క్రీడాకారులు ఉన్నత శిఖరాలకు చేరాలి
-
తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ
-
ఖిలా వరంగల్‌లో రాష్ట్ర స్థాయి
-
హ్యాండ్‌బాల్ పోటీలు ప్రారంభం
కరీమాబాద్ : క్రీడాకారులు తమలోని నైపుణ్యాలను చాటుకుంటూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. నగరంలోని ఖుష్‌మహల్ వద్ద ఆదివారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర రెండో హ్యాండ్‌బాల్ పోటీల ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇక్కడ క్రీడా పోటీలు నిర్వహించేందుకు పాటుపడిన రాష్ట్ర హ్యాండ్‌బాల్ అసోసియేష¯ŒS సెక్రెటరీ శ్యామల పవ¯ŒSకుమార్ అభినందనీయులన్నారు. ఈసందర్భంగా పది జిల్లాల నుంచి వచ్చిన సుమారు 400 మంది క్రీడాకారులు, అఫీషియల్స్ మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు.
అంతకుముందు క్రీడా ప్రాంగణానికి చేరుకున్న గ్రేటర్ వరంగల్ కార్పొరేష¯ŒS మేయర్ నన్నపునేని నరేందర్ క్రీడాకారులను పరిచయం చేసుకొని, హ్యాండ్‌బాల్ పోటీలను ప్రారంభించారు. మేయర్ నరేందర్ మాట్లాడుతూ చారిత్రక ఓరుగల్లు కోటలో హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. నగరంలో శాశ్వతంగా ఆరు క్రీడా మైదానాలను ఏర్పాటు చేసి నిరంతరం క్రీడలపై శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్లాటినమ్ జూబ్లీ విద్యార్థులు ప్రదర్శించిన తెలంగాణ నృత్యరూపకం ఆకట్టుకుంది. స్థానిక కార్పొరేటర్ బైరబోయిన దామోదర్, హ్యాండ్‌బాల్ అసోసియేష¯ŒS రాష్ట్ర కార్యదర్శి పవ¯ŒSకుమార్, బండా ప్రకాష్, బైరబోయిన కైలాష్‌యాదవ్, సీహెచ్.ఫ్రాంక్లి¯ŒS, అలెగ్జాండర్, నాగేశ్వర్‌రావు, ఖాజాపాష, తోట సంపత్‌కుమార్, కార్పొరేటర్లు మేడిది రజిత, లీలావతి, కవిత, బయ్య స్వామి, బిల్ల కవిత, ఏకశిలా క్రీడా మండలి బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.
వర్షంతో అంతరాయం..
కాగా, ఆదివారం సాయంత్రం హ్యాండ్‌బాల్ పోటీల నిర్వహణకు భారీ వర్షంతో ఆటంకం కలిగింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో కొంతమంది క్రీడాకారులు స్టేజీ కింద తలదాచుకున్నారు. వర్షంలో తడవకుండా ఇంకొందరు కుర్చీలను తలపై పెట్టుకున్నారు. కొంతమంది ఖుష్‌మహల్‌లోకి వెళ్లారు. క్రీడా మైదానం పూర్తిగా తడవడంతో సోమవారం హ్యాండ్‌బాల్ పోటీలు నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. అంతకుముందు పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాష్ట్రస్థాయి పోటీలకు జనరేటర్ సదుపాయాన్ని కల్పించడంపై నిర్వాహకులు దృష్టిసారిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. మహిళలకు ప్లాటినం జూబ్లీ హైస్కూల్, పురుషులకు ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వసతి కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు.