prostitution-racket
-
Hyd: కష్టాలు తొలగిస్తానని నగ్న చిత్రాలు తీసి.. ఆపై వ్యభిచారంలోకి!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో బయటపడ్డ ఫేక్ బాబా అరెస్ట్ వ్యవహారంలో విస్తూపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేదరికం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలు, యువతులను లక్ష్యంగా చేసుకున్నాడు సయ్యద్ హుస్సేన్. వాళ్ల కష్టాలు తీర్చే శక్తి తనకుందని నమ్మబలుకుతూ.. నిస్సహాయత ఆసరాగా చేసుకుని వ్యభిచార కూపంలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. ఫలక్ నుమా ఏసీపీ జహంగీర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మహిళల నగ్న వీడియోలు, ఫోటోలను తీసిన సయ్యద్ హుస్సేన్(35)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఓ మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా ‘డెకాయ్ ఆపరేషన్’ చేపట్టి.. అదుపులోకి తీసుకున్నాడు. నిందితుడు మొబైల్ ఆధారంగా కీలక సమాచారం సేకరించినట్లు వెల్లడించారు. నిందితుడు సయ్యద్ హుస్సేన్ లారీ డ్రైవర్ గా పనిచేసేవాడు. అతని స్వస్థలం కర్నాటక బీదర్ జిల్లా బసవకళ్యాణ్. కలబురిగి(గుల్బర్గా)లో ఉన్న గులాం అనే వ్యక్తి తనను పంపించినట్టు చెప్తున్నాడు సయ్యద్. మానసికంగా ఇబ్బందులు పడుతున్న మహిళలు, యువతులు రోగాలు తొలగిస్తాము అని మాయమాటలు చెప్పి నగ్నంగా వాళ్లను ఫోటోలను తీశాడు సయ్యద్. ఈ మేరకు సయ్యద్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ నుంచి గ్యాలరీని పరిశీలించారు పోలీసులు. అంతేకాదు.. గులాం తో సయ్యద్ చాట్ చేసిన కొన్ని వాట్సప్ చాటింగ్స్‌ను పరిశీలించినట్లు వెల్లడించారు. అయితే.. ఆ ఫోటోలను ఎక్కడికి పంపిస్తున్నాడు అనే దానిపై విచారణ జరుగుతున్నట్లు ఫలక్‌నుమా ఏసీపీ జహంగీర్ వెల్లడించారు. గుల్బర్గాలో ఉన్న గులాం గురించి సెర్చ్ టీమ్స్ ను పంపించినట్లు తెలిపిన ఆయన.. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు చేయాలని కోరుతున్నారు. ఫిజిక్‌ను బట్టి రేటు.. తన దగ్గరకు వచ్చే మహిళలను అందరినీ సయ్యద్ హుస్సేన్ టార్గెట్ చేయడం లేదు. ఆకర్షణీయంగా ఉండే ఫిజిక్‌ను బట్టే వాళ్లను రప్పించుకుంటున్నాడు. ముఖం.. కాళ్లు మినహాయించి కేవలం శరీరాన్ని మాత్రమే నగ్నంగా చిత్రీకరించి పంపినట్లు తెలుస్తోంది. ఒక సామాజిక కార్యకర్త ధైర్యం చేసి ఈ వ్యభిచార ముఠాను వెలుగులోకి తేగలిగారు. కలబురిగి ప్రాంతానికి గులాం.. వ్యభిచార గృహాల నిర్వాహకుడిగా ఓ అంచనాకి వచ్చారు. గులాం చెబితే.. వారం కిందట హుస్సేన్ పాతబస్తీ చేరాడు. బార్కస్ ఉంటున్న తన మరదలి ఇంట్లో అద్దెకు దిగాడు. ఫలక్‌నుమా వట్టెపల్లికి చెందిన ఓ మహిళతో కలసి వ్యభిచార కార్యకలాపాలకు అనువుగా ఉండే యువతుల కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. కష్టాలు తొలగించే ఉపాయం తన వద్ద ఉందంటూ తన దగ్గరకు వచ్చే మహిళలకు, యువతులకు మాటలతో గాలం వేసేవాడు. తన గదిలో వాళ్లను నగ్నంగా ఫొటోలు తీశాడు. వాళ్ల శరీర సౌష్టవాన్ని బట్టి గులాం వారికి ధర నిర్ణయించేవాడని వాట్సాప్ ఛాటింగ్‌ల ఆధారంగా తేలింది. అలా వారం రోజుల వ్యవధిలోనే 10 మందికి పైగా మహిళల వివరాలు కలబురిగి చేరవేశాడు. వీరిలో పాతబస్తీకి చెందిన ఇద్దరు యువతులున్నట్టు తెలుస్తోంది. -
వ్యభిచారం గుట్టురట్టు.. పోలీసులకు దొరికేసిన ఐదు జంటలు
శ్రీకాకుళం క్రైం: జిల్లా కేంద్రంలో కొంతకాలంగా సాగుతున్న వ్యభిచారం గుట్టు రట్టయ్యింది. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ ఈశ్వరప్రసాద్ తమ సిబ్బందితో ఏకకాలంలో రెండు లాడ్జీలపై దాడులు నిర్వహించి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక డే అండ్ నైట్ కూడలి సమీపంలో ఉన్న శ్రీరామ, ఎన్ఎస్ఆర్ లాడ్జీల్లో కొంతకాలంగా వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం ఉండటంతో బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. చదవండి: కంపెనీలో అతడితో పరిచయం.. ప్రియుడి కోసం ఏం చేసిందంటే? ఈ దాడుల్లో ఐదు జంటలు పట్టుబడినట్లు సీఐ తెలిపారు. తమ బంధువులతో కొందరు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ కాంప్లెక్సు సమీపంలో ఇంకా కొన్ని లాడ్జీలు, బలగ తదితర ప్రాంతాల్లో వ్యభిచారం జరుగుతున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. లాడ్జిలో ఎవ రు రూమ్‌లో దిగినా పూర్తి వివరాలు ఆధార్ కార్డుతో సహా నోట్ చేసుకోవాలని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
Jubilee Hills: స్పా ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం..
సాక్షి,జూబ్లీహిల్స్: స్పా మసాజ్ పేరుతో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకునితో పాటు ఇద్దరిని అరెస్ట్ చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు ఆ స్పాపై దాడి చేసి నిర్వాహకులతో సహా 9మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు కస్టమర్లను అరెస్ట్ చేశారు. చదవండి: Hyderabad: పెద్ద అంబర్‌పేట్‌లో స్కూల్ బస్సు బీభత్సం -
పక్క రాష్ట్రం నుంచి యువతులను రప్పించి వ్యభిచారం.. ముగ్గురి అరెస్టు
సాక్షి,హస్తినాపురం(హైదరాబాద్): ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళతో పాటు మరో ఇద్దరిని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం..విజయవాడకు చెందిన సి.శృతి అలియాస్ పద్మ(34) వనస్థలిపురం ఠాణా పరిధిలోని సామనగర్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని అందులో పక్క రాష్ట్రం నుంచి యువతులను రప్పించి వారితో వ్యభిచారం నిర్వహిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సదరు ఇంటిపై దాడి చేసి నిర్వాహకురాలు పద్మతో పాటు పట్లావత్ పద్మ అలియాస్ జ్యోతి, ఎన్.రామ్‌ప్రసాద్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 9 వేల నగదు, 2 సెల్ఫోన్లు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: 'హలో కమాన్ 'మైక్' నువ్వు సింగిలా!..అయితే నాతో మింగిల్ అవ్వు'! -
