
వ్యభిచార రాకెట్లో ఏడుగురి అరెస్టు
మహిళలను అక్రమంగా రవాణా చేస్తూ నిర్వహిస్తున్న వ్యభిచార రాకెట్ను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు సహా మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ ఇర్ఫాన్, అతడి అనుచరుడు బాబాల ఇళ్ల మీద పోలీసులు దాడి చేశారు. అక్కడినుంచి వారు నలుగురు మహిళలను రక్షించారు. ఇర్ఫాన్, బాబా, మొయిన్ అనే ముగ్గురు కలిసి గచ్చిబౌలి, మణికొండ తదితర ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని వ్యభిచార రాకెట్ నిర్వహిస్తున్నట్లు తేలింది. సోషల్ మీడియా వెబ్సైట్ల ఆధారంగా వీళ్లు క్లయింట్లను ఆకర్షించేవారని పోలీసులు తెలిపారు.
ముంబై, ఢిల్లీ లాంటి నగరాలకు చెందిన కొంతమంది ఏజెంట్లతో కూడా వీరు సంబంధాలు కలిగి ఉండేవారు. కమీషన్ పద్ధతిలో మహిళలను రప్పించి, వారిని ఈ కూపంలోకి దించేవారు. రానుపోను విమాన టికెట్లు కూడా తీసిచ్చేవారని ఓ పోలీసు అధికారి చెప్పారు. వీళ్ల ఫొటోలను మొబైల్ మెసేజింగ్ యాప్ల ద్వారా క్లయింట్లకు పంపి, వారిని ఆకర్షించేవారన్నారు. తమ కమీషన్ భారీగా మిగుల్చుకుని, మహిళలకు మాత్రం చాలా తక్కువ చెల్లించేవారని తెలిపారు. లక్ష్మి, రియా అనే ఇద్దరు మహిళలు కూడా ఈ గ్యాంగులో ఉన్నారు.