‌ను పాతూరి శాసనమండలిలోని ఆయన కార్యాల యంలో ఆవిష్కరించారు. పీపుల్ ఎగైనెస్ట్ కరప్షన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుకు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల ను ఆహ్వానించడం శుభపరిణామమన్నారు. -
జోనల్ విధానమే టీచర్లకు మేలు: పాతూరి
హైదరాబాద్: జోనల్ విధానం రద్దు వల్ల ఉపాధ్యాయులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలంగాణ శాసనమండలి సభ్యుడు పాతూరి సుధాకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం లక్డీకాపూల్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ... నెలరోజుల్లో ఉపాధ్యాయుల సర్వీస్‌రూల్స్ సాధించ నున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సమస్యలన్నీ ఆమోదయోగ్యమైనవని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ ఎస్సీ, ఎస్టీ విద్యార్థి రెసిడెన్షియల్ పాఠశాలలోనే విద్య కొనసాగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఏప్రిల్ చివరివారంలో తెలంగాణ విద్యా మహాసభ నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనోతు కిషన్ నాయక్, ప్రధాన కార్యదర్శి కై లాసం, గౌరవాధ్యక్షుడు సంతోష్ నాయక్, హరిలాల్, తిరుపతి పలుజిల్లాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
అవినీతికి బ్రాండ్ అంబాసిడర్లు
కాంగ్రెస్ నేతలపై పాతూరి సుధాకర్‌రెడ్డి సాక్షి , హైదరాబాద్: అవినీతికి బ్రాండ్ అంబాసిడర్లు కాంగ్రెస్ పార్టీ నేతలని శాసన మండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మిషన్ కాకతీయ వంటి పథకంపై కూడా వారు విషం కక్కుతున్నారన్నారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌తో కలసి శనివారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం లో మాట్లాడారు. మిషన్ కాకతీయతో తాము ప్రజలకు దగ్గరవుతు న్నామనే, కాంగ్రెస్ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల్లో ఎన్ని టీఎంసీల నీళ్లు చేరాయో కూడా వారికి కనీస పరిజ్ఞానం లేదన్నారు. ప్రజల అవసరాలను గమనించి ఎప్పటికపుడు తగిన నిర్ణయాలు తీసుకుంటున్న హరీశ్‌రావు వంటి సమర్థ మంత్రిపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. తప్పుడు ప్రచారం మానుకోండి: కాంగ్రెస్ నాయకులు మిషన్ కాకతీయ పథకం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఈ పథకాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించిన విషయాన్ని కూడా గుర్తించరా అని నిలదీశారు. మిషన్ కాకతీయ ఫలితాలను ఈ ఖరీఫ్ లో ఇప్పటికే తెలంగాణ ప్రజలు చూశారన్నారు. కాగా, పెద్ద నోట్ల రద్దు విషయం కొందరికి ముందే లీక్ అరుుందనే ఆరోపణలు చాలా తీవ్రంగా పరిగణించాల్సినవని, దీనిపై కేంద్రం విచారణ జరిపించి వాస్తవాలు వెలుగులోకి తేవాలని ఎంపీ బూర కోరారు. -
రాజ్ భవన్ ను రాజకీయ కేంద్రం చేశారు
కాంగ్రెస్ నేతలపై పాతూరి ధ్వజం సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్.. తన పుట్టిన రోజు సందర్భంగా చెప్పిన మంచి మాటలను కూడా కాంగ్రెస్ నేతలు తప్పు పట్టడం వారి దిక్కుమాలిన రాజకీయాలకు నిదర్శనమని మండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. తమ హయాంలో గవర్నర్ పదవులను రాజకీయాలకు వాడుకుని రాజ్‌భవన్‌ను రాజకీయ కేంద్రంగా మార్చిన చరిత్ర గల కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు రాజ్‌భవన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సరికాదన్నారు. -
రైతుల పేరిట నీచ రాజకీయాలు
కాంగ్రెస్‌పై పాతూరి ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నాయకులు గర్జనల పేరిట నీచ రాజకీయాలు చేస్తున్నారని శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. మహబూబాబాద్ రైతు గర్జన సభలో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి.. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుపై అనవసర విమర్శలు చేశారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, రుణమాఫీతో రైతులు సంతోషంగా ఉంటే కాంగ్రెస్ నేతలేమో అక్కసుతో నిరసనలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన గత పాలకుల పక్షపాత ధోరణి వల్లే కృష్ణా ట్రిబ్యునల్‌లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల సమస్యలను పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. -
ఉద్యోగుల ఆందోళనను ప్రభుత్వానికి వివరిస్తా: పాతూరి
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌పై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు. 2004లో అమలులోకి వచ్చిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గురువారం ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించిన నేపథ్యంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల ఫలితంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలులోకి వచ్చిందన్నారు. తమ ప్రభుత్వానికి ఆ స్కీము అమలుతో ఎలాంటి సంబంధం లేదని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. అయినా, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లను ప్రభుత్వానికి నివేదిస్తానని సుధాకర్ రెడ్డి వివరించారు. -
నిజాం, భూస్వామ్య పాలనను కీర్తిస్తారా?
* పాఠ్యాంశాల్లో చేర్చే అంశంపై వివాదం లేపిన కె.నాగేశ్వర్ వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చరిత్రను, పోరాట యోధుల గాథలను పాఠ్యాంశాలుగా చేర్చే అంశం శాసనమండలిలో కొద్దిసేపు గందరగోళం సృష్టించింది. అధికార, విపక్ష సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో మండలి అట్టుడికింది. కొత్త రాష్ట్రంలో తెలంగాణ కవులు, కళాకారులు, అమరవీరుల జీవిత చరిత్రలను పాఠ్యాంశాల్లో చేర్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందా? అని ఎమ్మెల్సీ పాటూరి సుధాకర్‌రెడ్డి ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సమాధానమిస్తూ... ‘‘ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ చరిత్రను, సంస్కృతిని మరిచిపోయేట్టు చేశారు. పాఠ్యాంశాల్లో తెలంగాణ సంస్కృతి, చరిత్ర, కాకతీయుల నుంచి కుతుబ్‌షాలు, ఆజాం జాహీలు, నిజాంల వరకు సాగిన పాలన, వారిపై పోరాడిన వారి గురించి, తెలంగాణ కోసం పోరాడిన వారి గురించి పాఠ్యాంశాల్లో చేరుస్తాం. తెలంగాణ గత చరిత్ర, భౌగోళిక స్వరూపాల గురించి కూడా పొందుపరుస్తాం. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేశాం..’’ అని వెల్లడించారు. దీనిపై ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ... మంత్రి మాటలు వింటుంటే నిజాం పాలనను గొప్పదిగా కీర్తిస్తూ పాఠాలు నేర్పుతారేమోనని అనుమానం వస్తోందని వ్యాఖ్యానించారు. ‘‘నిజాం పాలనలో భూస్వాముల అకృత్యాలను, వారి వల్ల చనిపోయిన 4 వేల మంది గురించి దాచిపెడతారా? తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకొచ్చిందో మరిచి పోయి నిజాం పాలన గొప్పదని పాఠ్యాంశాల్లో చేరుస్తారా?..’’ అని ప్రశ్నించారు. దీంతో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ... దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కొమరం భీమ్, రావి నారాయణరెడ్డి, షోయబుల్లా ఖాన్ వంటి తెలంగాణ పోరాట యోధుల గురించి చెప్పినప్పుడు నిజాంను కీర్తించడమెలా అవుతుందని ప్రశ్నించారు. ‘‘కాకతీయుల పాలన గొప్పతనాన్ని చెబుతూనే.. వారిపై పోరాడిన సమ్మక్క-సారక్కల గురించి కూడా చెబుతామని అంటున్నాం. హైదరాబాద్‌కు పునాదులు వేసిందెవరో.. జూబ్లీహాల్, ఆర్ట్స్ కాలేజ్, ఉస్మానియా హాస్పిటల్, అసెంబ్లీని కట్టి అభివృద్ధి చేసిందెవరో చెప్పకుండా చరిత్రను వక్రీకరించాలా? నిజాంసాగర్‌ను కట్టి, ైరె ల్వే లైన్లు వేసిన నిజాం గురించి విద్యార్థులకు తెలపడం తప్పా? నిజాం పాలనతో పాటు ఆయన హయంలో చివరి రోజుల్లో జరిగిన అకృత్యాల గురించీ పాఠ్యాంశాల్లో చేర్చేందుకు కమిటీ పనిచేస్తుంది’’ అని మంత్రి పేర్కొన్నారు. నాగేశ్వర్ వినకుండా నిజాం అందించింది గొప్ప పాలనే కానీ కొన్ని పొరపాట్ల కారణంగా కొమరం భీమ్, చాకలి ఐలమ్మ వంటి వారు పోరాడాల్సి వచ్చిందని చెప్పే ప్రయత్నం జరుగుతుందేమోనని వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ చరిత్రను పాఠ్యాంశాల్లో చేరుస్తామని మంత్రి చెబుతోంటే అందులో తప్పులు వెతికి, తామే అన్నట్లుగా వ్యవహరించడం మంచిది కాదని నాగేశ్వర్‌కు సూచించారు. -
సీఎం కిరణ్ రాజీనామా చేయాలి
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమానికి నాయకత్వం వహించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి సూచించారు. శనివారం స్థానిక ఐబీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్రలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు ఐక్యమై తమ పదవులకు రాజీనామా చేశారని తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజల మనోభావాలను గౌరవించకుండా పదవులను అంటిపెట్టుకొని వేలాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాంత మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. సీఎం కిరణ్ మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకి అన్నారు. ఆయన సమైక్యాంధ్రకు మద్దతు పలుకుతున్నందున రాజీనామా చేసి ఉద్యమానికి సారధ్యం వహించాలని సూచించారు. తెలంగాణ ఏర్పడితే జల వివాదాలు ఏర్పడతాయని సీఎం వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికే కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో జల వివాదాలు ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వివాదాలను జాతీయ జల వనరుల కమిటీ పరిష్కరి స్తుందని, అది తీసుకునే నిర్ణయానికి ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉంటే చాలన్నారు. మద్రాసు నుంచి సీమాంధ్రులను తరిమికొడితే పైసా పెట్టుబడి లేకుండా హైదరాబాద్‌కు వచ్చి కోటీశ్వరులయ్యారన్నారు. ఉద్యోగాల విషయంలో జరిగిన అన్యాయాన్ని సహించలేకనే తెలంగాణ ఉద్యమం లేవదీశామని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా ఉద్యోగావకాశాలు రాకుండా పోతాయని సీఎం ప్రకటించడం సిగ్గుచేటన్నారు. లోకల్ కేటగిరీలో సీఎం గణాంకాల ప్రకారమే సచివాలయంలో 19వేల మంది ఉన్నారని దీనిని పరిశీలిస్తే తెలంగాణ ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని కోరితే కేంద్రం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించిన సీఎం ఇప్పుడు ఎందుకు అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ సంక్షోభం ద్వారానే తెలంగాణ ఏర్పడుతుందని అందుకోసం తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలన్నారు. 29న నిర్వహించే సకల జన భేరికి భారీ సంఖ్యలో తెలంగాణ వాదులు తరలి రావాలని ఆయన కోరారు. సమావేశంలో తెలంగాణ పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాలస్వామి, జిల్లా అధ్యక్షుడు లచ్చిరెడ్డి, నాయకులు కృష్ణమూర్తి, ఎండీ గౌస్, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. సీఎంను బర్తరఫ్ చేయాలి వెల్దుర్తి: తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సమైక్యవాద సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని టీఆర్ఎస్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు మదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం వారు వెల్దుర్తిలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం పెట్టిన భిక్షతో సీఎం అయిన కిరణ్ కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించడం దుర్మార్గ చర్య అన్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏకమై కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో తలపెట్టిన సకల జనభేరి విజయవంతం చేసేందుకు నర్సాపూర్ నియోజకవర్గం నుంచి 15 బస్సులు, 50 సుమోల్లో 1500 మంది ఉద్యోగులు, విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివెళుతున్నారన్నారు. సభలో మంత్రులు, అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు విధిగా పాల్గొనాలని సూచించారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు కోదండ క్రిష్ణాగౌడ్, స్థానిక సర్పంచ్ మోహన్‌రెడ్డి, శివ్వంపేట పీఏసీఎస్ చెర్మైన్ వెంకటరామిరెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నేతలు నర్సింలు, భూపాల్‌రెడ్డి, కర్రె వెంకటేశ్, హన్మంత్‌రెడ్డి,టీఆర్ఎస్వీ నాయకుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సీమాంధ్ర పక్షపాతి సీఎం కిరణ్ జిన్నారం: తెలంగాణ ఆకాంక్షను మరోసారి చాటేందుకు నిర్వహిస్తున్న సకలజనభేరి కార్యక్రమంలో తెలంగాణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్ పిలుపునిచ్చారు. సకలజనభేరీని విజయవంతం చేయాలని కోరుతూ స్థానిక గురుకుల పాఠశాల విద్యార్థులు శనివారం ‘సకలజన భేరి’ పేరున మానవహారంగా ఏర్పడి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేశంగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవడం హర్షనీయమన్నారు. సీఎం తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించకుండా, సమైకాంధ్రకు మద్దతు పలకటం సరి కాదన్నారు. సీఎం వెంటనే రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. సీఎం కనుసన్నల్లోనే సీమాంధ్ర ఉద్యమం నడుస్తోందన్నారు. తెలంగాణ సత్తా మరోసారి చాటేందుకు సకల జనభేరిలో ప్రతి ఒక్క తెల ంగాణవాది పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సుదర్శన్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, పార్టీ నాయకులు సంజీవ, నర్సింగ్‌రావు, వెంకటేశ్, శంకరప్ప, బ్రహ్మేందర్గౌడ్, నరేందర్, రవి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డిపై పీఆర్టీయూ ధ్వజం
ఇటు తెలంగాణలో అటు సీమాంధ్రలో పీఆర్టీయూ ద్వంధ్వ వైఖరి అవలంభిస్తోందంటూ టీఆర్ఎస్ మద్ధతుతో గెలిచిన ఎమ్మెల్సీ పాతూరి సుధాక ర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీఆర్టీయూ, పీఆర్టీయూ ఎమ్మెల్సీలు మండి పడ్డారు. తెలంగాణ ఉద్యమం కోసం స్వచ్ఛందంగా తాము పని చేస్తున్నామని పేర్కొన్నారు. 2011 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సమైక్య సంఘం మద్ధతు పొంది ఓడిపోయిన సుధాకర్‌రెడ్డి ఇపుడు టీఆర్ఎస్ చేరి టీఆర్ఎస్ను, తెలంగాణ ఉద్యమాన్ని సొంత రాజకీయ ప్రయోజనాలకు, ఎమ్మెల్సీగా గెలుపొందేందుకు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. పీఆర్టీయూను, పీఆర్టీయూ ఎమ్మెల్సీలను విమర్శించే హక్కు సుధాకర్‌రెడ్డికి లేదన్నారు. హైదరాబాద్‌లోని పీఆర్టీయూ కార్యాలయంలో ఎమ్మెల్సీలు జనార్ధన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, రవీందర్‌లు విలేకరులతో మాట్లాడారు. సకల జనుల సమ్మె సందర్భంగా తెలంగాణలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలను కూడగట్టి టీటీజేఏసీని ఏర్పాటు చేసి ఛైర్మన్‌గా పూల రవీందర్ నేతృత్వంలో తాము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లామని పేర్కొన్నారు. తరువాత సమ్మెలో పాల్గొన టీచర్లకు ఆన్‌డ్యూటీ సదుపాయం ఇప్పించిన ఘనత కూడా తమదేనన్నారు. తాము సకల జనుల సమ్మె, ఉద్యమం చేస్తున్న సమయంలో నీవెక్కడున్నావని సుధాకర్‌రెడ్డిని విమర్శించారు. ఎమ్మెల్సీగా గెలుపొందేందుకు టీఆర్ఎస్లో చేరి తెలంగాణ పేరుతో గెలిచావని దుయ్యబ ట్టారు. తాము మాత్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం స్వచ్ఛందంగా పనిచేశామని, తెలంగాణ పేరుతో, ఉద్యమం పేరుతో తాము ఏనాడు రాజకీయ ప్రయోజనాలు పొందలేదని స్పష్టం చేశారు.