సెక్స్ ట్రేడ్ క్వీన్ అరెస్టు
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో సెక్స్ ట్రేడ్ కేసులో నిర్దోషిగా బయటపడిన ‘సెక్స్ ట్రేడ్ క్వీన్’ గీతా అరోరా అలియాస్ సోనూ పుంజాబన్(36)ను ఢిల్లీ పోలీసులు పూర్తి ఆధారాలతో సహా మళ్లీ పట్టుకున్నారు. ఆమెపై పిల్లల అక్రమ రవాణా, శారీరక వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. సోనూను ఆధారాలతో సహా పట్టుకునేందుకు పోలీసులు పడిన కష్టం అంతా ఇంతా కాదు. సోనూ చేతిలో చిక్కి నరకం చూసిన ఓ టినేజర్ చేసిన సాయంతో పక్కా స్కెచ్ గీసిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 2014లో సోనూ బందీ కోరల నుంచి తప్పించుకున్న టీనేజర్ నగరంలోని నజాఫ్‌ఘర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తన గోడును వెళ్లబోసుకుంది. 2013లో తనను బలవంతంగా ఎత్తుకెళ్లి వ్యభిచారం రొంపిలోకి దించారని చెప్పింది. బాధితురాలి చెప్పిన వివరాలతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్నారు. అయితే, కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పేందుకు బాధితురాలు రాకపోవడంతో కేసును క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అప్పగించారు. 2014 నుంచి బాధితురాలి కోసం మొదలైన క్రైం బ్రాంచ్ పోలీసుల వేట నేటి వరకూ కొనసాగింది. బాధితురాలి ఆచూకీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆరు నెలల్లో ఆమె దొరికింది. కోర్టులో సాక్ష్యం చెబితే సోనూ తనను చంపేస్తుందని, అందుకే పారిపోయానని చెప్పింది. పోలీసులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వారి కళ్లు గప్పి మళ్లీ తప్పించుకుంది. దీంతో మళ్లీ ఆమె కోసం ముమ్మరంగా వెతుకులాట సాగించిన పోలీసులు ఢిల్లీలోనే పట్టుకున్నారు. పోలీసులు అండగా ఉంటారని, నిజాన్ని నిర్భయంగా వెల్లడించాలని ధైర్యం చెప్పారు. పోలీసుల అండంతో బయటకొచ్చిన బాధితురాలు సోనూ దురాగతాలను వెల్లడించారు. కేవలం సోనూ మాత్రమే కాకుండా మొత్తం 12 మంది తనను వేధించారని చెప్పారు. లక్నో, రోహ్తక్లలో తనతో వ్యభిచారం చేయించారని తెలిపారు. కనీసం అన్నం కూడా పెట్టకుండా హింసించే వారని చెప్పారు. సోనూ తనను ఓ వ్యక్తి వద్ద నుంచి కొనుగోలు చేసిందని తెలిపారు. అందంగా తయారు కావడం, కస్టమర్లుతో(విటులు) ఇంగ్లీష్ మాట్లాడటం వంటి విషయాలను సోనూ నేర్పించిందని చెప్పారు. విటుల వద్దకు పంపే ముందు సోనూ తనకు డ్రగ్స్ ఎక్కించేదని వివరించారు. ఈ కేసులో సోనూతో పాటు చాలా మంది ఉన్నారని క్రైమ్ బ్రాంచ్ డీసీపీ భీష్మ సింగ్ తెలిపారు. నగరంలోని ఈ గ్యాంగ్ స్ధావరాలపై రైడింగ్లు జరుపుతున్నట్లు వెల్లడించారు. కాగా, 2011లోనే సోనూపై సెక్స్ ట్రేడ్ ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు ఆమెపై కేసు కూడా నమోదైంది. కానీ, 2014లో స్ధానిక కోర్టు ఆ కేసులో సోనూను నిర్దోషిగా ప్రకటించింది. సోనూను దోషిగా నిర్ధారించేందుకు బలమైన ఆధారాలు లేవని పేర్కొంది. -
ఆధార్ లేదా? అయితే ‘ఆ’ సుఖం కష్టమే!
పనాజి : అన్నింటికి ఆధార్ అనుసంధానంపై కేంద్రం పై చేయి సాధిస్తున్న వేళ.. గోవాలో కనిపిస్తున్న పరిస్థితులు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. పెయిడ్ సెక్స్ కావాలంటే ఆధార్ కార్డు చూపించాల్సిందేనన్న నిబంధన అక్కడ అమలు అవుతోంది. పోలీసులకు భయపడి పింప్స్(నిర్వాహకులు) ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. అడ్డగోలుగా జరుగుతున్న ఈ బిజినెస్ పై పోలీసులు గత కొంతకాలంగా నిఘా అధికం చేశారు. దీంతో పింప్స్ జాగ్రత్త పడుతున్నారు. కస్టమర్ల ఆధార్ వివరాలు, వారుంటున్న హోటల్ రూమ్ వివరాలను పంపితేనే... వాటిని సరిపోల్చుకున్నాకే కస్టమర్ల దగ్గరకు యువతులను పంపుతున్నారు. ఆన్ లైన్ అయినా సరే ఆధార్ కంపల్సరీ. తమపై పోలీసులు ఉక్కు పాదం మోపుతుండడంతోనే ఈ రకంగా జాగ్రత్త పడుతున్నట్లు ఓ వ్యక్తి తెలిపాడు. చివరకు అవతలి వారు పోలీసులు కాదన్న విషయంపై స్పష్టత వచ్చాకే ముందుకు కొనసాగుతున్నారంట. ఇయర్ ఎండ్ కావటంతో గోవాలో పార్టీ కోసం జరుపుకునేందుకు వెళ్లిన ఢిల్లీ యువకులు తమకు ఎదురైన అనుభవాన్ని ఓ మీడియా సంస్థకు వివరించారు. బ్యాంకు ఖాతాలు, ప్రభుత్వ పథకాలు, మొబైల్ నంబర్లకు ఆధార్ అనుసంధానాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో ఈ వ్యవహారానికి కూడా ఆధార్ అవసరం కావటం చర్చనీయాంశమైంది. -
వ్యభిచార రాకెట్లో ఏడుగురి అరెస్టు
మహిళలను అక్రమంగా రవాణా చేస్తూ నిర్వహిస్తున్న వ్యభిచార రాకెట్‌ను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు సహా మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ ఇర్ఫాన్, అతడి అనుచరుడు బాబాల ఇళ్ల మీద పోలీసులు దాడి చేశారు. అక్కడినుంచి వారు నలుగురు మహిళలను రక్షించారు. ఇర్ఫాన్, బాబా, మొయిన్ అనే ముగ్గురు కలిసి గచ్చిబౌలి, మణికొండ తదితర ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని వ్యభిచార రాకెట్ నిర్వహిస్తున్నట్లు తేలింది. సోషల్ మీడియా వెబ్సైట్ల ఆధారంగా వీళ్లు క్లయింట్లను ఆకర్షించేవారని పోలీసులు తెలిపారు. ముంబై, ఢిల్లీ లాంటి నగరాలకు చెందిన కొంతమంది ఏజెంట్లతో కూడా వీరు సంబంధాలు కలిగి ఉండేవారు. కమీషన్ పద్ధతిలో మహిళలను రప్పించి, వారిని ఈ కూపంలోకి దించేవారు. రానుపోను విమాన టికెట్లు కూడా తీసిచ్చేవారని ఓ పోలీసు అధికారి చెప్పారు. వీళ్ల ఫొటోలను మొబైల్ మెసేజింగ్ యాప్‌ల ద్వారా క్లయింట్లకు పంపి, వారిని ఆకర్షించేవారన్నారు. తమ కమీషన్ భారీగా మిగుల్చుకుని, మహిళలకు మాత్రం చాలా తక్కువ చెల్లించేవారని తెలిపారు. లక్ష్మి, రియా అనే ఇద్దరు మహిళలు కూడా ఈ గ్యాంగులో ఉన్నారు.