టెలికాం మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తూ... మార్కెట్లోకి దూసుకొచ్చిన రిలయన్స్ జియో, అంతకంటే శరవేగంగా మార్కెట్ షేరును తన సొంతం చేసుకుంటోంది. కేవలం 16 నెలల్లోనే దేశీయ మూడో అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించింది. ఆర్థిక సంవత్సరం 2017-18 డిసెంబర్ క్వార్టర్‌లో రిలయన్స్ జియో మార్కెట్ షేరు 19.7 శాతానికి విస్తరించినట్టు వెల్లడైంది. ఇది ఐడియా సెల్యులార్ లిమిటెడ్ కంటే అత్యధికం. రిలయన్స్ జియోకు చెక్ పెట్టడానికే ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియాలు జతకట్టబోతుండగా... వారికి మరింత షాకిస్తూ ఐడియా సెల్యులార్ కంటే అత్యధికంగా మార్కెట్ షేరు రిలయన్స్ జియో తన సొంతం చేసుకుంది.
ప్రస్తుతం రిలయన్స్ జియో రెండో అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించాలంటే కేవలం 90 బేసిస్ పాయింట్లే అవసరమని బ్లూమ్‌బర్గ్ క్వింట్ రిపోర్టు చేసింది. గత క్వార్టర్ కంటే ఈ క్వార్టర్‌లో రిలయన్స్ జియో రెవెన్యూ మార్కెట్ షేరు 584 బేసిస్ పాయింట్లు పెరిగిందని తెలిసింది. సబ్‌స్క్రైబర్ బేస్ కూడా 16 కోట్లను తాకింది. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో జియో 23 బిలియన్ డాలర్లను మార్కెట్‌లో పెట్టుబడులుగా పెట్టనుందని టెలికాంటాక్ రిపోర్టు చేసింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో మరింత వేగంగా మార్కెట్‌లో దూసుకుపోతుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment