జోనల్ విధానమే టీచర్లకు మేలు: పాతూరి
హైదరాబాద్: జోనల్ విధానం రద్దు వల్ల ఉపాధ్యాయులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలంగాణ శాసనమండలి సభ్యుడు పాతూరి సుధాకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం లక్డీకాపూల్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ... నెలరోజుల్లో ఉపాధ్యాయుల సర్వీస్‌రూల్స్ సాధించ నున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సమస్యలన్నీ ఆమోదయోగ్యమైనవని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రతీ ఎస్సీ, ఎస్టీ విద్యార్థి రెసిడెన్షియల్ పాఠశాలలోనే విద్య కొనసాగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఏప్రిల్ చివరివారంలో తెలంగాణ విద్యా మహాసభ నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనోతు కిషన్ నాయక్, ప్రధాన కార్యదర్శి కై లాసం, గౌరవాధ్యక్షుడు సంతోష్ నాయక్, హరిలాల్, తిరుపతి పలుజిల్లాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.