పీఆర్‌టీయూ బలోపేతానికి కృషిచేయాలి
పీఆర్‌టీయూ బలోపేతానికి కృషిచేయాలి
Published Sun, Sep 25 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
విద్యారణ్యపురి : ఉపాధ్యాయులు వృత్తి ధర్మా న్ని సక్రమంగా నిర్వర్తిస్తూ పీఆర్‌టీయూ బలోపేతానికి కృషిచేయాలని వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్ కోరారు. ఆదివారం హన్మకొండలోని రెడ్డి మ్యారేజ్‌హాల్‌లో నిర్వహించిన ప్రోగ్రెసీవ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(పీఆర్‌టీయూ) తృతీయ జిల్లా స్థాయి కార్యనిర్వాహక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉపాధ్యాయుల్లో అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. సమగ్రంగా చర్చించిన తర్వాత పీఆర్‌టీయూ నుంచి తమ అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. వరంగల్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజిస్తుండగా ఏ జిల్లా ఉపాధ్యాయులను అదే జిల్లాలో కొనసాగిస్తారని పేర్కొన్నారు. ఒకవేళ తమ సొంతజిల్లాలో వద్దనుకుంటే ఇతర జిల్లాలో పనిచేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో ఉపాధ్యాయులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. అలాగే ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులు కొందరు తెలంగాణలో, తెలంగాణకు చెందిన కొందరు ఆంధ్రా లో పనిచేస్తున్నారని, ఇక్కడి వారిని అక్కడికి, అక్కడి వారిని ఇక్కడి పంపాలనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) విధానాన్ని రద్దు చేయాలని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద త్వరలో జరిగే ధర్నాకు సీపీఎస్ వర్తించే ఉపాధ్యాయులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. జిల్లాల పునర్విభజనతో ఏర్ప డే కొత్త జిల్లాల్లో పీఆర్‌టీయూలో బాగా పనిచేసిన వారికి పదవులు లభిస్తాయని తెలిపారు. ఆలిండియా టీచర్స్ ఆర్గనైజేషన్ (ఏఐటీవో) చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్రెడ్డి మాట్లాడుతూ ఏకీకృత సర్వీస్ రూల్స్ త్వరలో రాబోతున్నాయని, ఆ దిశగా కృషి జరుగుతోందన్నారు.
పండిట్స్ పీఈటీల అప్‌గ్రేడేషన్ కోసం కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. 398 ఉపాధ్యాయులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు సాధించి తీరుతామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి ప్రారంభించినప్పుడే బలోపేతమవుతాయని తెలిపారు. పీఆర్‌టీ యూ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తమరెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ విధానం రద్దుకోసం నవంబర్‌లో ఢిల్లీలో జరిగే ధర్నాను విజయవం తం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం లో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ తిరునగరి శ్రీనివాస్, పీఆర్‌టీయూ జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ చీకటి సమ్మయ్య, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సంక్రా బద్రినారాయణ, బాధ్యులు కృష్ణారెడ్డి, యాకూబ్‌రెడ్డి, సూరిబాబు, మురళీధర్‌స్వామి, రామయ్య, జి ల్లాలోని అన్ని మండలాల పీఆర్‌టీయూ బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నా రు. కాగా జిల్లా జనరల్ సెక్రటరీ కార్యదర్శి నివేదికపై పలు మండలాల బాధ్యులు చర్చించారు.
మాలకొండారెడ్డి చేరిక
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు దేవిరెడ్డి మాలకొండారెడ్డి ఆదివారం పీఆర్‌టీయూ టీఎస్‌లో చేరారు. హన్మకొండ రెడ్డి ఫంక్షన్హాల్‌లో ఆదివారం జరిగిన ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్‌టీయూ టీఎస్) జిల్లా స్థాయి సమావేశంలో ఆయనకు ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తమరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి సభ్యత్వ రశీదును అందజేశారు. ఈసందర్భంగా మాలకొండారెడ్డి మాట్లాడుతూ తాను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష పదవికి ఇటీవలే రాజీనామా చేసినట్లు తెలిపారు. కాగా తెలంగాణ స్టేట్ టీచర్స్ ఫెడరేషన్ (టీఎస్‌టీఎఫ్) జిల్లా అధ్యక్షుడు భాను ప్రసాద్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాసస్వామి కూడా చేరగా పీఆర్‌టీయూ సభ్యత్వాలు అందజేశారు.
Advertisement
Advertisement