సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులకు బదిలీ కేటాయింపు వివరాలను ఈ నెల 25 లోగా ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా పంపే అవకాశం ఉందని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎం. కమలాకరరావు, ప్రధాన కార్యదర్శి భైరి అప్పారావులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న బదిలీలలో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగియడంతో నూతన పాఠశాల వివరాలను వెల్లడించనున్నారు.
అయితే టీచర్లు వెంటనే తమ ప్రస్తుత స్కూల్ నుంచి కొత్త పాఠశాలకు బదిలీ అయితే జీతభత్యాల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసులు నాయుడు, బచ్చల పుల్లయ్యలతో కలసి పాఠశాల విద్యాశాఖ కమిషనర్, డెరైక్టర్ పి. సంధ్యారాణికి పరిస్థితిని వివరించామన్నారు. దీంతో టీచర్లను ప్రస్తుత స్థానం నుంచి ఈ నెల 31న రిలీవ్ చేసి వచ్చే నెల 1వ తేదిన నూతన పాఠశాలలో చేరేందుకు అంగీకరించినట్లు తెలిపారు.
25లోగా టీచర్ల బదిలీ కేటాయింపులు
Published Sun, Oct 18 2015 8:34 AM | Last Updated on Sun, Sep 3 2017 11:10 AM
Advertisement
Advertisement