రిలయన్స్ జియోకి పోటీగా టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్, కొత్త కొత్త ప్లాన్లను ఆవిష్కరిస్తూనే ఉంది. తాజాగా మరో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ లాంచ్ చేసింది. 597 రూపాయలతో ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. తాజాగా ఆఫర్ చేసిన ఈ ప్లాన్ కింద దీర్ఘకాలికంగా వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను ఎయిర్‌టెల్ అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 168 రోజులు. కాలింగ్‌తో పాటు డేటా ప్రయోజనాలను, ఎస్‌ఎంఎస్ సౌకర్యాలను ఇది ఆఫర్ చేస్తోంది. రిలయన్స్ జియో లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్లకు, ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్‌తో ఎయిర్‌టెల్ గట్టి కౌంటర్ ఇస్తోంది. కొన్ని రీజన్‌లలో ఎంపిక చేసిన సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ కింద ఎలాంటి రోజువారీ పరిమితులు లేకుండా 168 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 10 జీబీ డేటాను యూజర్లు పొందనున్నారు. అయితే డేటా ప్రయోజనాలు అన్ని ప్లాన్లతో పోలిస్తే చాలా తక్కువే. ఈ ప్లాన్‌ను కేవలం వాయిస్ కాల్ యూజర్లను టార్గెట్‌గా చేసుకుని తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ అంతకముందు కూడా అపరిమిత వాయిస్ కాల్స్‌తో రూ.995 రీఛార్జ్ ప్లాన్‌ను లాంచ్‌చేసింది. ఆ ప్లాన్ కింద అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, నెలకు 1జీబీ డేటాను 180 రోజుల పాటు అందిస్తోంది. ప్రస్తుతం లాంచ్ చేసిన రూ.597 ప్లాన్, జియో రూ.999 రీఛార్జ్ ప్లాన్‌కు డైరెక్ట్ పోటీగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment