హైదరాబాద్: రాష్ట్ర విభజనపై చిక్కులు ఏర్పడతాయన్నది అపోహలు మాత్రమేనని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలిపారు. కొందరు లేనిపోని అపోహలు కల్పిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారన్నారని పీఆర్ టీయూ ఆధ్వర్యంలో తెలంగాణపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఆర్టికల్ 371 Dని వెంటనే సవరించాలని పీఆర్ టీయూ సభ్యులు కోరారు. రాష్ట్ర విభజనపై చిక్కులు ఏర్పడతాయన్నది అపోహలేనని ఈ సందర్భంగా మంత్రి జానారెడ్డి తెలిపారు.
ఉపాధ్యాయులకు తాత్కాలిక భృతి విడుదలకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్సాటుతో సీమాంధ్రులకు ఎలాంటి నష్టం వాటిల్లదని మరో మంత్రి డి.కె.అరుణ పేర్కొన్నారు. తెలంగాణలో సీమాంధ్రలకు అభద్రత అవసరం లేదని ఆమె తెలిపారు.