భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి | Construction workers to solve the problem | Sakshi
Sakshi News home page

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

Published Sun, Jul 17 2016 9:31 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

పెన్‌పహాడ్‌ : భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కందగుండ్ల సోమయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన  భవన నిర్మాణ కార్మిక సంఘం మండల సదస్సులో పాల్గొని మాట్లాడారు.  ఎమ్మెల్యేలకు, మంత్రులకు జీతాలు పెంచుతున్నారు తప్పా కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. భవన నిర్మాన కార్మిక సంఘం మండల అధ్యక్షులుగా ఒగ్గు సైదులు, కార్యదర్శి ఇసుకపెల్లి రామనర్సయ్యతో పాటు 22మంది సభ్యులతో ఎన్నిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి వెంపటి గురూజీ, డివిజన్‌ అధ్యక్షులు కొలిశెట్టి యాదగిరిరావు, మండల అధ్యక్షులు రణపంగ కృష్ణ, మండల కార్యదర్శి కట్టెల విజయ్‌కుమార్,  ఒగ్గు సైదులు, రమణ, చిలువేరు చంద్రశేఖర్, ఇసుకపెల్లి రమణ, వెంకన్న, గోవర్ధన్, జనార్థన్, గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement