మొక్కలు నాటుతున్న ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే తాటి
-
ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
అశ్వారావుపేట: నాటిన మొక్కలను అలా వదిలేయకుండా ఎదిగేంత వరకు కాపాడాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. అశ్వారావుపేటలో ఫ్రెండ్స్ యూత్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో కలిసి శనివారం ప్రారంభించారు. ఆ కార్యాలయ ఆవరణలో; ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్, భగత్‌సింగ్ సెంటర్, పోలీస్ స్టేషన్, వెంకమ్మ చెరువు రోడ్ వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాలలో ఎంపీ మాట్లాడుతూ.. మొక్కలను మొక్కుబడిగా నాటవద్దన్నారు. మొక్కలను నాటిన ప్రముఖులు వాటిని పర్యవేక్షించలేరని, అందుకే వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమాలలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ మట్టా దయానంద్, ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, దారా యుగంధర్, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు జూపల్లి రమేష్‌బాబు, నండ్రు రమేష్, ఎంపీపీ బరగడ కృష్ణారావు, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీఓ శివకుమారి, ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు కొల్లి రవికిరణ్ (పేరాయిగూడెం ఎంపీటీసీ సభ్యుడు) తదితరులు పాల్గొన్నారు.