must
-
US : అమెరికాలో 911.. అదో పెద్ద హడావిడి!
‘‘మొదటిసారి నేను అమెరికా వెళ్ళింది 2006 లో, అడుగు పెట్టింది టెక్సస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ సిటీలో. అదొకప్పుడు ఆ రాష్ట్ర తాత్కాలిక రాజధాని కూడా, 1846లోనే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భాగమైందట. హ్యూస్టన్‌లో చాలా చమురు కంపెనీలు, పనివారిలో మెక్సికో నుంచి వచ్చినవారు ఎక్కువ. గ్యాస్ స్టేషన్ వ్యాపారంలో పాకిస్తానీలు బాగా సెటిల్ అయినట్లు కనబడుతుంది. సాఫ్ట్వేర్ పుణ్యమా ! అని ఉద్యోగాలు, చదువుల పేర మనవాళ్ళు ముఖ్యంగా తెలుగువాళ్ళ సంఖ్య ఇప్పుడు బాగా పెరుగుతుంది. అమెరికా వెళ్లినవారు ముందుగా తప్పనిసరి తెలుసుకువాల్సిన ఎమర్జెన్సీ నెంబర్ 911 (ఇండియాలో 112 లాగా). ఏ అత్యవసర పరిస్థితి ఏర్పడినా ఈ 3 డిజిట్ నెంబర్కుకు ఫోన్ చేస్తే పది నిమిషాల వ్యవధిలో పోలీసులు వచ్చేస్తారు. అవసరమైన సహాయం అది పోలీసు, ఫైర్, మెడికల్ ఏదైనా అందిస్తారు. ఆరోగ్య సమస్యలైతే హాస్పిటల్లో చేర్పిస్తారు, లా అండ్ ఆర్డర్ అయితే రక్షణ కల్పిస్తారు, భార్యాభర్తల గొడవలు, పిల్లల వేధింపులైనా చేయగలిగింది చేస్తారు. అమెరికాలో ఇళ్లకు సెక్యూరిటీ సర్వీసెస్ వారి రక్షణ కూడా ఉంటుంది. దొంగతనం వంటివి జరిగినప్పుడు అలారం మోగడం ద్వారా పోలీసులను అలెర్ట్ చేస్తుంది. దాని లాకింగ్ సిస్టం కూడా పకడ్బందిగా ఉంటుంది. రాత్రి భోజనాల తర్వాత మన తెలుగు సాఫ్ట్వేర్ దంపతులు, పిల్లలు ఇంట్లో ఆడుకుంటుంటే, తలుపు దగ్గరకు వేసి బయట లాన్లోకి వెళ్లి కూర్చున్నారట. లోపలి వైపు లాక్ పొజిషన్లో ఉండడంతో అది క్లోజ్ అవడమే కాకుండా డోర్ లాక్ కూడా అయిపోయిందట. తల్లిదండ్రులు బయట, ఏడుస్తున్న చిన్న పిల్లలు లోపల, చేతిలో ఫోన్ కూడా లేకపోవడంతో పక్కవాళ్ళ సహాయంతో వారు 911కు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి ఇంటి వెనక వైపు తలుపు అద్దాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి , పరిస్థితి చక్కదిద్ది, పేరెంట్స్ నిర్లక్ష్యానికి హెచ్చరించి మరీ వెళ్లారట. 911 తో నాకూ ఓ స్వీయ అనుభవం ఉంది. అమెరికా నుంచి ఇండియాకు ఫోన్ చెయాలంటే ముందుగా 011 ఇది యూఎస్ నుండి బయటి దేశాలకు చేసే డయలింగ్ కోడ్, దాని తర్వాతనే ఇండియా నెంబర్ STDతో సహా చేయాలి. అలా ప్రయత్నిస్తున్న సమయంలో నేను పొరపాటున 011 కు బదులు 911 చేశాను. వెంటనే నాకు ఎమర్జెన్సీ పోలీసు రెస్పాన్స్ వచ్చింది, సారీ రాంగ్ నెంబర్ అని నేను ఠకీమని ఫోన్ పెట్టేశాను. ఎంతైనా అమెరికా పోలీసులు కదా! పోలీసు వ్యాన్ సైరన్ చేసుకుంటూ మేమున్న ఇంటి ముందుకు వచ్చేసింది. అందులోనుండి ఓ లేడీ ఇన్స్పెక్టర్ దిగింది. ఇరుగు పొరుగులు ఏమైందా అని బయటకు వచ్చి చూస్తున్నారు. పోలీసువాళ్ళ హడావిడి చూసి నేనూ షాక్ తిన్నాను. వాళ్ళు అడిగేదేమిటో నేను చెప్పేదేమిటో ఒకరిదొకరికి అర్థం కాని పరిస్థితి. మా వాళ్లు వచ్చి అసలు విషయం చెప్పినా, ఇంటి లోపలికి వెళ్లి అంతా చెక్ చేసుకొన్నాక గాని వాళ్ళు వెళ్ళిపోలేదు. అవతలిపక్క పోలీసుల రెస్పాన్స్ వచ్చినప్పుడు నేను జరిగిన పొరపాటును వాళ్లకు వివరించకుండా రాంగ్ నెంబర్ అని ఫోన్ కట్ చేయడం అనుమానానికి తావిచ్చింది. అక్కడ పోలీసులు ఇంత ఖచ్చితంగా ఉంటారని నాకు మాత్రం ఏం తెలుసు.? చివరగా 911 గురించిన ఒక జోక్. ఇద్దరు మిత్రులు కారులో మందు కొడుతూ చాలా స్పీడ్ గా వెళుతుంటే ఆ కారుకు ప్రమాదమైందట. అదే దారిలో వెళ్తున్న మన తెలుగు దానయ్య వచ్చి వాళ్లకు సహాయం చేశాడట. ప్రమాదానికి గురైనా తాము క్షేమంగా ఉండడమే కాకుండా చేతులోని మందు బాటిల్ కూడా సేఫ్‌గా ఉన్నందుకు సంతోషిస్తూ దానయ్యకు కృతజ్ఞతగా ఓ పెగ్ తీసుకొమ్మన్నారట మిత్రులు ఇద్దరు. దానయ్య అశ్చర్యపడుతూ ‘ తొందరెందుకూ 911 పోలీస్ కూడా వస్తున్నారు, అంతా కలిసి తాగొచ్చు ’ అన్నాడట , అదీ సంగతి! వేముల ప్రభాకర్ (చదవండి: అమెరికాలో మన రైతుబజార్లకు సమానంగా ఏమున్నాయి) -
చదువులో కాదు.. అనుభవంలో ...
త్యాగరాజ స్వామి ఒక కీర్తనలో...‘‘గురులేక ఎటువంటి గుణికి తెలియగబోదు... కఱుకైన హృద్రోగ గహనమును గొట్ట....’’ అంటారు. ఎటువంటి గుణాలయినా ఉండొచ్చు. ఎంత తెలివిగలవాడయినా కావొచ్చు. ఏది తెలియాలో అది తెలియాలంటే మాత్రం గురువు ఉండి తీరాలి. ఏది తెలియాలి... అంటే.. కరుకైన హృద్రోగమును గహనమును కొట్ట... హృద్రోగం చాలా కరుకైనదే.. ఊపిరి అందని వాడికి అది పరీక్షాకాలం... ఇంతమందిని విడిచిపెట్టి పోతున్నానన్న భావన.. అది కరుకైనది... దానిని గహనమున కొట్ట... అంటే అరణ్యంలా.. ఎలా చేస్తున్నాడో తెలియకుండా దానిని కొట్టగలిగినవాడు గురువు... అన్నాడు. తెలియని విషయాలు తెలియుకుండా పోవడం... తెలియవు అన్నంత వరకు పనికొస్తాయేమో గానీ.. ఆత్మ అనుభవం లోకి రావడం... అద్వైతానుభూతిని పొందడం... అన్న దగ్గరకు వస్తే అది గురువుగారి వీక్షణములచేత మాత్రమే సాధ్యమవుతుంది.. అంటాడు త్యాగయ్య. అమ్మవారిని మూడు రకాలుగా – కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అని... అక్షి సంబంధంగా పిలుస్తారు. ఆమె గురు మండల రూపిణి. గురువులు కూడా మూడు రకాలుగా అను గ్రహిస్తారు. కామాక్షి–కుక్కుట న్యాయం.. అలాగే గురువు హస్త మస్తక సంయోగంలో శిష్యుడి బ్రహ్మస్థానం లో తన చేతిని ఉంచి అనుగ్రహిస్తాడు. అది పక్షి గుడ్డును పొదిగి దాని నుంచి పిల్ల వచ్చేటట్లుగా చేయడంలాగా ఉంటుంది. అలా పొదుగుతాడు శిష్యుడిని. అదే స్పర్శ దీక్ష. రెండవది మీనాక్షి. విజ్ఞాన శాస్త్రంలో ఎలా ఉందనే విషయం పక్కనబెడితే యోగశాస్త్రంలో చెప్పిన ప్రకారం చేపగుడ్లు పెట్టి, వాటిని ప్రేమగా చూసిన మాత్రం చేత అవి పిల్లలవుతాయి.. అంటుంది. అలా గురువు కేవలం తన చూపులతో శిష్యుణ్ణి అనుగ్రహిస్తాడు. అలా భగవాన్ రమణులు ఒకసారి అనుగ్రహించారు. అది మీనాక్షి. మూడవది విశాలాక్షి. బ్రహ్మాండం ఎంతవరకు ఉంటుందో అంతవరకు పరదేవత చూస్తుంటుంది. అందరూ తన బిడ్డలే అన్న స్మరణతో అనుగ్రహిస్తుంటుంది. ‘వాడు వృద్ధిలోకి రావాలి’ అని గురువు గారు సంకల్పించినంత మాత్రం చేత శిష్యుడు ఆ స్థితిని పొందుతాడు. అది విశాలాక్షీ తత్త్వం. నిజానికి కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి... ఈ మూడూ కూడా శిష్యుడి వైపునుంచి గురువుకు, గురువు వైపునుంచి శిష్యుడికి ఉంటాయి. అదొక విచిత్రం. తెలిసినా తెలియక పోయినా నన్ను గురువుగారు ఒకసారి ముట్టుకుంటే చాలు, చూస్తే చాలు, స్మరిస్తే చాలు.. అన్న నమ్మకం ఉంటే... వాడు గురి కలవాడు. ఎవరి మీద అది ఉందో వారు గురువయిపోతారు. వాడి కరుకైన హృద్రోగమును గహనమును కొట్ట... అంటే అలా కొట్టగలిగినవాడు గురువు.. అంటున్నాడు త్యాగరాజు. అజ్ఞాన గ్రంథులను తొలగించి జ్ఞానాన్ని కలుగ చేయాలి అంటే... ఒక సద్గురువు ఉండాలి. అప్పుడు భగవంతుని దర్శనం.. ఆత్మ అనుభవంలోకి వచ్చి... శాశ్వతమైనది, సత్యమైనది, నిత్యమైనది, నిరంజనమైనది, నిష్కళంకమైనది... అయిన ఆత్మ నేను తప్ప శరీరం కాదు... అని శ్లోకాల్లో చెప్పినవి, నోటితో చెప్పినవి కాక.. అనుభవంలో తెలుసుకుంటాడు శిష్యుడు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అపార్ట్మెంట్ వాసులూ.. మేల్కోండి!
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం ప్రకటించిన నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటిని పొందాలనుకునే అపార్ట్మెంట్లలోని ప్రతి ఫ్లాట్ వినియోగదారుడూ విధిగా నల్లా కనెక్షన్ నంబరుకు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను జలమండలి వెబ్సైట్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. హైదరాబాద్ వాటర్.జీఓవీ.ఐఎన్’ను సంప్రదించి పూర్తిచేసుకోవాలి. సాధారణంగా ప్రతి అపార్ట్‌మెంట్‌కూ ఒకే నల్లా కనెక్షన్ (బల్క్) ఉంటుంది. కానీ ఫ్లాట్స్ మాత్రం 10 నుంచి 100 వరకు ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రతీ ఫ్లాట్ వినియోగదారుని ఆధార్‌ను కూడా నల్లా కనెక్షన్ నంబరుకు అనుసంధానించాల్సి ఉంటుందని జలమండలి స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది. అట్లయితే అనర్హులే.. నెలకు 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి సరఫరా పొందాలనుకున్న ప్రతీ వినియోగదారుడు ఈ నెల 31లోగా తమ నల్లా కనెక్షన్‌కు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాల్సిన విషయం విదితమే. మురికివాడలు మినహా ఇతర గృహ వినియోగదారులు సైతం నల్లా కనెక్షన్ నంబరుకు ఆధార్‌ను మీ సేవ కేంద్రాల్లో అనుసంధానించుకోవాల్సి ఉంటుంది. ప్రతి గృహ వినియోగదారుడూ తమ నల్లాకున్న మీటర్ పని చేస్తుందో లేదో తనిఖీ చేసుకోవాలి. లేని పక్షంలో కొత్త మీటరును ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మీటరు పని చేయని పక్షంలో ఉచిత నీటి పథకానికి అనర్హులని జలమండలి ప్రకటించింది. ఆధార్ అనుసంధానం ఇలా.. అపార్ట్మెంట్ వాసులు ముందుగా జలమండలి వెబ్సైట్.. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. హైదరాబాద్ వాటర్.జీఓవీ.ఐఎన్’ను సంప్రదించాలి. ఇందులో ఆధార్ అనుసంధానం అన్న ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ముందుగా తమ అపార్ట్మెంట్కున్న నల్లా కనెక్షన్ (క్యాన్)కు అనుసంధానమైన మొబైల్ నంబరుకు ఓటీపీ వెళుతుంది.ఓటీపీని ఎంటర్ చేస్తేనే ఎక్స్ఎల్ షీట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫ్లాట్ యజమాని పేరు, ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటికేషన్ (పీటీఐఎన్)నంబరు, ఆధార్‌ను నమోదు చేయాలి.ఆధార్ నంబరుకు లింక్ చేసిన మొబైల్ నంబరుకు మరో ఓటీపీ మెసేజ్వెళుతుంది. దీన్ని ఎంటర్ చేస్తేనే ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది. ప్రతి ఫ్లాట్ వినియోగదారుడూ విధిగా ఈ ప్రక్రియను వేర్వేరుగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. సుమారు 50 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్ వాసులు అందరూ ఒకేసారి కాకుండా రోజుకు పది మంది చొప్పున ఈ ప్రక్రియను చేపడితేనే అనుసంధానం సులువవుతుంది. ఈ సమస్యలో ఇబ్బందులుంటే జలమండలి క్షేత్రస్థాయి కార్యాలయాలు లేదా 155313 కాల్‌సెంటర్ నంబరులో సంప్రదించాలని జలమండలి అధికారులు సూచించారు. -
ఆధార్ లేదా? అయితే ‘ఆ’ సుఖం కష్టమే!
పనాజి : అన్నింటికి ఆధార్ అనుసంధానంపై కేంద్రం పై చేయి సాధిస్తున్న వేళ.. గోవాలో కనిపిస్తున్న పరిస్థితులు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. పెయిడ్ సెక్స్ కావాలంటే ఆధార్ కార్డు చూపించాల్సిందేనన్న నిబంధన అక్కడ అమలు అవుతోంది. పోలీసులకు భయపడి పింప్స్(నిర్వాహకులు) ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. అడ్డగోలుగా జరుగుతున్న ఈ బిజినెస్ పై పోలీసులు గత కొంతకాలంగా నిఘా అధికం చేశారు. దీంతో పింప్స్ జాగ్రత్త పడుతున్నారు. కస్టమర్ల ఆధార్ వివరాలు, వారుంటున్న హోటల్ రూమ్ వివరాలను పంపితేనే... వాటిని సరిపోల్చుకున్నాకే కస్టమర్ల దగ్గరకు యువతులను పంపుతున్నారు. ఆన్ లైన్ అయినా సరే ఆధార్ కంపల్సరీ. తమపై పోలీసులు ఉక్కు పాదం మోపుతుండడంతోనే ఈ రకంగా జాగ్రత్త పడుతున్నట్లు ఓ వ్యక్తి తెలిపాడు. చివరకు అవతలి వారు పోలీసులు కాదన్న విషయంపై స్పష్టత వచ్చాకే ముందుకు కొనసాగుతున్నారంట. ఇయర్ ఎండ్ కావటంతో గోవాలో పార్టీ కోసం జరుపుకునేందుకు వెళ్లిన ఢిల్లీ యువకులు తమకు ఎదురైన అనుభవాన్ని ఓ మీడియా సంస్థకు వివరించారు. బ్యాంకు ఖాతాలు, ప్రభుత్వ పథకాలు, మొబైల్ నంబర్లకు ఆధార్ అనుసంధానాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో ఈ వ్యవహారానికి కూడా ఆధార్ అవసరం కావటం చర్చనీయాంశమైంది. -
విమాన టిక్కెట్ల బుకింగ్‌కు కొత్త నిబంధనలు
-
విమాన టిక్కెట్ల బుకింగ్‌కు కొత్త నిబంధనలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా విమాన ప్రయాణీకులకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలు చేయనుంది. దేశీయ సర్వీసులపై కూడా తప్పనిసరి నిబంధనలను తీసుకురానుంది. ముఖ్యంగా దేశీయ విమాన టికెట్ల బుకింగ్ కోసం ఏదో ఒక ఐడి కార్డు జతచేయడం మాండేటరీ చేయనుంది. దీనికి సంబంధించి నో ఫ్లై లిస్ట్ (ఎన్ఎఫ్ఎల్)ను ఈ శుక్రవారం ప్రకటించనుంది. వచ్చే ఏడాది జులై నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కేంద్రం ప్రకటించనున్న ఈ కొత్త నిబంధనల ప్రకారం దేశీయ విమానం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఏదో ఒక గుర్తింపు కార్డు జతచేయాల్సిందే. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఓటర్ ఐడి లాంటి గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తప్పనిసరి అని పౌర విమానయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా తెలిపారు. మంగోలియాలో జరిగిన విమానయాన భద్రత సదస్సులో పాల్గొని తిరిగొచ్చిన సందర్భంగా మంత్రి 'నో ఫ్లయ్' జాబితాపై నిబంధనలను రూపొందించినట్లు పేర్కొన్నారు. తుది నియమాలను శుక్రవారం నాడు విడుదల చేయనున్నామని తెలిపారు. ఎన్ఎఫ్ఎల్ అమలు ఖరారైన తరువాత ఈ జాబితాలోని వారు మారు పేర్లతో టికెట్లను కొనుగోలు చేయకుండా చూసేందుకు సాధ్యమైనంత త్వరలో డిజిటల్ బోర్డింగ్ కార్డులను ప్రవేశపెట్టనున్నామన్నారు. దీని కోసం ఆధార్ కార్డులతో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. విమానాల భద్రత, అవాంఛనీయ ఘటనల నివారణ లక్ష్యంగా నో ఫ్లయ్ జాబితా నిబంధనలను తయారు చేసినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చీఫ్ బీఎస్ భుల్లార్ వెల్లడించారు. కాగా ఇప్పటివరకూ అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు పాస్ పోర్టు తప్పనిసరి, కానీ దేశీయ విమానాల టిక్కెట్ బుకింగ్‌కు ఎలాంటి గుర్తింపు కార్డు అవసరం లేదు. అయితే ఇకపై నిబంధనలో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. -
నేరస్తులపై నిఘా ఉంచాలి
అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠి గుంటూరు (పట్నంబజారు): నేరస్తుల కదిలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠి సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని అర్బన్ సమావేశ మందిరంలో సోమవారం వెస్ట్ సబ్ డివిజన్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ కేసులను పరిష్కరించటంతో పాటు నాన్ బెయిలబుల్ కేసుల్లో నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జైలు నుంచి విడుదలైన వారి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. అనుమానితులపై నిఘా ఉంచాలని సూచించారు. రౌడీ కార్యకలాపాలు సాగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. ప్రతి కేసును తప్పని సరిగా సీసీ టీఎన్‌ఎస్‌కు అనుసంధానం చేయాలని సూచించారు. సమావేశలో అడిషనల్ ఎస్పీలు భాస్కరరావు, ఇ.సుబ్బరాయుడు, డీఎస్పీ కేజివి.సరిత, వెస్ట్ సబ్‌డివిజన్ ఎస్‌హెచ్‌వోలు పాల్గొన్నారు. -
టీచర్ల పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో ఫౌండేష¯ŒS కోర్సుల అమలు మున్సిపల్ మంత్రి నారాయణ అమలాపురం టౌ¯ŒS : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదవించినప్పుడే ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. అమలాపురం కొంకాపల్లి జవహర్ లాల్ నెహ్రు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఫౌండేష¯ŒS కోర్సు చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మంగళవారం రాత్రి మంత్రి నారాయణ ఇష్టాగోష్టి నిర్వహించారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించన ప్రభుత్వ ఉపాధ్యాయుల సదస్సులో 500 మంది పాల్గొనగా అందులో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్న ఉపాధ్యాయులు ఇద్దరు మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో విద్యా ప్రమాణాల్లో మరీ వెనుకబడి ఉన్నారన్న దృష్టితోనే రాష్ట్రంలో ఎంపిక చేసిన 57 మున్సిపాలిటీల్లో ఫౌండేష¯ŒS కోర్సులు అమలు చేస్తున్నుట్టు తెలిపారు. మంత్రి నారాయణ పలువురు ఫౌండేష¯ŒS కోర్సు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముఖాముఖీ నిర్వహించారు. వారు ఏం చదువు తారు...భవిష్యత్‌లో ఏం కావాలనుకుంటున్నారని అడిగారు. స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన జరిగిన ఈ ఇష్టాగోష్టిలో మున్సిపల్ చైర్మ¯ŒS చిక్కాల గణేష్, జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, ఎమ్మెల్సీ కె.రవికిరణ్‌వర్మ, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మ¯ŒS మెట్ల రమణబాబు తదితరులు పాల్గొన్నారు. చివరగా మంత్రి నారాయణ కొంకాపల్లి మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యా ప్రమాణాల పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. -
గాంధీజీ ఆశయాలను నెరవేర్చాలి
ఖమ్మం జెడ్పీసెంటర్: ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన గాంధీ ఆశయాలను నెరవేర్చేందుకు యువత కృషి చేయాలని కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ కోరారు. జాతిపిత 147వ జయంతి సందర్భంగా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం జరిగిన వేడుకలో పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అహింసామార్గంలో మన దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన జాతి పిత స్ఫూర్తితో ప్రజలంతా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో సమాచార శాఖ సహాయ సంచాలకుడు మహ్మద్ ముర్తుజా, సీసీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో.. కలెక్టరేట్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి జాయింట్ కలెక్టర్ డి.దివ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీఆర్ఓ శ్రీనివాస్, ఏఓ మస్తాన్‌రావు, సూపరింటెండెంట్లు చంద్రశేఖర్, మదన్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాపరిషత్ కార్యాలయంలో.. జిల్లాపరిషత్‌కార్యాలయ ఆవరణలోని గాంధీజీ విగ్రహానికి జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, సీఈఓ మారపాక నగేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. డిప్యూటీ సీఈఓ కర్నాటి రాజేశ్వరి, ఏఓ భారతి, పీఆర్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నడింపల్లి వెంకటపతిరాజు, మల్లెల రవీంద్రప్రసాద్, సూపరింటెండెంట్లు రమణ, శారద, పద్మావతి, విజయలక్ష్మి, రామకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో... భద్రాచలం : జాతి పిత గాంధీజీ చూపిన బాటలో అందరం నడుద్దామని, సమాజాభివృద్ధికి పాటుపడదామని ఐటీడీఏ పీఓ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. గాంధీ జయంతి వేడుక ఆదివారం ఐటీడీఏ కార్యాలయంలో జరిగింది. గాంధీజీ చిత్రపటానికి పీఓ రాజీవ్, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయదేవ్, యూనిట్ అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజీవ్ మాట్లాడుతూ.. అహింసాయుధంతో ఆంగ్లేయులపై గాంధీజీ పోరాడారని అన్నారు. ఏపీఓ (జనరల్) భీమ్రావు, ఎస్డీసీ వెంకటేశ్వర్లు, ఏజెన్సీ డీఈఓ రవీందర్, ఏడీఎంహెచ్ఓ డాక్టర్ పుల్లయ్య, ఈజీఎస్ ఏపీఓ బలరాం, ఏఓ తాతారావు తదితరులు పాల్గొన్నారు. సమాచార శాఖ ఏడీ కార్యాలయంలో... సమాచార శాఖ ఏడీ కార్యాలయంలో జరిగిన వేడుకలో ఏడీ ముర్తుజా, డిప్యూటీ ఈఈ సారయ్య, డీపీఆర్ఓ శ్రీనివాసరావు, ఏపీఆర్ఓలు యాకూబ్‌పాషా, ఉద్యోగులు రమేష్‌కుమార్, వల్లోజు శ్రీనివాస్, ఎస్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ధర్నాను విజయవంతం చేయాలి
విద్యారణ్యపురి : ఉద్యోగ, ఉపాధ్యాయుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ అక్టోబర్ 1న హైదరాబాద్‌లో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రోగ్రెసీవ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం హన్మకొండలోని టీపీటీఎఫ్ కార్యాలయంలో జరిగిన ఆ సంఘం జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ పొందడం హక్కు అని, పాలకుల దయాదాక్షిణ్యాలతో వేసే భిక్ష కాదని 1982లోనే సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు. గతంలో యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు అమలు చేస్తున్న నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా ప్రపంచబ్యాంకు, బహుళజాతి, పారిశ్రామిక, వాణిజ్య వర్గాల ఒత్తిడితో ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ విధానంతో ఎంతో నష్టం కలుగుతుందన్నారు. సీపీఎస్ రద్దుకోసం 11 ఉపాధ్యాయసంఘాలతో అక్టోబర్ 1న హైదరాబాద్‌లో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలన్నారు. టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేడర్ పోస్టులు, రాష్ట్ర కేడర్ పోస్టులు మాత్రమే ఉంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. దానికి కొన్ని సంఘాలు వంత పాడుతున్నాయన్నారు. ఇప్పుడున్న రెండు జోన్లకు బదులు ఆరు జోన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్.కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి యూ.అశోక్, రాష్ట్ర కౌన్సిలర్ కడారి భోగేశ్వర్ మాట్లాడారు. ఈ సమావేశంలో టీపీటీఎఫ్ జిల్లా బాధ్యులు ఎస్.గోవర్దన్ , డి.శ్రీనివాస్, పి.చంద్రం, మహబూబ్అలీ, వి.సోమేశ్వర్, బి.స్వామి, ఎస్.ఉపేందర్‌రెడ్డి, హెచ్.సమ్మయ్య, బి.సారయ్య, ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పీఆర్టీయూ బలోపేతానికి కృషిచేయాలి
విద్యారణ్యపురి : ఉపాధ్యాయులు వృత్తి ధర్మా న్ని సక్రమంగా నిర్వర్తిస్తూ పీఆర్టీయూ బలోపేతానికి కృషిచేయాలని వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్ కోరారు. ఆదివారం హన్మకొండలోని రెడ్డి మ్యారేజ్హాల్లో నిర్వహించిన ప్రోగ్రెసీవ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(పీఆర్టీయూ) తృతీయ జిల్లా స్థాయి కార్యనిర్వాహక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉపాధ్యాయుల్లో అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. సమగ్రంగా చర్చించిన తర్వాత పీఆర్టీయూ నుంచి తమ అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. వరంగల్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజిస్తుండగా ఏ జిల్లా ఉపాధ్యాయులను అదే జిల్లాలో కొనసాగిస్తారని పేర్కొన్నారు. ఒకవేళ తమ సొంతజిల్లాలో వద్దనుకుంటే ఇతర జిల్లాలో పనిచేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో ఉపాధ్యాయులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. అలాగే ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులు కొందరు తెలంగాణలో, తెలంగాణకు చెందిన కొందరు ఆంధ్రా లో పనిచేస్తున్నారని, ఇక్కడి వారిని అక్కడికి, అక్కడి వారిని ఇక్కడి పంపాలనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) విధానాన్ని రద్దు చేయాలని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద త్వరలో జరిగే ధర్నాకు సీపీఎస్ వర్తించే ఉపాధ్యాయులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. జిల్లాల పునర్విభజనతో ఏర్ప డే కొత్త జిల్లాల్లో పీఆర్టీయూలో బాగా పనిచేసిన వారికి పదవులు లభిస్తాయని తెలిపారు. ఆలిండియా టీచర్స్ ఆర్గనైజేషన్ (ఏఐటీవో) చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఏకీకృత సర్వీస్ రూల్స్ త్వరలో రాబోతున్నాయని, ఆ దిశగా కృషి జరుగుతోందన్నారు. పండిట్స్ పీఈటీల అప్‌గ్రేడేషన్ కోసం కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. 398 ఉపాధ్యాయులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు సాధించి తీరుతామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి ప్రారంభించినప్పుడే బలోపేతమవుతాయని తెలిపారు. పీఆర్టీ యూ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తమరెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ విధానం రద్దుకోసం నవంబర్‌లో ఢిల్లీలో జరిగే ధర్నాను విజయవం తం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం లో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ తిరునగరి శ్రీనివాస్, పీఆర్టీయూ జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ చీకటి సమ్మయ్య, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సంక్రా బద్రినారాయణ, బాధ్యులు కృష్ణారెడ్డి, యాకూబ్‌రెడ్డి, సూరిబాబు, మురళీధర్‌స్వామి, రామయ్య, జి ల్లాలోని అన్ని మండలాల పీఆర్టీయూ బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నా రు. కాగా జిల్లా జనరల్ సెక్రటరీ కార్యదర్శి నివేదికపై పలు మండలాల బాధ్యులు చర్చించారు. మాలకొండారెడ్డి చేరిక తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు దేవిరెడ్డి మాలకొండారెడ్డి ఆదివారం పీఆర్టీయూ టీఎస్‌లో చేరారు. హన్మకొండ రెడ్డి ఫంక్షన్హాల్లో ఆదివారం జరిగిన ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ టీఎస్) జిల్లా స్థాయి సమావేశంలో ఆయనకు ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తమరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి సభ్యత్వ రశీదును అందజేశారు. ఈసందర్భంగా మాలకొండారెడ్డి మాట్లాడుతూ తాను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష పదవికి ఇటీవలే రాజీనామా చేసినట్లు తెలిపారు. కాగా తెలంగాణ స్టేట్ టీచర్స్ ఫెడరేషన్ (టీఎస్‌టీఎఫ్) జిల్లా అధ్యక్షుడు భాను ప్రసాద్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాసస్వామి కూడా చేరగా పీఆర్టీయూ సభ్యత్వాలు అందజేశారు. -
హామీలను అమలు చేయాలి
మోత్కూరు సీఎం కేసీఆర్ దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్‌మాదిగ, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపెల్లి శ్రీనివాస్‌మాదిగ, జాతీయ ప్రధాన కార్యదర్శి మేడి పాపయ్యమాదిగ డిమాండ్ చేశారు. మాదిగ చైతన్య పాదయాత్ర మంగళవారం మోత్కూరు మండల కేంద్రానికి చేరుకుంది. హైస్కూల్ చౌరస్తా వద్ద బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలువేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా టీఎమ్మార్పీఎస్ జెండాను యాతాకుల భాస్కర్ మాదిగ ఎగరవేశారు. అనంతరం దళితులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ నవంబర్ 19వ తేదీలోపు దళితులకు ఇచ్చిన హామీలు అమలుచేయకుంటే హైదరాబాద్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు సుంకపాక దేవయ్యమాదిగ, జాతీయ ప్రధాన కార్యదర్శి మేడి పాపయ్యమాదిగ, జిల్లా ఉపాధ్యక్షుడు కూరెళ్ల ఎల్లయ్య, నియోజకవర్గ ఇన్ఛార్జీ దాసరి ప్రవీణ్, మండల అధ్యక్షుడు బాలెంల పరుశరాములు, నాయకులు దళిత యువసేన రాష్ట్ర కార్యదర్శి అలెగ్జండర్, నాయకులు కుప్పల రమేష్, దాసు,నరేష్,నవీన్, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడాకారులు ఉన్నత శిఖరాలకు చేరాలి
తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ ఖిలా వరంగల్‌లో రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు ప్రారంభం కరీమాబాద్ : క్రీడాకారులు తమలోని నైపుణ్యాలను చాటుకుంటూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. నగరంలోని ఖుష్‌మహల్ వద్ద ఆదివారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర రెండో హ్యాండ్‌బాల్ పోటీల ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇక్కడ క్రీడా పోటీలు నిర్వహించేందుకు పాటుపడిన రాష్ట్ర హ్యాండ్‌బాల్ అసోసియేష¯ŒS సెక్రెటరీ శ్యామల పవ¯ŒSకుమార్ అభినందనీయులన్నారు. ఈసందర్భంగా పది జిల్లాల నుంచి వచ్చిన సుమారు 400 మంది క్రీడాకారులు, అఫీషియల్స్ మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. అంతకుముందు క్రీడా ప్రాంగణానికి చేరుకున్న గ్రేటర్ వరంగల్ కార్పొరేష¯ŒS మేయర్ నన్నపునేని నరేందర్ క్రీడాకారులను పరిచయం చేసుకొని, హ్యాండ్‌బాల్ పోటీలను ప్రారంభించారు. మేయర్ నరేందర్ మాట్లాడుతూ చారిత్రక ఓరుగల్లు కోటలో హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. నగరంలో శాశ్వతంగా ఆరు క్రీడా మైదానాలను ఏర్పాటు చేసి నిరంతరం క్రీడలపై శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్లాటినమ్ జూబ్లీ విద్యార్థులు ప్రదర్శించిన తెలంగాణ నృత్యరూపకం ఆకట్టుకుంది. స్థానిక కార్పొరేటర్ బైరబోయిన దామోదర్, హ్యాండ్‌బాల్ అసోసియేష¯ŒS రాష్ట్ర కార్యదర్శి పవ¯ŒSకుమార్, బండా ప్రకాష్, బైరబోయిన కైలాష్యాదవ్, సీహెచ్.ఫ్రాంక్లి¯ŒS, అలెగ్జాండర్, నాగేశ్వర్రావు, ఖాజాపాష, తోట సంపత్‌కుమార్, కార్పొరేటర్లు మేడిది రజిత, లీలావతి, కవిత, బయ్య స్వామి, బిల్ల కవిత, ఏకశిలా క్రీడా మండలి బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు. వర్షంతో అంతరాయం.. కాగా, ఆదివారం సాయంత్రం హ్యాండ్‌బాల్ పోటీల నిర్వహణకు భారీ వర్షంతో ఆటంకం కలిగింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో కొంతమంది క్రీడాకారులు స్టేజీ కింద తలదాచుకున్నారు. వర్షంలో తడవకుండా ఇంకొందరు కుర్చీలను తలపై పెట్టుకున్నారు. కొంతమంది ఖుష్మహల్లోకి వెళ్లారు. క్రీడా మైదానం పూర్తిగా తడవడంతో సోమవారం హ్యాండ్‌బాల్ పోటీలు నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. అంతకుముందు పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాష్ట్రస్థాయి పోటీలకు జనరేటర్ సదుపాయాన్ని కల్పించడంపై నిర్వాహకులు దృష్టిసారిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. మహిళలకు ప్లాటినం జూబ్లీ హైస్కూల్, పురుషులకు ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వసతి కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
డీఎంహెచ్ఓ కొండల్రావు ఖమ్మం వైద్య విభాగం : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఏ.కొండల్రావు సూచించారు. నగరంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఏఎన్ఎంలు, సూపర్వైజర్లతో గురువారం రివ్యూ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, పరిసరాల పరిశుభ్రత పాటించి జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతీ గ్రామంలో ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించి.. ఫ్రైడేను డ్రైడేగా విజయవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతి ఇంట్లో నిల్వ ఉన్న నీటిని తొలగించేట్లు చేసి, వాటిలో పెరిగే లార్వాను నిర్మూలించేలా చేయాలని కోరారు. దీనికి యువత, నాయకులు తమ సిబ్బందికి సహకరించాలని కోరారు. అలాగే పంచాయతీ సిబ్బంది మురికి కాల్వల్లో కిరోసిన్ పైరిత్రిన్ చల్లినట్లైతే లార్వాను నిర్మూలించే అవకాశం ఉంటుందని సూచించారు. ముఖ్యంగా ప్రజలు వారి ఇళ్లలోని కూలర్లు, టైర్లు, పెంకుల్లో నిల్వ ఉండే నీటిని తొలగించి.. డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలన్నారు. ఎస్పీహెచ్ఓ మాలతి మాట్లాడుతూ ఫ్రైడేను డ్రైడేగా పాటించి వ్యాధుల నుంచి రక్షణ పొందే విధంగా చూడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డీఎంఓ రాంబాబు, డాక్టర్ మాధవరావు, డెమో వెంకన్న, డీహెచ్ఈ జి.సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
చిలుకూరు: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పర్యావరణ ఉద్యకారుడు కొల్లు లక్ష్మీనారాయణరావు అన్నారు. ఆదివారం చిలుకూరులో మహిళలు, చిన్నారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు కైలాసం వెంకటేశ్వర్లు, సురగాని లింగయ్య, వైష్ణవి డీఎడ్ కళాశాల కరస్పాండెంట్ బూర లక్ష్మీనారాయణ, వసంత, మాలతీ, రాధిక తదితరులు పాల్గొన్నారు. -
వార్డెన్లు స్థానికంగా ఉండాలి
మోతె: హాస్టళ్ల వార్డెన్లు స్థానికంగా ఉండాలని సూర్యాపేట ఏఎస్డబ్లూ్యఓ శంకర్‌నాయక్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలో బీసీ వెల్ఫేర్హాస్టల్ను ఆయన సందర్శించారు. హాస్టల్లో మౌలికSవసతులను పరిశీలించారు. హాస్టల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఎందుకు ఉందని వార్డెన్ చంద్రారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్లు స్థానికంగా పిల్లలకు అందుబాటులో ఉన్నప్పుడే విద్యార్థుల సంఖ్యపెరుగుతుందన్నారు.మండలంలో ప్రతి గ్రామానికి వెళ్లి వంద మంది విద్యార్థులను హాస్టల్లో చేరేటట్లుగా పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట వార్డెన్, సిబ్బంది ఉన్నారు. -
దాతల సహకారం అభినందనీయం
నూతనకల్: ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి దాతలు సహకారం అందించడం అభినందనీయమని పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు తండు వెంకటనారాయణగౌడ్ అన్నారు. మంగళవారం తాళ్లసింగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు జిల్లా ఎన్ఆర్ఐ ఫౌండేషన్ అమెరికాకు చెందిన ప్రతినిధులు రూ.30వేల విలువైన ఫర్నీచర్, ఇంగ్లిష్ డిక్షనరీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడ్డప్పటికీ మారుమూల ప్రాంతాల్లో విద్యాభివృద్ధి జరగాలనే లక్ష్యంతో పాఠశాలకు సహకారం అందించి దాత్రుత్వాన్ని చాటుకున్న సంస్థ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. విద్యార్థులు దాతలు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని విద్యారంగంలో రాణించాలని ఆయన కోరారు. ఎన్ఆర్ఐ ప్రతినిధులు నాలుగు టేబుల్స్, 17బేంచీలు, ఇంగ్లిష్ డిక్షనరీలు, చెస్‌బోర్డులు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం. దుర్గాప్రసాద్‌రెడ్డి, సిద్ధిఖ్పాష, వర్థెల్లి కృష్ణ, సంధ్యారాణి, మధుకర్, వెంకన్న, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటింటా మరుగుదొడ్డి నిర్మించుకోవాలి
కేంద్ర ప్రతినిధి అంజు ఉప్పల్ మరుగుదొడ్ల నిర్వహణ, అక్షరాస్యతపై ఆరా బెజ్జంకి/మానకొండూర్/హుజూరాబాద్ : ప్రజలు తమ ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, అధికారులు ఆ దిశగా అవగాహన కల్పించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, స్వచ్ఛభారత్ ప్రతినిధి అంజు ఉప్పల్ అన్నారు. మంగళవారం బెజ్జంకి మండలం మాదాపూర్, మానకొండూర్ మండలం లలితాపూర్, హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామాలను సందర్శించారు. పారిశుధ్య నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు ఇంటింటికీ తిరిగి పరిశీలించారు. మరుగుదొడ్ల నిర్మాణాలు, నిర్వహణ, అక్షరాస్యత, పంటలు సాగు, గ్రంథాలయం తదితర విషయాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళాసంఘాల సభ్యులు, గ్రామస్తులతో చర్చించారు. ఆరుబయట మల, మూత్ర విసర్జన ఆరోగ్యానికి చేటుచేస్తుందని పేర్కొన్నారు. సిర్సపల్లిలో ఇంకా 77 నిర్మాణాలు జరగాల్సి ఉన్నట్లు అధికారులు నివేధిక ఇచ్చారని, వీటిని 10 రోజుల్లోగా పూర్తి చేయాలని, అంతవరకు బహిరంగ మల విసర్జన చేయకుండా ఉన్నవారివి ఉపయోగించుకోవాలని సూచించారు. మాదాపూర్, లిలితాపూర్ గ్రామాల్లో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రోత్సహించిన సర్పంచ్‌లు రవీందర్‌రెడ్డి, మర్రి కవితను అభినందించారు. వారివెంట ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రకాశ్, ఈఈ రాఘవులు, స్వచ్ఛ బారత్ కో–ఆర్డినేటర్ కిషన్‌స్వామితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
టీకాలు వేయడం తప్పనిసరి
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అదనపు సంచాలకురాలు డాక్టర్ నీరద గుంటూరు మెడికల్: జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తప్పనిసరిగా ప్రతి బుధవారం టీకాలు వేయాలని, టీకాల కోసం వచ్చే వారిని ఏఎన్ఎంల కోసం వేచి ఉంచకుండా ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సులు తక్షణమే టీకాలు వేయించి పంపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అదనపు సంచాలకులు డాక్టర్ నీరద అన్నారు. గుంటూరు వైద్యకళాశాలలో ఇమ్యూనైజేషన్ కార్యక్రమంపై శనివారం జిల్లా స్థాయి వర్క్‌షాపు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డాక్టర్ నీరద మాట్లాడుతూ జిల్లాలో ఇమ్యూనైజేషన్ కార్యక్రమం పగడ్బందీగా అమలు జరిగేలా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రతి బుధవారం టీకాలు వేయబడునని అందరికి కనిపించేలా ఆరోగ్య కేంద్రాల్లో బోర్డులు రాయించాలని ఆదేశించారు. బుధవారం, శనివారం టీకాలు వేసేందుకు ఏఎన్ఎంలు వెళ్లే సమయంలో టీకాలను ఎలా నిల్వచేస్తున్నారు, ఏయే టీకాలు తీసుకెళ్తున్నారనే విషయాలను తప్పనిసరిగా వైద్యాధికారులు తనిఖీ చేయాలన్నారు. మంగళవారం, శుక్రవారం టీకాల కార్యక్రమం సర్వే చేయాలని, గుంటూరు జిల్లాలో సర్వే సక్రమంగా ఎందుకు జరగటం లేదని వైద్యాధికారులను ప్రశ్నించారు. ఆగస్టు ఒకటి నుంచి బయోమెట్రిక్ హాజరు... జిల్లా వ్యాప్తంగా ఆగస్టు ఒకటోతేదీ నుంచి బయోమెట్రిక్ హాజరు అమలులోకి వస్తుందని, బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే జీతాలను విడుదల చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి చెప్పారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదేశాల మేరకు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో తప్పనిసరిగా బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని ఆదేశించారు. ఓపీకి వస్తున్న రోగుల్లో 15శాతానికి మించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు రాయవద్దని, అంతకు మించి రాస్తే ఉన్నతాధికారులకు వివరణ ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు అనంతరం తల్లి, బిడ్డను తప్పనిసరిగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనంలోనే ఇంటికి తీసుకెళ్ళాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెంచేలా ప్రతి ఒక్కరు కషి చేయాలని అన్నారు. ప్రతిరోజూ సాయంత్రం నాలుగు గంటల కల్లా ఎన్ని డెలివరీలు ఆస్పత్రిలో జరిగాయో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి నివేదిక అందజేయాలన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని ఏ టీకాలు ఏయే సమయాల్లో వేయాలో వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోగ్రామ్ ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
ఒలింపిక్ క్రీడాకారులను ఆదర్శంగా తీసుకోవాలి
మున్సిపల్ చైర్పర్సన్ పులి గీత కొత్తగూడెం అర్బన్ : ఒలింపిక్ క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుని శిక్షణ పొందాలని మున్సిపల్ చైర్పర్సన్ పులి గీత సూచించారు. ఖమ్మం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌతమ్ మోడల్ స్కూల్ సౌజన్యంతో జిల్లా సబ్ జూనియర్, జూనియర్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీలు స్థానిక ప్రకాశం స్టేడియంలో శుక్రవారం జరిగాయి. కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ పులి గీత ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లా నలుమూలాల నుంచి వివిధ పాఠశాలల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. జిల్లాలో ప్రతిభ కలిగిన క్రీడాకారులున్నారని, రానున్న కాలంలో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలు కొత్తగూడెంలో నిర్వహించాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె.మహిధర్ మాట్లాడుతూ జిల్లా మీట్లో ప్రతిభ ఆధారంగా ఆగస్టు నెలలో హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని తెలిపారు. ఈ చాంపియన్‌షిప్‌కు జిల్లా నలుమూలల నుంచి 1,700 మంది పాల్గొన్నారని, 80 అంశాల్లో క్రీడా పోటీలను నిర్వహించామని చెప్పారు. కాగా, షాట్‌పుట్‌లో మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్న వారు ప్రతాప్, అఖిలేష్, రాజారెడ్డి, బాలికల విభాగంలో లేఖన, అర్చిత, విజ్ఞేశ్వరి ఉన్నారు. 600 మీటర్ల రన్నింగ్‌లో సూర్య, వినోద్, సుమంత్, బాలికల విభాగంలో మిథిలా, కృపావతి, పూజిత గెలుపొందారు. 100 మీటర్ల రన్నింగ్ పోటీలో సాయివంశీ, చరణ్, సాయిలు తొలి మూడు స్థానాల్లో నిలిచారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు జివికె.మనోహర్, గౌతమ్ మోడల్ స్కూల్ చైర్మన్ దోసపాటి కార్తీక్, స్కూల్ డీన్ ప్రవీణ్‌కుమార్, ప్రిన్సిపాల్ గుండేటి లక్ష్మీనారాయణ, ఏఓ నాగరత్నం, ఇన్చార్జ్ శ్రీనివాస్, డైరెక్టర్ ఆఫ్ ది మీట్ శివకుమార్, కన్వీనర్ తరుణ్, పవర్ లిఫ్టింగ్ కార్యదర్శి మల్లేష్, జిల్లా హాకీ కార్యదర్శి ఇమామ్, జిల్లా అథ్లెటిక్స్ జాయింట్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, టెక్నికల్ అఫిషియల్స్ పాల్గొన్నారు. -
మరుగుదొడ్ల లక్ష్యాలను పూర్తి చేయాలి:జేసీ
అనంతపురం అర్బన్: స్మార్ట్ సర్వే, మరుగుదొడ్లతో పాటు రెవెన్యూ శాఖలో ఆయా కార్యక్రమాలకు సంబంధించి నిరే్ధశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తిచేయాలని అ«ధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంప్ కార్యాలయం నుంచి వ్యక్తిగత మరుగుదొడ్లు, ప్రజాసాధికార సర్వే, రెవెన్యూ, పౌర సరఫరాల అంశాలపై ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లతో టెలీకాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండంలోనూ రెండు గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్ధాలన్నారు. అధికారుల కృషి కారణంగా సివిల్ సప్లై మేనేజ్‌మెంట్‌లోనూ, బెస్ట్ ఫింగర్ డిటెక్షన్ (బీఎఫ్‌డీ)లోనూ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందని చెబుతూ అభినందించారు. -
ప్రభుత్వం చర్య తీసుకోవాలి
-
నాటిన మొక్కలను కాపాడాలి
ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అశ్వారావుపేట: నాటిన మొక్కలను అలా వదిలేయకుండా ఎదిగేంత వరకు కాపాడాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. అశ్వారావుపేటలో ఫ్రెండ్స్ యూత్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో కలిసి శనివారం ప్రారంభించారు. ఆ కార్యాలయ ఆవరణలో; ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్, భగత్‌సింగ్ సెంటర్, పోలీస్ స్టేషన్, వెంకమ్మ చెరువు రోడ్ వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాలలో ఎంపీ మాట్లాడుతూ.. మొక్కలను మొక్కుబడిగా నాటవద్దన్నారు. మొక్కలను నాటిన ప్రముఖులు వాటిని పర్యవేక్షించలేరని, అందుకే వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమాలలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ మట్టా దయానంద్, ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, దారా యుగంధర్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు జూపల్లి రమేష్‌బాబు, నండ్రు రమేష్, ఎంపీపీ బరగడ కృష్ణారావు, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీఓ శివకుమారి, ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు కొల్లి రవికిరణ్ (పేరాయిగూడెం ఎంపీటీసీ సభ్యుడు) తదితరులు పాల్గొన్నారు. -
28లోగా బీఎఫ్‌డీ నమోదు పూర్తిచేయాలి
రేషన్ డీలర్లకు డీఎస్వో ఉమామహేశ్వరరావు ఆదేశం రెండు మండలాల డీలర్లతో సమావేశం రావులపాలెం : జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల్లో ఈ నెల 28 నాటికి రేషన్ కార్డుదారుల కుటుంబ సభ్యులందరినీ త్వరగా గుర్తించే వేలిముద్ర నమోదు (బీఎఫ్‌డీ) పూర్తిచేయాలని జిల్లా పౌరసరాల అధికారి జి.ఉమామహేశ్వరరావు డీలర్లను ఆదేశించారు. రావులపాలెంలో గురు వారం ఆయన రావులపాలెం, ఆత్రేయపురం మండలాల డీలర్లతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం నుంచి వేలిముద్రల సేకరణ ప్రారంభమైందన్నారు. కార్డులోని అందరి కుటుంబ సభ్యుల పది వేళ్ల ముద్రలను తీసుకున్నాక, వాటిలో త్వరగా ఈపోస్ యంత్రాలు గుర్తించే వేలిని ఎంపిక చేస్తామన్నారు. తద్వారా వేగంగా రేషన్ సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్డుదారులు ఈనెల 28 లోగా ఆధార్ కార్డులతో సమీపంలోని ఏ రేషన్ దుకాణానికైనా వెళ్ళి వేలిముద్రలు నమోదు చేసుకోవాలన్నారు. జిల్లాలోని 2,444 దుకాణాల ద్వారా ప్రస్తుతం 14,30,000 మందికి రేషన్ పంపిణీ చేస్తున్నామన్నారు. కొద్ది నెలలుగా రేషన్ తీసుకోని వారి వివరాలను అగస్టు ఒకటి నుంచి ఆయా రేషన్ దుకాణాల వద్ద ప్రదర్శిస్తామన్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ లోపు కార్డుదారులు రేషన్ తీసుకోవాలన్నారు. కదలలేని స్థితిలో ఉన్నవారికి మాత్రం మీ ఇంటికి మీ రేషన్ ద్వారా ఇంటివద్ద రేషన్ పంపిణీ చేస్తామన్నారు. సమావేశంలో అమలాపురం ఏఎస్ఓ పి. నిత్యానందం, ఎంఎస్ఓ టి.సుభాష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రావులపాలెంలోని కొన్ని రేషన్ దుకాణాల వద్ద వేలిముద్ర నమోదును ఆయన పరిశీలించారు. -
మంచి లక్షణాలు అలవడేలా కృషిచేయాలి
బడి, గుడి, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటాలి జాయింట్ కలెక్టర్ దివ్య ఖమ్మం అర్బన్ : బాల్యం నుంచే చిన్నారులకు మంచి లక్షణాలు అలవడేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ దివ్య అన్నారు. బుధవారం నగరం 7వ డివిజన్లోని రుద్రమకోటలోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన హరితహారంలో ఆమె పాల్గొని మొక్కలు నాటారు. విద్యార్థుల ప్రగతిపై ఆరాతీశారు. బడి, గుడి, ఏదైనా ఖాళీ ప్రదేశాల్లో ఇంటి అవసరాలకు ఉపయోగపడే, నీడనిచ్చే మొక్కలను విరివిరిగా నాటాలని సూచించారు. మొక్కల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించి వాటినినాటించడంతోపాటు, వాటిని సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి గ్రామాల్లోని పాఠశాలలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులకు ఇరువైపులా, ఇతర ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి, వాటిని వృక్షాలుగా మార్చాలని కోరారు. ఈ సందర్భంగా పాఠ్యాంశాలపై విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. దాతల సహాయంతో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి విద్యార్థులకు శుద్ధి చేసిన నీరు అందించాలని కార్పొరేటర్ నాగేశ్వరరావుకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వినయ్‌కృష్ణారెడ్డి, తహసీల్దార్ వెంకారెడ్డి, తెలంగాణ గ్రామ రెవెన్యూ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గరిక ఉపేందర్, ఆర్ఐలు రామకృష్ణ, వాహిద్, పాఠశాల హెచ్ఎం జయరాం, వీఆర్ఓలు బాలయ్య, ఆనందరావు, కృష్ణ, రామచంద్ర, నాగేశ్వరరావు, వీరబాబు, ఉపాధ్యాయులు పద్మావతి పాల్గొన్నారు. -
సీపీఎస్ విధానం రద్దు చేయాల్సిందే!
రౌండ్‌టేబుల్ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు మహబూబ్‌నగర్ విద్యావిభాగం : సీపీఎస్ విధానం రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు స్పష్టం చేశారు. తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సనాతన బాలస్వామి, కామర్తి రాజశేఖర్‌లు మాట్లాడారు. సామాజిక భద్రతలేని సీపీఎస్ పింఛన్ విధానాన్ని, జీఓ నెం.653, 654, 655లను రద్దు చేయాలని, 2013లో అమలులోకి వచ్చిన పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు అన్ని సంఘాల నాయకులు ఏకమై ఐక్యపోరాటాలు చేస్తామని నిర్ణయించారు. సమావేశంలో టీఎన్జీఓ జిల్లా గౌరవ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, అధ్యక్షుడు రామకృష్ణారావు, ఉఐటీఓ సెక్రెటరీ జనరల్ వెంకట్‌రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు రఘురాంరెడ్డి, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, టీపీయుఎస్ హన్మంతరావు, టీపీఆర్టీయూ జిల్లా అ«ధ్యక్షుడు దుంకుడు శ్రీనివాస్, టీటీయూ చలపతిరావు, టీఎస్టీయూ ప్రపుల్చంద్ర, టీపీటీఎఫ్ నారాయణమ్మ, బీటీఏ సుదర్శన్, టీఆర్టీయూ ప్రవీణ్‌కుమార్, డీటీఎఫ్ వెంకటేష్, ఎస్‌ఎల్‌టీఏ సురేంద్రనాథ్, సీపీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
ప్రజలు భాగస్వాములు కావాలి
కలెక్టర్ నీతుప్రసాద్ కరీంనగర్ రూరల్ : హరితహారంలో ప్రజలు భాగస్వాములుకావాలని కలెక్టర్ నీతూప్రసాద్ కోరారు. మెుక్కలు పెట్టడంతోపాటు సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలన్నారు. కరీంనగర్ మండలం గోపాల్‌పూర్‌లో ఆదివారం నిర్వహించిన హరితహారంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి మెుక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న 40 స్ప్రింక్లర్లను మంజూరు చేస్తానన్నారు. నాగులమల్యాలలో.. కరీంనగర్ మండలం నాగులమల్యాలలో రాష్ట్ర అటవీశాఖ ప్రిన్స్‌పల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రశాంత్‌కుమార్ ఝా కలెక్టర్, ఎమ్మెల్యేలతో కలిసి మెుక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ హరితహారంలో రాష్ట్రంలో జిల్లా నాలుగో స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో 70లక్షల పండ్లమొక్కలు అవసరమని గుర్తించామని, ప్రస్తుతం అందుబాటులో లేవని వచ్చే ఏడాది నుంచి పంపిణీ చేస్తామన్నారు. డీఎఫ్‌వో వినోద్‌కుమార్, ఆర్డీవో చంద్రశేఖర్, తహసీల్దార్ జయచంద్రారెడ్డి, ఈవోపీఆర్డీ దేవకిదేవి, ఏపీవో నాగరాజు, ఎంపీపీ వాసాల రమేశ్, జెడ్పీటీసీ ఎడ్ల శ్రీనివాస్, దుర్శేడ్ సింగిల్‌విండో చైర్మన్ మంద రాజమల్లు, వైస్ చైర్మన్ శ్రీనివాస్, సర్పంచులు తొంటి మల్లయ్య, కొమ్ము హేమలత, ఉపసర్పంచులు దాడి మల్లయ్య, గొర్రె రవి, ఎంపీటీసీలు మంజుల, రామస్వామి, డెప్యూటీ మేయర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలి
గోదావరిఖని : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలని సింగరేణి కార్మిక బిడ్డల సంఘం నాయకులు కోరారు. ఈమేరకు ఆర్టీసీ చైర్మన్, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి నేటి వరకు అమలు చేయలేదన్నారు. రోజురోజుకు కార్మికులు అనారోగ్యంతో విధులు నిర్వహించలేక.. మెడికల్ అన్‌ఫిట్ కాలేక నలిగిపోతున్నారని తెలిపారు. కార్మికుల సర్వీసు ముగుస్తుందని, వారసుల వయసు దాటి పోతుందనే బాధ కార్మికుల్లో ఉందన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రొళ్ల నరేష్, ఉపాధ్యక్షుడు ఆడెపు కుమారస్వామి, జిల్లా అధ్యక్షుడు రాసమల్ల రమేశ్, పెనుగొండ నాగరాజు, ఆడెపు సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
500 లిస్టెడ్ కంపెనీలకు షాకిచ్చిన సెబి
ముంబై: మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బ్యూరో సెబీ సంచలన నిర్ణయం తీసుకుంది. వాటాదారులకు డివిడెండ్ చెల్లింపు విధానాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాదాపు టాప్ 500 లిస్టెడ్ కంపెనీలకు డివిడెండ్ పంపిణీ విధానాన్ని తప్పనిసరి చేసింది. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు, ప్రతిఫలాలపై స్పష్టమైన అవగాహన పొందడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. భారీ లాభాలు ఉన్నప్పటికీ కంపెనీ వాటాదారుల మధ్య అదనపు లాభాలుపం పిణీ కావాడంలేదంటూ వివిధ ఇన్వెస్టర్ గ్రూపుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సెబీ ఈ నిబంధనలు రూపొందించింది. ఇటీవల దీనికి సంబంధించి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన సెబీ బోర్డు ఈ కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. అయితే డివిడెంట్ చెల్లించాల్సిందేనని కంపెనీలకు బలవంత పెట్టదు కానీ, ఈ కొత్త పాలసీ ప్రకారం ఇన్వెస్టర్లకు ఆయా కంపెనీలు సమగ్ర సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. సంస్థకు చెందిన అదనపు లాభాలు, వాటాల వినియోగం, వివిధ తరగతులకు సంబంధించిన పారామీటర్ల వివరాలను వాటాదారులకు సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్ 500 కంపెనీల ప్రతి ఏడాది మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డివిడెండ్ పాలసీని రూపొందించాలని స్పష్టం చేసింది. ఇదే మిగతా కంపెనీలకు కూడా వర్తించనుందని వెల్లడించింది. అలాగే కంపెనీల వార్షిక నివేదికలు వారి వెబ్ సైట్లలో స్వచ్ఛందంగా వెల్లడి చేయాలని సెబీ పేర్కొంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం సంస్థలు చెల్లిస్తున్న డివిడెండ్ రేటు ఏదైనా ఉంటే, గత ఐదు ఆర్థిక సంవత్సరాలుగా చెలిస్తున్నవారి డివిడెండ్ విధానాన్ని కూడా బహిర్గతం చేయాలి. మరోవైపు సెబీ నిర్ణయంపై ఆర్థిక నిపుణులు పాజిటివ్ గా స్పందించారు. ఇది మదుపర్లకు బాగా ఉపయోగపడుతుందని ఎనలిస్టుల అంచనా. తమ పెట్టుబడులకు సరియైన కంపెనీని ఎంచుకునే సౌలభ్యం ఇన్వెస్టర్లకు కలుగుతుందన్నారు. -
గర్భం వాయిదానే ఉత్తమ మార్గం..!
దోమకాటువల్ల వ్యాప్తి చెందే జికా వైరస్... ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా జికా వైరస్ అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే బ్రెజిల్ లో దాదాపు పది లక్షలమందికి జికా సోకి కలకలం రేపడమే కాక మెల్లగా ఇతర ఖండాలకూ విస్తరిస్తోంది. ఈ వైరస్ గర్భిణులకు సోకితే పుట్టబోయే పిల్లలకు మెదడు లోపాలు తలెత్తే అవకాశం పెద్ద ఎత్తున ఉండటంతో డబ్ల్యూ హెచ్ వో వైరస్ ను నిలవరించేందుకు భారీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా వైరస్ వ్యాప్తి చెందుతున్న దేశాల్లోని మహిళలు గర్భధారణను ప్రస్తుత సమయంలో వాయిదా వేసుకోవడం మంచిదని హెచ్చరిస్తోంది. పిల్లల పుట్టుకలో లోపాలను నివారించడానికి వ్యాక్సిన్లకు బదులుగా ఈ పద్ధతిని పాటించడం ఉత్తమ మార్గమని చెప్తోంది. జికా వైరస్ సోకిన వెంటనే సాధారణ ప్రజల్లో లక్షణాలు పెద్దగా కనిపించకపోయినా గర్భిణులపై మాత్రం ఈ వైరస్ ప్రభావం అత్యధికంగా ఉంటోంది. జికా తల్లికి పుట్టిన బిడ్డ మెదడులోపంతో ఉండటం ప్రపంచ ఆరోగ్యసంస్థకు పెద్ద సవాలుగా మారింది. దీంతో మహిళలకు ముందు జాగ్రత్త చర్యలను సూచిస్తున్నారు. గర్భం ధరించాలనుకున్న వారు జికా వ్యాప్తి చెందుతున్న సమయంలో వాయిదా వేసుకోవాలని, వ్యాక్సిన్లు వేసినప్పటికీ జికా తల్లులకు పుట్టే బిడ్డలు మెదడు లోపాలతో పుట్టే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే జికా వ్యాప్తి చెందిన అన్ని దేశాల్లో హెచ్చరికలను జారీ చేసిన నిపుణులు.. లైంగిక కార్యకలాపాల వల్ల అనుకున్నదానికంటే ఎక్కువగా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పుట్టే పిల్లల్లో మైక్రో సెఫిలి నివారించాలంటే గర్భాన్ని వాయిదా వేసుకోవడమే సరైన మార్గమని హెచ్చరిస్తున్నారు. ఈడిస్ ఈజిప్టె రకం దోమలు కుట్టడంద్వారా జికా సంక్రమిస్తుందని మొదట్లో తెలిసినా... లైంగిక కార్యకలాపాలు, ముద్దులు, తినే వస్తువులు మార్పిడితో లాలాజలం వల్ల కూడ జికా ఒకరినుంచీ ఒకరికి సోకే అవకాశం ఉందని తాజా పరిశోధనలద్వారా కనుగొన్నారు. దీంతో కొన్ని దిద్దుబాట్లను చేసిన ఏజెన్సీలు... జికా ప్రభావిత ప్రాంతాల్లో కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇందులో భాగంగా పునరుత్పత్తి వయసులోని పురుషులు, మహిళలు గర్భధారణ జరగకుండా చూసుకోవాలని, వాయిదా వేసుకోవడం అన్నిరకాలుగా మంచిదని చెప్తున్నారు. -
హెల్మెట్ ధరించటం తప్పనిసరి
-
డాక్టర్ సర్టిఫికెట్ ఉంటేనే..
మోడలింగ్ ప్రపంచంలో ముందుకు దూసుకుపోవాలంటే అందం, శరీర లావణ్యం ఉంటే సరిపోదని, ఆరోగ్యం కూడా ఎంతో అవసరం అని అంటున్నాయి ఫ్రాన్స్ చట్టాలు. జీరోసైస్ కోసం తిండీ తిప్పలూ మానేసి బక్క చిక్కిపోవడం అందంలోకి రాదని, మోడలింగ్ లో పాల్గోవాలంటే ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉన్నట్లుగా డాక్టర్ సర్టిఫికెట్ కూడ తప్పనిసరి అంటూ ఫ్రాన్స్ కొత్త బిల్లును పాస్ చేసింది. మోడలింగ్ వృత్తిలోకి అడుగు పెట్టేవారు వారి శరీరాకృతికి తగ్గ బరువు కలిగి ఉండాలని సూచించింది. అంతేకాదు చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆరు నెలల జైలు శిక్షతోపాటు 75 వేల యూరోల జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది. శరీరాకృతిని బట్టి బరువు ఉండాలంటూ పెట్టిన నిబంధనలపై గతంలో ఫ్యాషన్ ఇండస్ల్రీ... తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అయితే అప్పటినుంచీ ఆ విషయంపై చర్చలు కొనసాగుతుండగా... చివరికి శరీరాకృతిని బట్టి ఆ మోడల్ ఎంత బరువు ఉండాలి అనే విషయాన్ని డాక్టర్లే నిర్ణయించాల్సిందిగా చట్టసభ్యులు తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీలో ప్రవేశించాలంటే అందంతోపాటు ఆరోగ్యం... ఎత్తుకు తగ్గ బరువు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అతి సన్నగా ఉండి... అనోరెక్సియా, బులీమియాలకు ప్రచారం చేస్తున్నట్లుగా ఉండే కొలతలను ప్రోత్సహించడం నేరం అని, అలా చేసిన వారికి ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తామని గత బిల్లులో కూడ పొందుపరిచిన విషయం తెలిసినదే. అయితే ఫ్రాన్స్ లో సుమారు 30 నుంచి 40 వేల మంది ప్రజలు, కౌమార దశలో అనోరెక్సియా నెర్వోసా, ఈటింగ్ డిజార్డర్ వంటి వాటితో బాధపడుతున్నారు.దీంతో మరణాల రేటు కూడ తీవ్రంగా పెరుగుతోంది. ఇటువంటి అనేక కారణాలను పరిధిలోకి తీసుకున్న ప్రాన్స్ చట్టాలు ఇప్పుడు మోడల్స్ కూ డాక్టర్ సర్టిఫికెట్ అవసరమని తేల్చి చెప్పాయి.