సత్తా చాటిన రిలయన్స్ జియో | Jio Strengthens its Lead in Revenue Market Share | Sakshi

సత్తా చాటిన రిలయన్స్ జియో

Published Mon, Nov 25 2019 6:01 PM | Last Updated on Mon, Nov 25 2019 6:15 PM

Jio Strengthens its Lead in Revenue Market Share - Sakshi

సాక్షి, హైదరాబాద్ : జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్  రెవెన్యూ మార్కెట్ వాటా (ఆర్‌ఎంఎస్)ను మరింత  పటిష్టం చేసుకుంది. ముఖ్యమైన మెట్రో నగరాల్లో, గ్రామీణ ప్రాంతాలలో బలమైన వృద్ధిని నమోదు చేసింది.  ఫలితంగా ఈ అంశంలో రెండో స్థానాన్ని మరింత పదిలం చేసుకుని భారతి ఎయిర్‌టెల్‌ షాక్‌ ఇచ్చి టాప్‌లోకి దూసుకు వచ్చింది. ఈ మేరకు బ్రోకరేజీ సంస్థ ఎంకే గ్లోబల్ ఈ నివేదికను వెల్లడించింది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.

ఈ డేటా ప్రకారం ముకేశ్‌ అంబానీ నేతృ‍త్వంలొని జియో సెప్టెంబర్ త్రైమాసికంలో బలమైన 348 బేసిస్ పాయింట్లు (బీపీఎస్)తో ఆర్‌ఎంఎస్‌ 35 శాతానికి చేరుకోగా, భారతి ఎయిర్‌టెల్ (టాటా టెలిసర్వీస్‌తో సహా) 32.1 శాతం ఆర్‌ఎంఎస్‌తో ఈ త్రైమాసికంలో 70 బీపీఎస్‌లు సాధించింది. అయితే మొదటి స్థానంలో ఉన్నవొడాఫోన్ ఐడియా సెప్టెంబరు త్రైమాసికంలో 66 బీపీఎస్‌, 27.2 శాతం క్షీణతను నమోదు చేసింది. మొత్తం 22 ప్రధాన మార్కెట్లతో 20 సర్కిల్స్‌లో మార్కెట్ వాటాను కోల్పోయింది

తెలంగాణలో కూడా, జియో 37శాతం రెవెన్యూ మార్కెట్ వాటాతో తన నాయకత్వస్థానాన్ని జియో మరింత బలోపేతం చేసుకుంది. ఎయిర్‌టెల్ 36.5శాతం,  వొడాఫోన్ ఐడియా 20శాతం మార్కెట్ వాటాతో సరిపెట్టుకున్నాయి. చందాదారుల సంఖ్య విషయానికొస్తే, జూలై-సెప్టెంబర్ కాలంలో జియో 24 మిలియన్ల కస్టమర్లను చేర్చుకుంది. ఈ త్రైమాసికం ముగింపునాటికి జియో 4జీ యూజర్ బేస్ 355.2 మిలియన్లకు చేరుకుంది.   కాగా  జూన్‌ క్వార్టర్‌లో  జియో  ఆర్‌ఎంఎస్‌ 31.7 శాతంగా ఉండగా, ఎయిర్‌టెల్‌  ఆర్‌ఎంఎస్‌ 30 శాతంగా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement