
సాక్షి, హైదరాబాద్: 1.2 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్ భరోసాను దెబ్బతీస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేయాల్సిందేనని పీఆర్‌టీయూ–తెలంగాణ డిమాండ్ చేసింది. పాత పెన్షన్ స్కీంను పునరుద్ధరించి ఉద్యోగులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆదివారం హైదరాబాద్‌లో యూనియన్ అధ్యక్షుడు ఎం.అంజిరెడ్డి ఆధ్వర్యంలో పీఆర్‌టీయూ–తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.
ముఖ్య అతిథిగా హాజరైన శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పారు. అనంతరం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలను సమావేశంలో ఆమోదించారు. పండితుల అప్‌గ్రెడేషన్ వెంటనే చేపట్టాలని, 2016 వేసవిలో మధ్యాహ్న భోజనం అందించేందుకు పని చేసిన టీచర్లకు ఆర్జిత సెలవులు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న డిప్యూటీ ఈవో, ఎంఈవో, గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్టులను భర్తీ చేయాలని, మెడికల్ రీయింబర్స్‌మెంట్ సదుపాయం పొడిగించాలని, పీఆర్‌సీ కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment