తీవ్ర తుఫానుగా మారిన 'వార్దా'
విశాఖపట్నం: వార్దా తుఫాను శనివారం తీవ్ర తుఫానుగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 790 కిలోమీటర్లు, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 870 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
కాకినాడ, నెల్లూరు మధ్య సోమవారం మధ్యాహ్నం వార్దా తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. 'వార్దా' ప్రభావంతో ఆదివారం నుంచి కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.