- అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠి
నేరస్తులపై నిఘా ఉంచాలి
Published Mon, Nov 28 2016 11:37 PM | Last Updated on Sat, Aug 11 2018 8:54 PM
గుంటూరు (పట్నంబజారు): నేరస్తుల కదిలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠి సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని అర్బన్ సమావేశ మందిరంలో సోమవారం వెస్ట్ సబ్ డివిజన్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ కేసులను పరిష్కరించటంతో పాటు నాన్ బెయిలబుల్ కేసుల్లో నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జైలు నుంచి విడుదలైన వారి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. అనుమానితులపై నిఘా ఉంచాలని సూచించారు. రౌడీ కార్యకలాపాలు సాగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. ప్రతి కేసును తప్పని సరిగా సీసీ టీఎన్‌ఎస్‌కు అనుసంధానం చేయాలని సూచించారు. సమావేశలో అడిషనల్ ఎస్పీలు భాస్కరరావు, ఇ.సుబ్బరాయుడు, డీఎస్పీ కేజివి.సరిత, వెస్ట్ సబ్‌డివిజన్ ఎస్‌హెచ్‌వోలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement