Penpahad
-
పండగపూట విషాదం; కుమారుడి పుట్టినరోజు కేక్ కోసమని వెళ్లి
ఓ వైపు బక్రీద్ పర్వదినం.. మరో వైపు కుమారుడి పుట్టినరోజు వేడుక.. రెండు విశేషాలు ఒకే రోజు రావడంతో ఆ ఇంట ఆనందోత్సవాలు వెల్లివిరిసాయి. తొలుత పర్విదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు.. సమీప బంధువుల రాకతో ఆ ఇంట్లో సందడి నెలకొంది. తదనంతరం కుమారుడి పుట్టిన రోజు వేడుక నిర్వహణకు కేక్ తెచ్చేందుకు సమీప బంధువుతో కలిసి వెళ్లిన తండ్రిని సిమెంట్ ట్యాంకర్ రూపంలో వచ్చిన మృత్యువు కబళించడంతో పండుగ పూట ఆ ఇంట పెను విషాదం అలుముకుంది. జుపెన్‌పహాడ్ : మండల కేంద్రానికి చెందిన షేక్ జమాల్(33)కు భార్య, కుమారుడు, కుమార్తె సంతానం. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం బక్రీద్ పర్వదినంతో పాటు కుమారుడి పుట్టినరోజు కూడా కలిసి రావడంతో సంతోషించాడు. వేడుకకు సమీపం బంధువులను కూడా ఆహ్వానించాడు. ఉదయం మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్ తెచ్చేందుకు వెళ్తుండగా.. మధ్యాహ్నం వరకు జమాల్ సంతోషంగా ఇంట్లోనే గడిపాడు. అనంతరం కుమారుడి పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించేందుకు, అందుకు అవసరమైన కేక్ తదితర సామగ్రి తీసుకువచ్చేందుకు బంధువు లతీఫ్‌తో కలిసి బైక్‌పై సూర్యాపేటకు బయలుదేరాడు. మార్గమధ్యలో సింగారెడ్డిపాలెం గ్రామ శివారుకు చేరుకోగానే సూర్యాపేట నుంచి గరిడేపల్లి వైపు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ ఢీకొట్టడంతో షేక్ జమాల్ అక్కడికక్కడే మృతిచెందగా షేక్ లతీఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం మేరకు పో లీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి యాకూబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటరత్నం తెలిపారు. ఇనుప బోర్డును ఢీకొట్టి ఒకరు.. కోదాడ రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని దోరకుంట సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామానికి చెందిన షేక్ బషీర్ (35) బైక్‌పై కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్దకు వచ్చాడు. బక్రీదు పండుగ సందర్భంగా చికెన్ తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో గ్రామశివారులోని పెట్రోలు బంకు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఇనుప బోర్డును ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన బషీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య శంషాద్ భేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ వై.సైదులు తెలిపారు. -
దురాశతో భార్యాభర్తల హత్య
పెన్‌పహాడ్: ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ట్రాక్టర్ పొందిన ఓ లబ్ధిదారుడు తనకు పరిచయం ఉన్న మరో వ్యక్తికి లక్ష రూపాయల గుడ్‌విల్ ఇవ్వాలన్న ఒప్పందం మేరకు దానిని ఇచ్చాడు. ట్రాక్టర్ తీసుకున్న వ్యక్తి సబ్సిడీ పోను మిగతా డబ్బును ఫైనాన్స్‌లో నెలనెలా కిస్తీల రూపంలో కట్టాల్సి ఉంది. కాగా, ట్రాక్టర్ తీసుకున్న వ్యక్తి.. అసలు లబ్ధిదారుడు చనిపోతే ఫైనాన్స్ రుణం మాఫీ అవుతుందన్న దురాలోచనతో మద్యంలో సైనెడ్ కలిపి ఇచ్చాడు. అది తాగిన భార్యాభర్తలు ఇద్దరూ చనిపోయారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలో ఆలస్యంగా శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రంజిత్‌రెడ్డి కథనం ప్రకారం.. పెన్‌పహాడ్ మండలం మొర్సకుంటతండాలో ఈనెల 3న భార్యాభర్తలు లాల్‌సింగ్, లక్ష్మిలు అనుమానాస్పదస్థితిలో మృతిచెందగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించారు. ఈ కేసుపై పోలీసులు తండాలో విచారణ జరపగా ట్రాక్టర్ విషయం తెలిసింది. దీంతో లాల్‌సింగ్ వద్ద ట్రాక్టర్ తీసుకున్న అదే తండాకు చెందిన దుర్గయ్య అనే వ్యక్తిని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. కిస్తీలు కట్టలేక దురాలోచన.. లాల్‌సింగ్‌కు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన ట్రాక్టర్‌ను గుడ్‌విల్‌కు తీసుకున్న పల్లపు దుర్గయ్య, సబ్సిడీపోను మిగతా డబ్బులకు సీఎన్‌హెచ్ క్యాపిటల్ ఫైనాన్స్ అనే హైదరాబాద్ కంపెనీ ద్వారా రుణం తీసుకొని నెలవారీగా కిస్తులు చెల్లించడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడు. అయితే దుర్గయ్య వాయిదాల ప్రకారం డబ్బులు చెల్లించకపోవడంతో ఆ కంపెనీ వారు ట్రాక్టర్ కోసం పలుమార్లు తండాకు వచ్చారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుడు చనిపోయినట్లయితే రుణంమాఫీ అవుతుందనే దురాలోచనలతో లాల్సింగ్ను అంతమొందించాలని దుర్గయ్య పథకం పన్నాడు. రోజూ మద్యం సేవించే అలవాటు ఉన్న లాల్‌సింగ్‌కు దుర్గయ్య ఈ నెల 3వ తేదీన మద్యం సీసాలో సైనెడ్ పౌడర్ కలిపి ఇచ్చాడు. లాల్‌సింగ్ ఇంటికి వెళ్లి భార్యతో కలసి ఆ మద్యాన్ని తాగాడు. దాంతో వారు దుర్మరణం చెందారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వర్రావు పర్యవేక్షణలో లోతుగా విచారణ చేసి దుర్గయ్యే వారిని చంపినట్లు ఆధారాలు సేకరించారు. నిందితుని అరెస్టు చేశారు. -
పంటలకు ఊరటనిచ్చిన వర్షం
పెన్‌పహాడ్ మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్లో తొలకరి జల్లులు కురవడంతో రైతులు పరుగు పరుగున పొలాలకు వెళ్లి పంటల సాగుకు సిద్ధం చేశారు. తీరా విత్తనాలు నాటి అవి మొలకెత్తినప్పటి నుంచి వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు ఆందోళనలో పడ్డారు. ఈ క్రమంలో చివరకు అవి మొలకెత్తి వర్షాల కోసం ఆకాశం వంక ఎదురు చూడడంతో మండల వ్యాప్తంగా సుమారు 10శాతం పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. వర్షాభావ పరిస్థితులకు తట్టుకొని నిలిచిన పంటలు మాత్రమే నిలిచి ఉన్నాయి. మరో వారం రోజుల పాటు వర్షాలు పడకుంటే మండలం వ్యాప్తంగా వేసిన పంటలన్నీ ఎండిపోయేవి. కానీ రెండు రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలు రైతులకు ఆనందాన్ని కలిగించగా పంటలకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు. మొత్తానికి ఈ వర్షాలు ఉన్న పంటలకు ఊరటనిచ్చే వర్షాలని రైతులు చెప్పుకుంటున్నారు. పొలాలకు తరలిన రైతులు... వర్షాల కోసం నిత్యం ఎదురు చూసిన రైతులకు మూడు రోజులుగా పడుతున్న వర్షాలు పంటలపై ఆశలు రేకెత్తించాయి. ఇప్పటికే కలుపు తీసేందుకు, ఎరువులు చల్లేందుకు వేల రూపాయల్లో పెట్టుబడులు పెట్టారు. పంటలు పెరిగే దశలో వర్షాలు లేక చివరి దశలోకి వచ్చే సరికి వరుణుడు కరుణ చూపడంతో వాలిపోయిన మొక్కలకు ప్రాణం లేచివచ్చింది. కుంగిపోతున్న పంటలు నిటారుగా లేచాయి. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తంమవుతోంది. ఎండ తీవ్రత తగ్గి ఆకాశం మేఘావృతంగా మారింది. దీంతో మరి కొన్ని రోజుల పాటు వర్షాలు పడుతాయని రైతులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. బీడు భూముల్లో సాగు ఈ ఖరీఫ్ సీజన్లో తొలకరి పలకరించినప్పటికీ తదనంతరం వర్షాలు లేక రైతులు వరి పంటలను వేసేందుకు వెనుకాడారు. అయినప్పటికీ వర్షాలు పడుతాయనే ఉద్దేశంతో నార్లు పోశారు. అయితే వర్షాలు లేకపోవడంతో పెట్టిన నార్లు పొలాల్లోనే ముదిరిపోయాయి. వర్షాలు పడితే భూములను సిద్ధం చేసి నాట్లు వేయాలనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. దీంతో మూడు ఎకరాలు నాట్లు వేయాలనుకున్న రైతు నీటి వనరులను దృష్టిలో పెట్టుకొని ఎకరం కూడా వేయని పరిస్థితి ఏర్పడింది. దీని మూలంగా సాగయ్యే భూములు పడావుగా మారిపోయాయి. కాగా మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో రైతుల్లో మరో మారు ఆశలు చిగురించాయి. పడావుగా ఉంచితే లాభమేంటని ఆలోచించిన రైతులు వర్షాలు కురుస్తాయని నమ్మి భూములను సాగుకు సిద్ధం చేసి నాట్లు వేస్తున్నారు. ఇప్పటికీ ఆకాశం మేఘావృతంగానే ఉంటూ తుంపర్లు పడుతూనే ఉన్నాయి. నెలల తరబడి ఎదురు చూస్తున్న వర్షాలు రైతులను పొలాల బాట పట్టించాయి. ల్లలు, గర్భిణులు, దర్ఘీకాలిక వ్యాధిగ్రస్తులు తీసుకోకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ నేరేళ్ల లక్ష్మి, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ కె.రామకృష్ణ, సీనియర్ సబ్లిక్ హెల్త్ అధికారి డాక్టర్ తండు మురళీమోహన్, డాక్టర్ ఎల్.రమేష్‌నాయక్, సబ్ యూనిట్ అధికారులు సముద్రాల సూరి, తీగల నర్సింహ, గవ్వా శ్రీధర్‌రెడ్డి, మనోజ్‌రెడ్డి, వెంకన్న, ఉపేందర్, నర్సింహ, ఉప్పల్‌రెడ్డి, ఇ.లోకేందర్, సబిత, నాగమణి, ఏకస్వామి, పద్మమ్మ, భిక్షం, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటికి కటకట
ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని తుమ్మలపెన్‌పహడ్ గ్రామంలో వానాకాలంలోనూ నీటి కష్టాలు తప్పడం లేదు. భూగర్భజలాలు అడుగంటి స్కీంబోర్లు పోయకపోవడం, అద్దెబోర్లకు ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో వారం రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు వ్యవసాయ పనులను మానుకొని నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు 6 వేల పైచిలుకు జనాభా కలిగిన తుమ్మలపెన్‌పహడ్ గ్రామంలో గతంలో 18 గ్రామపంచాయతీ బోర్లు ఉండగా వేసవి కాలంలో అదనంగా మరో 10 బోర్లు అద్దెకు తీసుకొని గ్రామానికి నీరు అందించారు. కాగా నేడు అద్దెబోర్లు లేకపోవడం, భూగర్భజలాలు అడుగంటడంతో 18 బోర్లల్లో 10 బోర్లు అడుగంటిపోయాయి. 8 బోర్లల్లో సైతం నీరు తక్కువగా వస్తున్నది. దీంతో గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంటుంది. ప్రధానంగా పాఠశాల చుట్టుపక్కల, ముదిరాజ్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీల్లో వారాల తరబడి నీళ్లు రావడం లేదు. దీంతో గ్రామస్తులు తప్పనిసరి పరిస్థితుల్లో ట్రాక్టర్ల ద్వారా, ఎడ్లబండ్ల ద్వారా వ్యవసాయ బావుల వద్దనుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. పాఠశాల సమీపంలో నీటిసంపు వద్ద గంటల తరబడి నిరీక్షించి నీటిని తీసుకువెళ్లుతున్నట్టు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి సమస్య ఉన్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నీటి సమస్యను తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. పనులు మానుకొని నీళ్లకు వెళ్తున్నాం– దొంతరబోయిన సోమమ్మ గ్రామంలో తీవ్ర నీటి కరువు ఉంది. అధికారులు, నాయకులు పట్టించుకోవడంలేదు. రోజుల తరబడి నీళ్లు రాకపోవడంతో వ్యవసాయ పనులు వదులుకొని నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తుంది. ట్రాక్టర్ల ద్వారా నీళ్లు కొనుగోలు చేసుకుంటున్నాం. గంటల తరబడి ఎదురుచూస్తున్నాం – పులుగుజ్జు లింగయ్య గ్రామ పంచాయతీ నీళ్లు రాకపోవడంతో వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నాం. సంపు వద్ద వచ్చేనీళ్ల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. వానాకాలంలోనే నీళ్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం –బెల్లంకొండ మంగమ్మ, సర్పంచ్, తుమ్మలపెన్‌పహాడ్ గ్రామపంచాయతీలో 18 బోర్లకు గాను10 బోర్లు అడుగంటిపోయాయి. 8 బోర్లల్లో నీళ్లు తక్కువగా వస్తున్నాయి. అద్దెబోర్లకు ప్రభుత్వ అనుమతి లేదు. దీంతో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుంది. సమస్యను అధికారులకు తెలియజేశాం. త్వరలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
పెన్‌పహాడ్ : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు పీఆర్టీయూ టీఎస్ ఎల్లప్పుడు కృషి చేస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు సుంకరి భిక్షంగౌడ్, కార్యదర్శి కోమటిరెడ్డి నర్సింహారెడ్డిలు అన్నారు. శనివారం మండల కేంద్రంతో పాటు అన్ని పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనాజిపురం ఆదర్శ పాఠశాలలోని ఉపాధ్యాయులు సంఘంలో చేరారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియంతో పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా వలంటీర్లను నియమించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జీపీఎఫ్ ఏరియల్స్ డిసెంబర్ లోపు వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు తంగెళ్ల జితేందర్‌రెడ్డి, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోదేశి దయాకర్, అల్లాడి సత్యనారాయణగౌడ్, రాష్ట్ర నాయకులు చవగాని వెంకయ్యగౌడ్, మేకల రాజశేఖర్, జిల్లా నాయకులు మామిడి వెంకటయ్య, సంధ్యాల వినోద్, జి. ప్రవీన్, నల్లా శ్రీనివాస్, అనంతుల వెంకట్‌రెడ్డి, మెంచు వెంకన్నగౌడ్, అజ్మత్‌ఉన్నిసా, జమాల్‌షరీఫ్, రోజా రాణి, ప్రమీల, బీఎస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మంచినీటి సమస్య తీర్చాలి
మాచారం (పెన్‌పహాడ్) : మండల పరిధిలోని మాచారం గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు మంగళవారం నేరేడుచర్ల–సూర్యాపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1, 2, 3వ వార్డుల్లో గత కొన్ని నెలలుగా మంచినీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. వార్డుల్లో ఉన్న చేతి పంపులు మరమ్మతులకు నోచుకోవడం లేదన్నారు. గ్రామంలో నూతన బోరు వేసి గ్రామస్తుల మంచినీటి సమస్యను తీర్చాలని వారు కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు వీరబోయిన సైదులు, నాగరాజు, రణపంగ కృష్ణ, కట్టా సైదులు, దూబని నాగమ్మ, బొల్లక దేవయ్య, మధు, సౌడయ్య, గంగరాజు, గంగమ్మ, నాగమ్మ, సైదమ్మ, కల్పన, వీరమ్మ, ఆంథోని, శ్రీరాములు, వెంకన్న, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
మృతుని కుటుంబానికి ఆర్థికసాయం
అనాజిపురం (పెన్‌పహాడ్) : మండల పరిధిలోని అనాజిపురం గ్రామానికి చెందిన యర్కచర్ల సైదులు ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. ఇతడు పీఏసీఎస్‌లో సభ్యుడిగా ఉండడంతో ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో మృతుని కుటుంబ సభ్యులకు గురువారం రూ. 10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో సూర్యాపేట ఎన్డీసీసీబీ సహకార బ్యాంకు మేనేజర్ సుగుణ్, సింగిల్ విండో చైర్మన్ నాతాల జానకిరాంరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ముదిరెడ్డి రమణారెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ దేవిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు అనుములపురి శ్రీలత, సీఈఓ ఆలకుంట్ల సైదులు, అనుములపురి శ్రీనివాస్, చెన్ను శ్రీనివాస్‌రెడ్డి, మేకల నర్సిరెడ్డి, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
పెన్‌పహాడ్ : భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కందగుండ్ల సోమయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ కార్మిక సంఘం మండల సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు జీతాలు పెంచుతున్నారు తప్పా కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. భవన నిర్మాన కార్మిక సంఘం మండల అధ్యక్షులుగా ఒగ్గు సైదులు, కార్యదర్శి ఇసుకపెల్లి రామనర్సయ్యతో పాటు 22మంది సభ్యులతో ఎన్నిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ కార్యదర్శి వెంపటి గురూజీ, డివిజన్ అధ్యక్షులు కొలిశెట్టి యాదగిరిరావు, మండల అధ్యక్షులు రణపంగ కృష్ణ, మండల కార్యదర్శి కట్టెల విజయ్‌కుమార్, ఒగ్గు సైదులు, రమణ, చిలువేరు చంద్రశేఖర్, ఇసుకపెల్లి రమణ, వెంకన్న, గోవర్ధన్, జనార్థన్, గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. -
యువకుడి వేధింపులు: విద్యార్థిని ఆత్మహత్య
పెన్‌పహాడ్ (నల్లగొండ) : తనను ప్రేమించమని ఓ యువకుడు వేధింపులకు గురిచేస్తుండటంతో మనస్తాపానికి గురైన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్ మండలం లింగాల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రావణి(15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ వినోద్(22) తనను ప్రేమించమని వెంటపడి వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.