
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మంగళవారం ఝలక్ ఇచ్చింది. ఉపాధ్యాయుల బదిలీలపై నెలపాటు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బదిలీల నిబంధనలపై నాన్ స్పౌజ్ టీచర్ల అసోసియేషన్ పిటిషన్ వేయగా.. హైకోర్టు విచారణకు స్వీకరించింది.
అయితే.. టీచర్ల బదిలీల నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్లు వాదించారు. ప్రభుత్వ ఉద్యోగ దంపతులు, గుర్తింపు యూనియన్ నేతలకు అదనపు పాయింట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మార్చి 14 వరకు బదిలీలపై స్టే విధించిన హైకోర్టు.. కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment