టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ రూ.249 ప్యాక్‌కు పోటీగా ఐడియా సెల్యులార్ సరికొత్త ప్రీపెయిడ్ ప్యాక్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఎయిర్‌టెల్ మాదిరి ప్రయోజనాలతో ఎయిర్‌టెల్ టారిఫ్ మాదిరిగానే 249 రూపాయలతో ఐడియా ఈ కొత్త ప్యాక్‌ను తీసుకొచ్చింది. ఈ ప్యాక్ కింద ఐడియా రోజుకు 2జీబీ 3జీ లేదా 4జీ డేటాను, అపరిమిత వాయిస్ కాల్స్‌ను(రోమింగ్ కలిపి), ఉచిత ఎస్‌ఎంఎస్ ప్రయోజనాలను అందించనున్నట్టు పేర్కొంది. ఈ ప్యాక్ వాలిడిటీ 28 రోజులు. అంటే మొత్తంగా ఐడియా తన కస్టమర్లకు 56జీబీ డేటాను అందించనుంది. వాయిస్‌కాల్స్‌లో రోజుకు 250 నిమిషాలను, వారానికి 1000 నిమిషాలను మాత్రమే వెసులుబాటును ఐడియా కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ ప్యాక్ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
ఎయిర్‌టెల్ తాజాగా లాంచ్ చేసిన ఈ రూ.249 ప్యాక్‌లోనే ఐడియా మాదిరి ప్రయోజనాలనే లభిస్తున్నాయి. రోజుకు 2జీబీ 3జీ లేదా 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను 28 రోజుల పాటు ఆఫర్ చేస్తోంది. దీని వాలిడిటీ కూడా 28 రోజులే. రిలయన్స్ జియో ఇవే ప్రయోజనాలను రూ.198కే అందిస్తోంది. అయితే ఐడియా తన రూ.249 ప్యాక్‌పై రోజువారీ, వారం వారీ కాలింగ్ పరిమితులను విధించగా.. ఎయిర్‌టెల్, జియోలు మాత్రం ఎలాంటి పరిమితులు విధించకుండా అపరిమిత కాల్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. వొడాఫోన్ కూడా వీటికి పోటీగా తన ప్యాక్‌ను తీసుకు రావాల్సి ఉంది. ఐడియా తన ప్రీపెయిడ్ యూజర్లు ఇటీవలే రోజుకు 5జీబీ డేటా అందించేలా రూ.998 ప్యాక్‌ను ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment