గోపాల్‌పూర్‌లో ర్యాలీలోపాల్గొన్న కలెక్టర్ నీతుప్రసాద్,ఎమ్మెల్యే కమలాకర్
-
కలెక్టర్ నీతుప్రసాద్
కరీంనగర్ రూరల్ : హరితహారంలో ప్రజలు భాగస్వాములుకావాలని కలెక్టర్ నీతూప్రసాద్ కోరారు. మెుక్కలు పెట్టడంతోపాటు సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలన్నారు. కరీంనగర్ మండలం గోపాల్‌పూర్‌లో ఆదివారం నిర్వహించిన హరితహారంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి మెుక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న 40 స్ప్రింక్లర్లను మంజూరు చేస్తానన్నారు.
నాగులమల్యాలలో..
కరీంనగర్ మండలం నాగులమల్యాలలో రాష్ట్ర అటవీశాఖ ప్రిన్స్‌పల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రశాంత్‌కుమార్ ఝా కలెక్టర్, ఎమ్మెల్యేలతో కలిసి మెుక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ హరితహారంలో రాష్ట్రంలో జిల్లా నాలుగో స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో 70లక్షల పండ్లమొక్కలు అవసరమని గుర్తించామని, ప్రస్తుతం అందుబాటులో లేవని వచ్చే ఏడాది నుంచి పంపిణీ చేస్తామన్నారు. డీఎఫ్‌వో వినోద్‌కుమార్, ఆర్డీవో చంద్రశేఖర్, తహసీల్దార్ జయచంద్రారెడ్డి, ఈవోపీఆర్డీ దేవకిదేవి, ఏపీవో నాగరాజు, ఎంపీపీ వాసాల రమేశ్, జెడ్పీటీసీ ఎడ్ల శ్రీనివాస్, దుర్శేడ్ సింగిల్‌విండో చైర్మన్ మంద రాజమల్లు, వైస్ చైర్మన్ శ్రీనివాస్, సర్పంచులు తొంటి మల్లయ్య, కొమ్ము హేమలత, ఉపసర్పంచులు దాడి మల్లయ్య, గొర్రె రవి, ఎంపీటీసీలు మంజుల, రామస్వామి, డెప్యూటీ మేయర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.