strengthen
-
యోగా : ఈ ఆసనంతో వెన్నుకు దన్ను
వంగి పనిచేయడం, నిటారుగా ఉండటంలో ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తుంటే వెన్నెముక కండరాలకు శక్తి అవసరం అని గుర్తించాలి. వెన్ను కండరాలను బలపరిచి, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో భుజంగాసనం బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా, పొట్ట, హిప్ కండరాలను గట్టిపరుస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది. తాచుపాము పడగ విప్పితే ఎలా ఉంటుందో ఈ భంగిమ అలా ఉంటుంది. అందుకే ఈ ఆసనాన్ని కోబ్రా పోజ్ అని, తెలుగులో భుజంగాసనం అంటారు.యోగా మ్యాట్ పైన బోర్లా పడుకొని, చేతులను నడుము, హిప్ భాగానికి ఇరువైపులా ఉంచాలి. అర చేతులను నేలకు ఆనించి, భుజాలు, తల నెమ్మదిగా పైకి లేపాలి.అరచేతులను నేలకు నొక్కి పట్టి ఉంచి, నెమ్మదిగా ఛాతీ భాగాన్ని పైకి లేపాలి. దిగువ వీపుపై ఒత్తిడి పడకుండా వెనుక కండరాలను కొద్దిగా స్ట్రెచ్ చేయాలి. దీర్ఘ శ్వాస తీసుకుంటూ 15 నుంచి 20 సెకన్లపాటు ఈ భంగిమలో ఉండాలి. శ్వాస వదులుతూ తిరిగి యధాస్థితికి రావాలి. ∙ఇదేవిధంగా ఐదారుసార్లు ఈ ఆసనాన్ని సాధన చేయవచ్చు. గర్భిణులు ఆ ఆసనం వేయకూడదు. శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్నవారు, వయసు పైబడినవారు ఆ ఆసనాన్ని నిపుణుల సూచనల మేరకే సాధన చేయాలి.– జి.అనూష, యోగా గురు -
సౌత్‌పై కన్నేసిన ఫిజిక్స్‌వాలా.. మూడేళ్లలో రూ. 500 కోట్లు..
న్యూఢిల్లీ: యూనికార్న్ స్టార్టప్ సంస్థ ఫిజిక్స్‌వాలా మూడేళ్లలో ఎడ్టెక్ సంస్థ జైలెమ్ లెర్నింగ్‌ను సొంతం చేసుకోనుంది. కేరళ కేంద్రంగా ఆవిర్భవించిన ఈ ఎడ్టెక్ సంస్థలో 50 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ఫిజిక్స్‌వాలా పేర్కొంది. ఇందుకు రానున్న మూడేళ్లలో దశలవారీగా రూ. 500 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో అలఖ్ పాండే వెల్లడించారు. తద్వారా దక్షిణాది మార్కెట్లో మరింత పట్టుసాధించే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేశారు. రెండు సంస్థల కుదిరిన భాగస్వామ్య ఒప్పందం ప్రకారం ఈక్విటీ, నగదు ద్వారా ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. తద్వారా జైలెమ్ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు వివరించారు. మూడేళ్లలో రూ. 500 కోట్లు వెచ్చించడం ద్వారా హైబ్రిడ్ లెర్నింగ్ జైలెమ్ మోడల్‌ను సరిహద్దు రాష్ట్రాలకు పరిచయం చేయనున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ అవలంబిస్తున్న ఫలితాలు సాధించే ప్రణాళికల శిక్షణా విధానం తననెంతో ఆకట్టుకున్నట్లు తెలియజేశారు. -
Budget 2023: ఆరోగ్య రంగానికి బడ్జెట్ పెంచండి..!
దేశవ్యాప్తంగా ఆరోగ్య సౌకర్యాలు, మౌలిక సదుపాయాల అవసరం పెరుగుతున్నందున ఆరోగ్యరంగానికి 2023–24 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులు పెంచాలని ఈ రంగంలో నిపుణులు సూచిస్తున్నారు. వారి అభిప్రాయాను ఒక్కసారి పరిశీలిస్తే... న్యూఢిల్లీ కేటాయింపులు 40 శాతం పెరగాలి వరుసగా, 2021–22 – 2022–23 ఆర్థిక సంవత్సరాలను చూస్తే, ఆరోగ్య రంగం కోసం బడ్జెట్ కేటాయింపులు సుమారు 16.5 శాతం పెరిగాయి. రానున్న బడ్జెట్లో ఆరోగ్య రంగానికి నిధులు 30–40 శాతం పెరగాలి. ఆరోగ్యం పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిండానికి ప్రయత్నం జరగాలి. పాఠశాల పాఠ్యాంశాల్లో ఆరోగ్యవంతమైన జీవన ప్రాముఖ్యతను తప్పనిసరిగా చేర్చాలి. మధుమేహం, ఇతర జీవనశైలి వ్యాధులపై స్థానిక సంస్థలు, చాంబర్లు, సంఘాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రభుత్వం తప్పనిసరిగా పంచాయతీ స్థాయిలో ప్రాథమిక క్లినిక్‌లను ఏర్పాటు చేయాలి. అవి సక్రమంగా పనిచేసేలా కూడా చూసుకోవాలి. టెలిమెడిసిన్‌ను సులభతరం చేయడానికి వీలుగా ఆయా క్లినిక్‌లను డిజిటలీకరించాలి. – సాకేత్ దాల్మియా, పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ రోగనిర్ధారణ వేగంగా జరగాలి ప్రస్తుత పరిస్థితుల్లో త్వరిత, ఖచ్చిత, వేగవంతమైన రోగనిర్ధారణ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన డిమాండ్. సమర్థవంతమైన ఆరోగ్య నిర్వహణ, అంటువ్యాధుల వ్యాప్తిని నియంత్రణ, రోగికి వేగవంతంగా కోలుకోవడం వంటి కీలక సానుకూలతకు దోహదపడే అంశం ఇది. ఈ దిశలో దేశంలో బహుళ–వ్యాధుల నిర్ధారణ ప్లాట్‌ఫారమ్‌లు అలాగే తక్కువ ధరలో సేవలు లభించే డయాగ్నోస్టిక్స్, వెల్నెస్ ప్రమోషన్ సెంటర్లు అవసరం. ఈ అంశాలపై రానున్న బడ్జెట్ దృష్టి సారించాలి. వెల్నెస్ పరీక్షలు, ఆయుష్ చికిత్సలను ఆరోగ్య బీమాలో కవర్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలి. పరిశోధనలకు ప్రోత్సాహం, ఇందుకు తగిన నిధుల కల్పన అవసరం. దీనివల్ల ఆరోగ్య సంరక్షణ వ్యయాలు ప్రతి వ్యక్తికి సంవత్సరానికి దాదాపు రూ. 1,000 వరకూ తగ్గుతాయి. – అజయ్ పొద్దార్, సైనర్జీ ఎన్విరానిక్స్ చైర్మన్, ఎండీ ఆరోగ్య బీమాపై దృష్టి అవసరం భారత్‌లో హెల్త్‌కేర్‌పై తలసరి బీమా వ్యయం ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. దేశంలో 75 శాతం మందికిపైగా ప్రజలకు ఆరోగ్య బీమానే లేదు. ఈ సమస్యను ఎదుర్కొనడంపై రానున్న బడ్జెట్ దృష్టి పెట్టాలి. – సిద్ధార్థ ఘోష్, ఎన్ఎంఐఎంఎస్ హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ గత రెండేళ్లలో ఇలా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023–24 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె బడ్జెట్ రూపకల్పనపై వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించడం జరిగింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు వార్షిక బడ్జెట్ కేటాయింపులు రూ.73,932 కోట్లు. 2022–23లో ఈ కేటాయింపులు దాదాపు 16.5 శాతం పెరిగి రూ.86,200 కోట్లకు చేరాయి. మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీలో) ఆరోగ్య రంగానికి కేటాయింపులు దాదాపు ఒక శాతంగా ఉండడం గమనార్హం. -
Nirmala Sitha Raman: థర్డ్ వేవ్ ఎఫెక్ట్.... పిల్లలపై కేంద్రం ఫోకస్
కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉండటంతో ఎమర్జెన్సీ హెల్త్ సిస్టమ్ ప్రాజెక్ట్‌ని కేంద్ర ఆర్థిక మంత్రులు నిర్మల సీతారామన్, అనురాగ్ ఠాకూర్లు ప్రకటించారు. ఈ పథకానికి రికార్డు స్థాయిలో రూ. 23,220 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టులో పిల్లలకు సంబంధించి పీడియాట్రిక్ కేర్‌పై ఎక్కువ ఫోకస్ చేయనున్నారు. థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపువచ్చనే సందేహాలు వ్యక్తం అవుతున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఏరియా, జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా పిల్లల వార్డుల ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న పిల్లల వార్డులో మౌలిక సదుపాయలు మెరుగుపరచడం వంటి చర్యలు యుద్ధ ప్రతిపాదికన చేపట్టనున్నారు. మౌలిక సదుపాయలకు నిధులు ఈ నిధులతో 7929 కోవిడ్ హెల్త్ సెంటర్లు, 9954 కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. దీంతో ప్రస్తుతం కోవిడ్ కోసం ప్రత్యేకంగా పని చేస్తున్న ఆస్పత్రుల సంఖ్యను 25 రెట్లు పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ బెడ్ల సంఖ్యను 7.5 రెట్లు, ఐసోలేటెడ్ బెడ్ల సంఖ్య 42 రెట్లు, ఐసీయూ బెడ్లు 45 రెట్లు పెంచబోతున్నారు. సబ్ సెంటర్ స్థాయి నుంచి జిల్లా ఆస్పత్రి స్థాయి వరకు ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తారు. వైద్య విద్యార్థుల సేవలు ఉపయోగించుకునేందుకు ప్రత్యేక ప్రోత్సహకాలు అందిస్తామని మంత్రి తెలిపారు. అంబులెన్సుల కొనుగోలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు కొరత తీర్చడంతో పాటు కొత్తగా అంబులెన్సుల కొనుగోలు, టెలి మెడికేషన్, కోవిడ్ టెస్టుల పెంపు తదితర చర్యలు తీసుకుంటామని కేంద్రం ప్రకటించింది. చదవండి : 5 లక్షల టూరిస్టు వీసాలు ఫ్రీ -
పంచాయతీల మాదిరిగానే నిధులు, విధులు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు ఇస్తున్న మాదిరిగానే జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకూ నిధులు కేటాయిస్తామని, నిర్ధిష్ట విధులు అప్పగిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బడ్జెట్లోనే ఈ నిధులు కేటాయిస్తామన్నారు. మండల, జిల్లా స్థాయి అధికారుల అనుమతులు అవసరం లేకుండానే, పంచాయతీలు నిధులను వినియోగించుకునే అధికారం కొత్త పంచాయతీరాజ్ చట్టం కల్పించిందన్నారు. దీన్ని సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు. స్థానిక స్వపరిపాలన సంస్థలను బలోపేతం చేసి, గ్రామీణాభివృద్ధిలో వారి పాత్రను క్రియాశీలం చేస్తామని ప్రకటించారు. సోమవారం ప్రగతి భవన్లో స్థానిక సంస్థల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షించారు. విధులు, బాధ్యతలు... ‘స్థానిక సంస్థల బలోపేతం ప్రభుత్వ విధాన నిర్ణయం. దాన్ని అమలు చేస్తున్నం. ఇందులో ఆర్థిక సంఘం.. గ్రామ పంచాయతీలకు నెలకు రూ.308 కోట్లు, మున్సిపాలిటీలకు నెలకు రూ.148 కోట్లు విడుదల చేస్తోంది. గ్రామాల్లో ట్రాక్టర్లు, డంప్ యార్డులు, నర్సరీలు, వైకుంఠ ధామాలు సమకూరాయి. ఇదే తరహాలో జిల్లా, మండల పరిషత్‌లకు కూడా ప్రత్యేకంగా ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తం. వీటిని నరేగా లాంటి పథకాలతో అనుసంధానం చేసుకోవడం వల్ల మరిన్ని నిధులు సమకూరే అవకాశం ఉంటుంది. అలాగే జెడ్పీలు, ఎంపీపీలకు విధులు అప్పగించాలి. ఎలాంటి బాధ్యతలు అప్పగించాలో అధికారులు సూచించాలి. ఆ సూచనలపై జెడ్పీ చైర్ పర్సన్లతో నేనే స్వయంగా చర్చిస్తా. తర్వాత తుది నిర్ణయం తీసుకుంటం. మొత్తంగా జిల్లా, మండల పరిషత్‌లను మరింత క్రియాశీలం చేసి, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం, గౌరవం పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటది’అని సీఎం స్పష్టం చేశారు. చదవండి: (సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన టీఎస్ఆర్టీసీ) సోమవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ ఆ నిధులు వినియోగించుకోవచ్చు... ‘గ్రామ పంచాయతీలు తమ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా కొత్త చట్టంలో నిబంధన పెట్టినం. కానీ కొన్ని చోట్ల రూ.2 లక్షలకు మించిన పనుల మంజూరుకు మండల అధికారుల నుంచి అనుమతి పొందాలనే పాత నిబంధన అమలు చేస్తున్నరు. ఇది కొత్త చట్టానికి విరుద్ధం. గ్రామ పంచాయతీలు తమ నిధులను, తమ గ్రామ అవసరాలు తీర్చడానికి సంపూర్ణంగా వినియోగించుకునే హక్కు ఉంది. ఎవరి జోక్యం అక్కరలేదు. ఈ విషయంలో అధికారులు మరోసారి స్పష్టత ఇవ్వాలి’అని కేసీఆర్ వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, పీఆర్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, పీఆర్ కమిషనర్ రఘునందన్ రావు, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రభుత్వ విప్‌లు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, గుర్గం చిన్నయ్య, దివాకర్ రావు, శంకర్ నాయక్, హర్షవర్థన్ రెడ్డి, ఆదిలాబాద్ మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల్లో తగ్గి పట్టణాల్లో పెరిగిన నిరుద్యోగం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఆరు లక్షలకు చేరువైందనే విచారకర వార్తలతోపాటు లాక్డౌన్ కారణంగా దేశంలో అనూహ్యంగా పెరిగి పోయిన నిరుద్యోగుల సంఖ్య లాక్‌డౌన్‌కు ముందున్న పూర్వ స్థితికి చేరుకుందన్న మంచి వార్త కూడా వెలువడింది. లాక్డౌన్ కాలం నాటికి దేశంలో నిరుద్యోగుల సంఖ్య 8.5 శాతానికి చేరుకుంది. అది కూడా గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతకన్నా ఎక్కువ. లాక్డౌన్ కారణంగా 8.5 శాతం ఉన్న నిరుద్యోగుల సంఖ్య మూడు నెలల కాలంలోనే మే నెల మూడవ తేదీ నాటికి 27.1 శాతానికి చేరుకుంది. లాక్డౌన్ సందర్భంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగుల సంఖ్య దారుణంగా పెరిగిపోగా గ్రామీణ ప్రాంతాల్లో తగ్గుతూ వచ్చింది. లాక్డౌన్ సందర్భంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగుల సంఖ్య 9 శాతం నుంచి దాదాపు 28 శాతానికి పెరిగి, జూన్ 21వ తేదీ నాటికి 11 శాతానికి పడి పోయింది. అదే గ్రామీణ ప్రాంతాల్లో జూన్ 21వ తేదీ నాటినికి నిరుద్యోగుల సంఖ్య 7.26 శాతానికి పడిపోయింది. లాక్డౌన్ విధించడానికి పూర్వం అక్కడ నిరుద్యోగుల సంఖ్య 8.3 శాతంగా ఉంది. లాక్‌డౌన్‌కు ముందు దేశంలో ఉన్న నిరుద్యోగుల సంఖ్య ఎంతుందో, లాక్డౌన్ తదనంతరం మళ్లీ ఆ స్థాయికి చేరుకోవడం సంతోషకరమైన మాటే అయినప్పటికీ పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగుల సంఖ్య పెరగడం, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు, కూలీ రేట్లు పడిపోవడం విచారకరం. ఏడాది క్రితం ఉన్న వేతనాలకన్నా తక్కువ ఇస్తున్నారని, భవిష్యత్తులో పెంచుతారనే ఆశ కూడా లేకుండా పోయిందని పలు ప్రైవేటు కంపెనీల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఉచిత బియ్యం సరఫరాను మరో మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ నిన్ననే ప్రకటించారు. ఇంకా దేశంలో ఆహార నిల్వలు పది కోట్ల టన్నులకుపైగా ఉండడంతో ఈ స్కీమ్ పెద్దగా భారం కాదని బీజేపీ నాయకులు చెబుతున్నారు. -
సత్తా చాటిన రిలయన్స్ జియో
సాక్షి, హైదరాబాద్ : జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రెవెన్యూ మార్కెట్ వాటా (ఆర్ఎంఎస్)ను మరింత పటిష్టం చేసుకుంది. ముఖ్యమైన మెట్రో నగరాల్లో, గ్రామీణ ప్రాంతాలలో బలమైన వృద్ధిని నమోదు చేసింది. ఫలితంగా ఈ అంశంలో రెండో స్థానాన్ని మరింత పదిలం చేసుకుని భారతి ఎయిర్టెల్ షాక్ ఇచ్చి టాప్‌లోకి దూసుకు వచ్చింది. ఈ మేరకు బ్రోకరేజీ సంస్థ ఎంకే గ్లోబల్ ఈ నివేదికను వెల్లడించింది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఈ డేటా ప్రకారం ముకేశ్ అంబానీ నేతృత్వంలొని జియో సెప్టెంబర్ త్రైమాసికంలో బలమైన 348 బేసిస్ పాయింట్లు (బీపీఎస్)తో ఆర్ఎంఎస్ 35 శాతానికి చేరుకోగా, భారతి ఎయిర్టెల్ (టాటా టెలిసర్వీస్‌తో సహా) 32.1 శాతం ఆర్‌ఎంఎస్‌తో ఈ త్రైమాసికంలో 70 బీపీఎస్‌లు సాధించింది. అయితే మొదటి స్థానంలో ఉన్నవొడాఫోన్ ఐడియా సెప్టెంబరు త్రైమాసికంలో 66 బీపీఎస్, 27.2 శాతం క్షీణతను నమోదు చేసింది. మొత్తం 22 ప్రధాన మార్కెట్లతో 20 సర్కిల్స్‌లో మార్కెట్ వాటాను కోల్పోయింది తెలంగాణలో కూడా, జియో 37శాతం రెవెన్యూ మార్కెట్ వాటాతో తన నాయకత్వస్థానాన్ని జియో మరింత బలోపేతం చేసుకుంది. ఎయిర్టెల్ 36.5శాతం, వొడాఫోన్ ఐడియా 20శాతం మార్కెట్ వాటాతో సరిపెట్టుకున్నాయి. చందాదారుల సంఖ్య విషయానికొస్తే, జూలై-సెప్టెంబర్ కాలంలో జియో 24 మిలియన్ల కస్టమర్లను చేర్చుకుంది. ఈ త్రైమాసికం ముగింపునాటికి జియో 4జీ యూజర్ బేస్ 355.2 మిలియన్లకు చేరుకుంది. కాగా జూన్ క్వార్టర్లో జియో ఆర్ఎంఎస్ 31.7 శాతంగా ఉండగా, ఎయిర్టెల్ ఆర్ఎంఎస్ 30 శాతంగా ఉంది. -
మోదీ సర్కార్‌కు వరల్డ్ బ్యాంకు బూస్ట్
వాషింగ్టన్: ప్రపపంచబ్యాంకు మోదీ ప్రభుత్వానికి భారీ ఊరట నిచ్చింది.భారత వృద్ధిరేటును అప్‌గ్రేడ్ చేస్తూ అంచనాలను విడుదల చేసింది. అనేక సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా, ఈ ఏడాది భారత ఆర్థిక ప్రగతి 6.7 శాతం ఉంటుందని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది. భారత ప్రభుత్వం ఊహించినదానికన్నా ఎక్కువే వుంటుందంటూ మోదీ సర్కర్‌కు మంచి ఉత్సాహాన్నిచ్చింది. ముఖ్యంగా జీఎస్టీ, నోట్ల రద్దుపై విమర్శలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో విడుదలైన ఈ ప్రపంచ బ్యాంకు నివేదికపై బీజీపీ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ఏడాది ఆర్థిక ప్రగతి 6.5 శాతం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. అంతేకాదు 2018-19 సంవత్సరంలో జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) కూడా 7.3 శాతం ఉంటుందని వరల్డ్ బ్యాంక్ తన నివేదికలో తెలిపింది. ప్రపంచదేశాలపైన కూడా తన నివేదికను వెల్లడించిన ప్రపంచ బ్యాంకు ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని వెల్లడించింది. భారత్ మళ్లీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక దేశమని గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్‌లో వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. ఈ సందర్భంగా భారత ఆర్థిక ప్రగతిపై వరల్డ్ బ్యాంక్ ప్రశంసలు కురిపించింది. జీఎస్టీ వల్ల వృద్ధి రేటు గత ఏడాది రెండవ భాగంలో సుమారు 0.1 శాతం తగ్గినట్లు రిపోర్ట్ పేర్కొన్నది. 2019-20లో జీడీపీ 7.5 శాతం ఉంటుందని కూడా ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. జీఎస్టీ వల్ల లాభాలు మెలమెల్లగా వస్తుంటాయని వరల్డ్ బ్యాంక్ పేర్కొన్నది. నోట్ల రద్దు, జీఎస్టీ, మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాల వల్ల భారత్‌కు అనుకూల ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నట్లు వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. మేకిన్ ఇండియా వల్ల ఆవిష్కరణలు, పెట్టుబడులు పెరుగుతాయని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ మంచి సందేశాన్ని అందిస్తున్నా, అప్రమత్తంగా వ్యవహరించాలని వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ జిమ్ యంగ్ కిమ్ తెలిపారు. పెట్టుబడులకు ఇది మంచి అవకాశమని, గ్లోబల్‌గా ట్రేడ్ రికవరీ పుంజుకుంటోందనీ, తద్వారా ఎగుమతులు కూడా పెరుగుతాయన్నారు. ఏదేమైనా, దేశాలు తమ వృద్ధి అవకాశాలను మెరుగుపర్చడానికి పెట్టుబడులు పెట్టాలని సూచించింది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్య, ఆరోగ్య రంగాల్లోకి ఎక్కువ మంది ప్రజలను, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు చేరడానికి ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని పేర్కొంది. -
తీవ్ర తుఫానుగా మారిన 'వార్దా'
విశాఖపట్నం: వార్దా తుఫాను శనివారం తీవ్ర తుఫానుగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 790 కిలోమీటర్లు, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 870 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాకినాడ, నెల్లూరు మధ్య సోమవారం మధ్యాహ్నం వార్దా తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. 'వార్దా' ప్రభావంతో ఆదివారం నుంచి కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. -
పీఆర్టీయూ బలోపేతానికి కృషిచేయాలి
విద్యారణ్యపురి : ఉపాధ్యాయులు వృత్తి ధర్మా న్ని సక్రమంగా నిర్వర్తిస్తూ పీఆర్టీయూ బలోపేతానికి కృషిచేయాలని వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్ కోరారు. ఆదివారం హన్మకొండలోని రెడ్డి మ్యారేజ్హాల్లో నిర్వహించిన ప్రోగ్రెసీవ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(పీఆర్టీయూ) తృతీయ జిల్లా స్థాయి కార్యనిర్వాహక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉపాధ్యాయుల్లో అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. సమగ్రంగా చర్చించిన తర్వాత పీఆర్టీయూ నుంచి తమ అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. వరంగల్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజిస్తుండగా ఏ జిల్లా ఉపాధ్యాయులను అదే జిల్లాలో కొనసాగిస్తారని పేర్కొన్నారు. ఒకవేళ తమ సొంతజిల్లాలో వద్దనుకుంటే ఇతర జిల్లాలో పనిచేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో ఉపాధ్యాయులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. అలాగే ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులు కొందరు తెలంగాణలో, తెలంగాణకు చెందిన కొందరు ఆంధ్రా లో పనిచేస్తున్నారని, ఇక్కడి వారిని అక్కడికి, అక్కడి వారిని ఇక్కడి పంపాలనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) విధానాన్ని రద్దు చేయాలని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద త్వరలో జరిగే ధర్నాకు సీపీఎస్ వర్తించే ఉపాధ్యాయులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. జిల్లాల పునర్విభజనతో ఏర్ప డే కొత్త జిల్లాల్లో పీఆర్టీయూలో బాగా పనిచేసిన వారికి పదవులు లభిస్తాయని తెలిపారు. ఆలిండియా టీచర్స్ ఆర్గనైజేషన్ (ఏఐటీవో) చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఏకీకృత సర్వీస్ రూల్స్ త్వరలో రాబోతున్నాయని, ఆ దిశగా కృషి జరుగుతోందన్నారు. పండిట్స్ పీఈటీల అప్‌గ్రేడేషన్ కోసం కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. 398 ఉపాధ్యాయులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు సాధించి తీరుతామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి ప్రారంభించినప్పుడే బలోపేతమవుతాయని తెలిపారు. పీఆర్టీ యూ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తమరెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ విధానం రద్దుకోసం నవంబర్‌లో ఢిల్లీలో జరిగే ధర్నాను విజయవం తం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం లో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ తిరునగరి శ్రీనివాస్, పీఆర్టీయూ జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ చీకటి సమ్మయ్య, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సంక్రా బద్రినారాయణ, బాధ్యులు కృష్ణారెడ్డి, యాకూబ్‌రెడ్డి, సూరిబాబు, మురళీధర్‌స్వామి, రామయ్య, జి ల్లాలోని అన్ని మండలాల పీఆర్టీయూ బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నా రు. కాగా జిల్లా జనరల్ సెక్రటరీ కార్యదర్శి నివేదికపై పలు మండలాల బాధ్యులు చర్చించారు. మాలకొండారెడ్డి చేరిక తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు దేవిరెడ్డి మాలకొండారెడ్డి ఆదివారం పీఆర్టీయూ టీఎస్‌లో చేరారు. హన్మకొండ రెడ్డి ఫంక్షన్హాల్లో ఆదివారం జరిగిన ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ టీఎస్) జిల్లా స్థాయి సమావేశంలో ఆయనకు ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తమరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి సభ్యత్వ రశీదును అందజేశారు. ఈసందర్భంగా మాలకొండారెడ్డి మాట్లాడుతూ తాను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష పదవికి ఇటీవలే రాజీనామా చేసినట్లు తెలిపారు. కాగా తెలంగాణ స్టేట్ టీచర్స్ ఫెడరేషన్ (టీఎస్‌టీఎఫ్) జిల్లా అధ్యక్షుడు భాను ప్రసాద్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాసస్వామి కూడా చేరగా పీఆర్టీయూ సభ్యత్వాలు అందజేశారు. -
మన ఆర్థిక వ్యవస్థ వెలిగిపోతోంది!
♦ ఇప్పుడున్నంత పటిష్టంగా ఎన్నడూలేదు.. ♦ వృద్ధిరేటు మరింత దూసుకెళ్తుంది... ♦ ఇదంతా కేంద్రంలో పటిష్ట నాయకత్వం, ♦ కీలక సంస్కరణల ఫలితమే... ♦ హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ వ్యాఖ్యలు ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూలేనంత పటిష్టంగా ఉందని, రాబోయే కాలంలో వృద్ధి రేటు మరింతగా పరుగులు తీసే సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. ప్రధానంగా కేంద్రంలో బలమైన నాయకత్వం ఉండటంతోపాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కీలక సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ జోరుకు దోహదం చేస్తున్నాయని చెప్పారు. సోమవారమిక్కడ భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నిర్వహించిన ‘రిస్క్ సమిట్’లో మాట్లాడుతూ ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా పరేఖ్ మోదీ సర్కారు పనితీరుపై సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘స్థూల ఆర్థిక అంశాలను పరిశీలిస్తే... మన ఎకానమీ ఇప్పుడున్నంత బలమైన స్థాయిలో ఇదివరకెన్నడూ లేదు.ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ హయాంలో భారీస్థాయి అవినీతి అనేది పూర్తిగా తొలగింది. 7.5 శాతం పైగా వార్షిక జీడీపీ వృద్ధిరేటు అంచనాలతో ఇతర దేశాలతో పోలిస్తే మన ఎకానమీ ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థతో పాటు అద్భుతమైన వృద్ధి సామర్థ్యం కూడా ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. అంతేకాదు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగిరావడం ఎనానమీకి తోడ్పాటునందిస్తోంది’ అని పరేఖ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యయం ఆసరా... ప్రైవేటు రంగ కంపెనీల పెట్టుబడులు ఇంకా మందగమనంలోనే కొనసాగుతున్నప్పటికీ.. ప్రభుత్వ వ్యయం ముఖ్యంగా మౌలికసదుపాయాల కల్పనపై చేస్తున్న పెట్టుబడులు పుంజుకోవడంతో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘పోర్టులు, జల మార్గాలు, విమానాశ్రయాలు, స్మార్ట్ సిటీస్ ఇలా ఇన్ఫ్రా రంగంలో అనేక ప్రాజెక్టులకు సంబంధించి కార్యకలాపాలు చకచకా జరుగుతున్నాయి. అంతేకాదు పునరుత్పాదక ఇంధన రంగంలో సామర్థ్యాల పెంపు కూడా వేగవంతమైంది. సేవల మెరుగుదల కోసం రైల్వే శాఖ అనేక చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ టెండర్లు, బిడ్డింగ్ ప్రక్రియల్లో ఈ-వేలాన్ని పూర్తిగా ప్రవేశపెట్టడం దేశంపై విశ్వసనీయత పెరిగేలా చేస్తోంది. భారత్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అధిక రాబడులను ఆశించే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లను మరింత ఆకర్షించడంపై దృష్టిసారించాలి.’ అని అభిప్రాయపడ్డారు. ప్రపంచ మార్కెట్లపట్ల అప్రమత్తంగా ఉండాలి.. ప్రపంచ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. యూరోపియన్ బ్యాంకుల ఇబ్బందులు ఇంకా కొనసాగుతుండటం... ఇతరత్రా ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. పలు కీలక ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్టాలను తాకడం లేదా దానికి దరిదాపుల్లో కదలాడుతున్నాయి. వర్థమాన మార్కెట్లలో అధిక రాబడులకు ఆస్కారం ఉండటంతో ఇన్వెస్టర్లు వీటిపై దృష్టిసారిస్తున్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో 3-4 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు భారత్ క్యాపిటల్ మార్కెట్ల నుంచి తరలిపోవడంతో రూపాయి విలువ తీవ్ర కుదుపులకు గురైంది. అయితే, ఇప్పుడు విదేశీ ఇన్వెస్టర్లలో భారత్‌తో పాటు ఇతర వర్ధమాన దేశాలపట్ల సెంటిమెంట్ మెరుగుపడింది. గడిచిన వారంలో విదేశీ ఈక్విటీ ఫండ్స్ వర్ధమాన మార్కెట్లలో 5 బిలియన్ డాలర్ల నిధులను కుమ్మరించాయి. అంతేకాదు 20 బిలియన్ డాలర్లను బాండ్లలో పెట్టుబడి పెట్టారు. అయితే, రానున్న రోజుల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపుపై తీసుకోబోయే నిర్ణయానికి సంబంధించి అంచనాల మేరకు వర్ధమాన దేశాల మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం ఉంది. పెంపు దిశగా స్పష్టత వచ్చేకొద్దీ విదేశీ నిధులు మళ్లీ భారీగా వెనక్కివెళ్లేందుకు ఆస్కారం ఉంది. మళ్లీ కరెన్సీ విలువలు, స్టాక్స్‌లో తీవ్ర హెచ్చు తుగ్గులు ఉండొచ్చు. -
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకోవాలి
ఇంద్రపాలనగరం(రామన్నపేట) ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామస్తులు కలిసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకోవాలని ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు. మంగళవారం మండలంలోని ఇంద్రపాలనగరంలో సర్పంచ్ పూస బాలనర్సింహ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. అంగన్వాడీలకు వచ్చే పిల్లలకు నర్సరీ, ఎల్కేజీ విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతీగ్రామస్థాయి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే వ్యవస్థ బాగుపడుతుందని వివరించారు. సమావేశంలో గ్రామసర్పంచ్ పూస బాలనర్సింహ, ఉపసర్పంచ్ గర్దాసు వెంకటేశం, తహసిల్దార్ ఎ.ప్రమోదిని, ఎంపీడీఓ కె.జానకిరెడ్డి, ఈఓపీఆర్డీ పి.శ్రీరాములు, పశువైద్యాధికారి ఎం.శ్రీధర్‌రెడ్డి, ప్రధానోపాద్యాయుడు తవుటం భిక్షపతి, పూస బాలకిషన్,వార్డుసభ్యులు అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ను బలోపేతం చేయాలి
♦ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి ♦ టీపీసీసీ చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క సంగారెడ్డి రూరల్ : జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు నడుం బిగించాలని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి పీఎస్ఆర్ గార్డెన్లో శనివారం నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంస్థల సమావేశంలో భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమైందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, ముస్లింలకు 14 శాతం రిజర్వేషన్ ప్రచారానికే పరిమితమయ్యాయని విమర్శించారు. ఏడాదికి 2 లక్షల ఇళ్లు, రూ. 5.5 లక్షల వ్యయంతో నిర్మిస్తామన్న ముఖ్యమంత్రి వచ్చే మూడేళ్లలో 6 లక్షల ఇళ్లను నిర్మించాల్సి ఉంటుందని, అందుకు రూ. 46 వేల కోట్లు అవసరమన్నారు. ఎమ్మెల్యే గీతారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి అనుబంధ సంఘాల నాయకులు, కార్యాకర్తలు కృషి చేయాలని సూచించారు. అనంతరం జిల్లా స్థాయి మైనార్టీ , ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్ కమిటీలను ఏర్పాటు చేశారు. సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, రాష్ట్ర నాయకులు జెట్టి కుసుమ్ కుమార్, జైపాల్‌రెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఖాజా ఫక్రుద్దీన్, సంజీవ్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్‌రెడ్డితో పాటు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. -
ఆందోళన అక్కర్లేదు: జైట్లీ
బీజింగ్: బ్రెగ్జిట్‌పై ఆందోళన అక్కర్లేదని, భారత ఆర్థిక వ్యవస్థ రక్షణ వలయాలు పటిష్టంగా ఉన్నాయని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. బ్రెగ్జిట్ నేపథ్యంలో ఎదురయ్యే స్వల్ప-మధ్య కాలిక సవాళ్లను ఎదుర్కోవటానికి భారత్ సిద్ధమయిందన్నారు. ‘‘ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్‌లోటు, తగిన విదేశీ మారకద్రవ్య నిల్వలు వంటి స్థూల ఆర్థికాంశాలు పటిష్ఠంగా ఉన్నాయి. తక్షణం కొన్ని ఒడిదుడుకులున్నా... సమీప కాలంలో వీటిని ఎదుర్కొనగలం’’ అని చెప్పారాయన. 100 బిలియన్ డాలర్ల ఆసియాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో పాల్గొనడానికి జైట్లీ ప్రస్తుతం బీజింగ్‌లో ఉన్నారు. -
సంస్థాగతంగా బలోపేతమవుతాం
♦ ప్రజా సమస్యలపై పోరులో రాజీ లేదు ♦ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం ♦ ‘సాక్షి’తో వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తమ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షునిగా నియమితుడైన డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. పార్టీని సంస్థాగతంగా కిందిస్థాయి నుంచి బలోపేతం చేస్తామని వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడే విషయంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులను కలుపుకుని ముందుకు వెళ్తామన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా నియమితుడైన సందర్భంగా శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను వైఎస్సార్సీపీ పోషిస్తుందన్నారు. పది జిల్లాల్లో ప్రజలు ఎదురొంటున్న సమస్యలపై ఎక్కడికక్కడ స్పందిస్తూ వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో క్రియాశీలంగా వ్యవహరిస్తామన్నారు. ‘‘ముందుగా పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పటిష్టపరచడంపై ప్రత్యేక దృష్టి పెడతాం. ఈ విషయంలో కార్యకర్తలకు చేదోడువాదోడుగా ఉంటూ వారికి పూర్తి అండదండలందిస్తాం. జిల్లాలవారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిపై ఉద్యమించేలా కార్యాచరణను రూపొందిస్తాం’’ అని వివరించారు. నల్లగొండ పట్టణానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి జువాలజీలో ఎమ్మెస్సీ పట్టా, బయో కెమిస్ట్రీలో డాక్టరేట్ సాధించారు. గతంలో బీజేపీలో కొనసాగారు. ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై 2007లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచీ పార్టీలో కొనసాగుతున్నారు. గతంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. నల్లగొండ జిల్లా హుజుర్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. -
అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం కావాలి
మెట్టపల్లి(చీపురుపల్లి రూరల్): అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం కావడానికి అందరూ సహకరిస్తేనే ఆశించిన లక్ష్యం నేరువేరుతుందని ఐసీడీఎస్ ఉత్తరాంధ్ర ఆర్జేడీ సీహెచ్ కామేశ్వరమ్మ అన్నారు. చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామంలో మంగళవారం ఒకటో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది జూన్ నెల నుంచి రాష్ర్టస్థాయిలో అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయడానికి ప్రత్యేక దరఖాస్తు నమూనాను రూపొందించామన్నారు. ఇందులో అంగన్వాడీ కేంద్రాల పరిధిలో అందుతున్న సేవలను పరిశీలించిన అనంతరం అందులో వివరాలను నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఆ వివరాలను వెంటనే ఆన్లైన్లో పెడతామన్నారు. తద్వారా రాష్ర్టంలో ఏ కేంద్రంలో ఎలాంటి సేవలు అందుతున్నాయో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. కేంద్రాల్లో అందించే పోషకాహారంతో పాటు ఇంటి వద్ద కూడా చిన్నారులకు సమతుల్య ఆహారం అందించడానికి చిన్నారుల తల్లిదండ్రులు దృష్టిసారించాలన్నారు. అప్పుడే చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహించే కార్యకర్తలు, హెల్పర్లు వారికిచ్చిన యూనిఫారాలను తప్పనిసరిగా ధరించి రావాలన్నారు. సమయపాలన పాటించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలను సంద ర్శించే సీడీపీఓలు, సూపర్వైజర్లు కేంద్రాల పనితీరు మెరుగుపడేలా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అప్పుడే కేంద్రాల నిర్వహణ విజయవంతం అవుతుందన్నారు. ప్రతి సీడీపీఓ తమ ప్రాజెక్టు పరిధిలో నెలలో 30 కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలన్నారు. అదేవిధంగా సూపర్వైజర్లు ప్రతి కేంద్రాన్ని నెలలో ఒకసారి తనిఖీ చేయాలన్నారు. కేంద్రాల్లో రికార్డుల నిర్వహణ పరిశీలించాలన్నారు. సమావేశంలో చీపురుపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ ఎస్తేర్‌రాణి, సూపర్వైజరు పైడిమంగ తదితరులు పాల్గొన్నారు.అంగన్వాడీపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆర్జేడీ మెట్టపల్లి గ్రామంలోని కాలనీలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రం పనితీరు పట్ల ఐసీడీఎస్ ఉత్తరాంధ్ర జాయింట్ డెరైక్టర్ సిహెచ్.కామేశ్వరమ్మ అసంతృప్తి వ్యక్తం చేసారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్రానికి ఆమె వచ్చిన సమయానికి 13 మంది పిల్లలు ఉండాల్సి ఉండగా 8 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. దీంతో పాటు కేంద్రంలో చిన్నారులకు హాజరు కూడా వేయలేదు. దీంతో ఆగ్రహించిన ఆమె ప్రతిరోజూ కేంద్రం ఎన్ని గంటలకు తెరవాలి, ఎన్ని గం టలకు హాజరు వేయాలో తెలుసా? అని అంగన్వాడీ కార్యకర్తను ప్రశ్నించారు. 11గంటలు సమయం అయినప్పటికీ అటెండెన్స్ వేయకపోవటమేమిటని ప్రశ్నించారు.కార్యకర్త యూనిఫాం ధరించకపోవడం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం పనితీరు ఉండాల్సిన స్థాయిలో లేదన్నారు. కార్యక్రమంలో చీపురుపల్లి ఐసీడీఎస్ పీఓ ఎస్తేరురాణి,సూపర్వైజర్ పైడిమంగమ్మ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తాం
వికారాబాద్: తెలంగాణలోని 10 జిల్లాలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఈ నెల 9న చేవెళ్లలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తెలంగాణలోని ప్రతి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అభిమానులున్నారని, వైఎస్ఆర్ అడుగుజాడల్లోనే తమ పార్టీ నడుస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పునరువైభవాన్ని సంతరించుకునే రోజులు వస్తాయని స్పష్టం చేశారు.తెలంగాణ ప్రాంతంలో ఏ రాజకీయ నాయకుడికీ లేనంత ఆదరణ వైఎస్ఆర్కు ఉందని, ఆ మహానేత ఆశయాలను వైఎస్ జగన్మోహ న్‌రెడ్డి సాధిస్తారనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో జనవరి నెలలో వైఎస్ఆర్ తనయురాలు, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పర్యటించనున్నట్లు చెప్పారు. తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం సాధించే రోజులు త్వరలోనే వస్తాయన్నారు. 9న చేవెళ్లలో నిర్వహించే సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు చెప్పారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరు కావాలని కోరారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను తుంగలో తొక్కిందన్నారు. అర్హులను కూడా అనర్హులుగా ప్రకటించి సంక్షేమ పథకాలకు దూరం చేస్తోందని ఆరోపించారు. ప్రజల పక్షాన పోరాడం చేయడానికి తమ పార్టీ అన్ని వేళలా ముందుంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు నాగరాజు, గోవర్ధన్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, శంకర్, రమేష్, ఎన్నెపల్లి గోపాల్, బెనర్జీ, రాంరెడ్డి, రాఘవరెడ్డి, చారి తదితరులు పాల్గొన్నారు.