పనాజి : అన్నింటికి ఆధార్ అనుసంధానంపై కేంద్రం పై చేయి సాధిస్తున్న వేళ.. గోవాలో కనిపిస్తున్న పరిస్థితులు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. పెయిడ్ సెక్స్ కావాలంటే ఆధార్ కార్డు చూపించాల్సిందేనన్న నిబంధన అక్కడ అమలు అవుతోంది. పోలీసులకు భయపడి పింప్స్(నిర్వాహకులు) ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.
అడ్డగోలుగా జరుగుతున్న ఈ బిజినెస్ పై పోలీసులు గత కొంతకాలంగా నిఘా అధికం చేశారు. దీంతో పింప్స్ జాగ్రత్త పడుతున్నారు. కస్టమర్ల ఆధార్ వివరాలు, వారుంటున్న హోటల్ రూమ్ వివరాలను పంపితేనే... వాటిని సరిపోల్చుకున్నాకే కస్టమర్ల దగ్గరకు యువతులను పంపుతున్నారు. ఆన్ లైన్ అయినా సరే ఆధార్ కంపల్సరీ. తమపై పోలీసులు ఉక్కు పాదం మోపుతుండడంతోనే ఈ రకంగా జాగ్రత్త పడుతున్నట్లు ఓ వ్యక్తి తెలిపాడు. చివరకు అవతలి వారు పోలీసులు కాదన్న విషయంపై స్పష్టత వచ్చాకే ముందుకు కొనసాగుతున్నారంట.
ఇయర్ ఎండ్ కావటంతో గోవాలో పార్టీ కోసం జరుపుకునేందుకు వెళ్లిన ఢిల్లీ యువకులు తమకు ఎదురైన అనుభవాన్ని ఓ మీడియా సంస్థకు వివరించారు. బ్యాంకు ఖాతాలు, ప్రభుత్వ పథకాలు, మొబైల్ నంబర్లకు ఆధార్ అనుసంధానాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో ఈ వ్యవహారానికి కూడా ఆధార్ అవసరం కావటం చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment