కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌పై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు. 2004లో అమలులోకి వచ్చిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గురువారం ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించిన నేపథ్యంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల ఫలితంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలులోకి వచ్చిందన్నారు. తమ ప్రభుత్వానికి ఆ స్కీము అమలుతో ఎలాంటి సంబంధం లేదని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. అయినా, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లను ప్రభుత్వానికి నివేదిస్తానని సుధాకర్ రెడ్డి వివరించారు.
ఉద్యోగుల ఆందోళనను ప్రభుత్వానికి వివరిస్తా: పాతూరి
Published Thu, Sep 1 2016 7:04 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement