ఎయిర్‌టెల్‌ సరికొత్త ప్లాన్‌ : 105జీబీ డేటా | Airtel Launches Rs 419 Plan To Offer 105GB Data For 75 Days | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌ సరికొత్త ప్లాన్‌ : 105జీబీ డేటా

Published Tue, Sep 18 2018 8:34 AM | Last Updated on Tue, Sep 18 2018 9:26 AM

Airtel Launches Rs 419 Plan To Offer 105GB Data For 75 Days - Sakshi

ఎయిర్‌టెల్‌ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌, తన ప్రత్యర్థి రిలయన్స్‌ జియోకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉంది. జియోకు పోటీగా మరో సరికొత్త ప్లాన్‌తో కస్టమర్ల ముందుకు వచ్చింది ఎయిర్‌టెల్‌. 419 రూపాయలతో ప్రీపెయిడ్‌ కస్టమర్లకు ఈ ప్లాన్‌ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సర్కిళ్లకు ఈ ఆఫర్‌ ప్రయోజనాలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్లాన్‌పై ఎలాంటి ప్రయోజనాలను ఎయిర్‌టెల్‌ అందిస్తుందంటే... రూ.419తో రీఛార్జ్‌ చేసుకున్న వారికి దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. రోజూ 1.4జీబీ డేటాను, 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 75 రోజులు. 

రీఛార్జ్‌ చేసుకున్న సమయం నుంచి వాయిస్‌ కాల్స్‌పై ఎలాంటి ఎఫ్‌యూపీ పరిమితి ఉండదు. ఒకవేళ 4జీ కవరేజ్‌ ఏరియా బయట ఈ ప్లాన్‌ను వాడుకోవాలంటే, 3జీ, 2జీ నెట్‌వర్క్‌లపై అదే డేటా వాడుకోవచ్చు. ఎయిర్‌టెల్‌ ఇటీవలే రూ.97 ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.35తో ప్రారంభమయ్యే కోంబో ప్లాన్లకు ఈ ప్లాన్‌ను జత చేర్చింది. రూ.97పై 1.5 జీబీ 3జీ లేదా 4జీ డేటా, 350 నిమిషాల లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ కాల్స్‌ అందిస్తోంది. దీనిలోనే 200 లోకల్‌, ఎస్టీడీ ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు యూజర్లకు దక్కుతున్నాయి. ఈ ప్లాన్‌ వాలిడిటీ నెల రోజులు మాత్రమే. ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్‌, మైఎయిర్‌టెల్‌ యాప్‌ ద్వారా ఈ ప్యాక్‌ను కస్టమర్లకు పొందవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement