పంటలకు ఊరటనిచ్చిన వర్షం
పంటలకు ఊరటనిచ్చిన వర్షం
Published Tue, Aug 30 2016 6:38 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM
పెన్‌పహాడ్
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో తొలకరి జల్లులు కురవడంతో రైతులు పరుగు పరుగున పొలాలకు వెళ్లి పంటల సాగుకు సిద్ధం చేశారు. తీరా విత్తనాలు నాటి అవి మొలకెత్తినప్పటి నుంచి వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు ఆందోళనలో పడ్డారు. ఈ క్రమంలో చివరకు అవి మొలకెత్తి వర్షాల కోసం ఆకాశం వంక ఎదురు చూడడంతో మండల వ్యాప్తంగా సుమారు 10శాతం పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. వర్షాభావ పరిస్థితులకు తట్టుకొని నిలిచిన పంటలు మాత్రమే నిలిచి ఉన్నాయి. మరో వారం రోజుల పాటు వర్షాలు పడకుంటే మండలం వ్యాప్తంగా వేసిన పంటలన్నీ ఎండిపోయేవి. కానీ రెండు రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలు రైతులకు ఆనందాన్ని కలిగించగా పంటలకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు. మొత్తానికి ఈ వర్షాలు ఉన్న పంటలకు ఊరటనిచ్చే వర్షాలని రైతులు చెప్పుకుంటున్నారు.
పొలాలకు తరలిన రైతులు...
వర్షాల కోసం నిత్యం ఎదురు చూసిన రైతులకు మూడు రోజులుగా పడుతున్న వర్షాలు పంటలపై ఆశలు రేకెత్తించాయి. ఇప్పటికే కలుపు తీసేందుకు, ఎరువులు చల్లేందుకు వేల రూపాయల్లో పెట్టుబడులు పెట్టారు. పంటలు పెరిగే దశలో వర్షాలు లేక చివరి దశలోకి వచ్చే సరికి వరుణుడు కరుణ చూపడంతో వాలిపోయిన మొక్కలకు ప్రాణం లేచివచ్చింది. కుంగిపోతున్న పంటలు నిటారుగా లేచాయి. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తంమవుతోంది. ఎండ తీవ్రత తగ్గి ఆకాశం మేఘావృతంగా మారింది. దీంతో మరి కొన్ని రోజుల పాటు వర్షాలు పడుతాయని రైతులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
బీడు భూముల్లో సాగు
ఈ ఖరీఫ్ సీజన్‌లో తొలకరి పలకరించినప్పటికీ తదనంతరం వర్షాలు లేక రైతులు వరి పంటలను వేసేందుకు వెనుకాడారు. అయినప్పటికీ వర్షాలు పడుతాయనే ఉద్దేశంతో నార్లు పోశారు. అయితే వర్షాలు లేకపోవడంతో పెట్టిన నార్లు పొలాల్లోనే ముదిరిపోయాయి. వర్షాలు పడితే భూములను సిద్ధం చేసి నాట్లు వేయాలనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. దీంతో మూడు ఎకరాలు నాట్లు వేయాలనుకున్న రైతు నీటి వనరులను దృష్టిలో పెట్టుకొని ఎకరం కూడా వేయని పరిస్థితి ఏర్పడింది. దీని మూలంగా సాగయ్యే భూములు పడావుగా మారిపోయాయి. కాగా మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో రైతుల్లో మరో మారు ఆశలు చిగురించాయి. పడావుగా ఉంచితే లాభమేంటని ఆలోచించిన రైతులు వర్షాలు కురుస్తాయని నమ్మి భూములను సాగుకు సిద్ధం చేసి నాట్లు వేస్తున్నారు. ఇప్పటికీ ఆకాశం మేఘావృతంగానే ఉంటూ తుంపర్లు పడుతూనే ఉన్నాయి. నెలల తరబడి ఎదురు చూస్తున్న వర్షాలు రైతులను పొలాల బాట పట్టించాయి. ల్లలు, గర్భిణులు, దర్ఘీకాలిక వ్యాధిగ్రస్తులు తీసుకోకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ నేరేళ్ల లక్ష్మి, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ కె.రామకృష్ణ, సీనియర్ సబ్లిక్ హెల్త్ అధికారి డాక్టర్ తండు మురళీమోహన్, డాక్టర్ ఎల్.రమేష్‌నాయక్, సబ్ యూనిట్ అధికారులు సముద్రాల సూరి, తీగల నర్సింహ, గవ్వా శ్రీధర్‌రెడ్డి, మనోజ్‌రెడ్డి, వెంకన్న, ఉపేందర్, నర్సింహ, ఉప్పల్‌రెడ్డి, ఇ.లోకేందర్, సబిత, నాగమణి, ఏకస్వామి, పద్మమ్మ, భిక్షం, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement