ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
Published Sat, Aug 20 2016 10:17 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
పెన్‌పహాడ్ : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు పీఆర్‌టీయూ టీఎస్ ఎల్లప్పుడు కృషి చేస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు సుంకరి భిక్షంగౌడ్, కార్యదర్శి కోమటిరెడ్డి నర్సింహారెడ్డిలు అన్నారు. శనివారం మండల కేంద్రంతో పాటు అన్ని పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనాజిపురం ఆదర్శ పాఠశాలలోని ఉపాధ్యాయులు సంఘంలో చేరారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియంతో పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా వలంటీర్లను నియమించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జీపీఎఫ్ ఏరియల్స్ డిసెంబర్ లోపు వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు తంగెళ్ల జితేందర్‌రెడ్డి, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోదేశి దయాకర్, అల్లాడి సత్యనారాయణగౌడ్, రాష్ట్ర నాయకులు చవగాని వెంకయ్యగౌడ్, మేకల రాజశేఖర్, జిల్లా నాయకులు మామిడి వెంకటయ్య, సంధ్యాల వినోద్, జి. ప్రవీన్, నల్లా శ్రీనివాస్, అనంతుల వెంకట్‌రెడ్డి, మెంచు వెంకన్నగౌడ్, అజ్మత్‌ఉన్నిసా, జమాల్‌షరీఫ్, రోజా రాణి, ప్రమీల, బీఎస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement