
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,హస్తినాపురం(హైదరాబాద్): ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళతో పాటు మరో ఇద్దరిని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం..విజయవాడకు చెందిన సి.శృతి అలియాస్ పద్మ(34) వనస్థలిపురం ఠాణా పరిధిలోని సామనగర్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని అందులో పక్క రాష్ట్రం నుంచి యువతులను రప్పించి వారితో వ్యభిచారం నిర్వహిస్తోంది.
విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సదరు ఇంటిపై దాడి చేసి నిర్వాహకురాలు పద్మతో పాటు పట్లావత్ పద్మ అలియాస్ జ్యోతి, ఎన్.రామ్‌ప్రసాద్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 9 వేల నగదు, 2 సెల్‌ఫోన్లు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
చదవండి: 'హలో కమాన్ 'మైక్' నువ్వు సింగిలా!..అయితే నాతో మింగిల్ అవ్వు'!
Comments
Please login to add a commentAdd a comment