Vodafone India
-
వొడాఫోన్‌లో గూగుల్ పెట్టుబడులు!
సాక్షి, న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం గూగుల్ వొడాఫోన్ ఇండియాలో 5 శాతం వాటా కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తోంది. ఈ డీల్ ఖరారైతే రూ వేలాది కోట్ల నష్టాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వొడాఫోన్‌కు ఊరట కలిగే అవకాశం ఉంది. రిలయన్స్ జియోలో ఫేస్బుక్ పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో వొడాఫోన్ ఇండియాలో వాటా కొనుగోలుకు గూగుల్ సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. వొడాఫోన్ ఇండియాలో గూగుల్ 5 శాతం వాటా కొనుగోలు చేయనుందని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించిండి. ఈ ఒప్పందం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున ఒప్పందంలో మార్పులు చోటుచేసుకోవచ్చని తెలిపింది. రిలయన్స్ జియోలో ఫేస్బుక్ పదిశాతం వాటా కొనుగోలుకు ముందుకొచ్చిన నేపథ్యంలో వొడాఫోన్‌లో గూగుల్ పెట్టుబడుల అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు జియోతో ఫేస్బుక్ ఒప్పందం ఖరారు కాకముందే జియోలో వాటా కొనుగోలుకు గూగుల్ ఆసక్తి కనబరిచినట్టు ప్రచారం సాగింది. టెక్ దిగ్గజాలు గూగుల్, ఫేస్‌బుక్‌లు టెలికాం రంగంలోకి ప్రవేశించడంతో టెలికాం మార్కెట్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనే ఉత్కంఠ నెలకొంది. చదవండి : గూగుల్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ -
వొడాఫోన్, ఐడియా విలీనానికి నేడు డాట్ ఆమోదం!
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులర్‌ల విలీనానికి టెలికం శాఖ (డాట్) సోమవారం ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించి సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అవసరమైన బ్యాంకు గ్యారంటీలను ఐడియా సమర్పించడంతోపాటు వొడాఫోన్ ఇండియా రుణాల చెల్లింపుల బాధ్యత తలెత్తితే తాను తీసుకునేందుకు హామీ ఇవ్వడంతో వాటిని పరిగణనలోకి తీసుకున్నట్టు సంబంధిత అధికారి పేర్కొన్నారు. వొడాఫోన్ ఇండియా, ఐడియా కలసి విలీనం ద్వారా వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌గా ఏర్పడనున్నాయి. దాంతో దేశంలో అతిపెద్ద టెలికం కంపెనీగా ఇది మొదటి స్థానంలో ఉంటుంది. జియో ప్రవేశం తర్వాత మార్కెట్లో మనుగడ కష్టంగా మారడంతో ఈ రెండు సంస్థలు కలసి ఒక్కటవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. -
జియో దుమ్మురేపుతోంది...
టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తూ... మార్కెట్లోకి దూసుకొచ్చిన రిలయన్స్ జియో, అంతకంటే శరవేగంగా మార్కెట్ షేరును తన సొంతం చేసుకుంటోంది. కేవలం 16 నెలల్లోనే దేశీయ మూడో అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించింది. ఆర్థిక సంవత్సరం 2017-18 డిసెంబర్ క్వార్టర్లో రిలయన్స్ జియో మార్కెట్ షేరు 19.7 శాతానికి విస్తరించినట్టు వెల్లడైంది. ఇది ఐడియా సెల్యులార్ లిమిటెడ్ కంటే అత్యధికం. రిలయన్స్ జియోకు చెక్ పెట్టడానికే ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియాలు జతకట్టబోతుండగా... వారికి మరింత షాకిస్తూ ఐడియా సెల్యులార్ కంటే అత్యధికంగా మార్కెట్ షేరు రిలయన్స్ జియో తన సొంతం చేసుకుంది. ప్రస్తుతం రిలయన్స్ జియో రెండో అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించాలంటే కేవలం 90 బేసిస్ పాయింట్లే అవసరమని బ్లూమ్‌బర్గ్ క్వింట్ రిపోర్టు చేసింది. గత క్వార్టర్ కంటే ఈ క్వార్టర్లో రిలయన్స్ జియో రెవెన్యూ మార్కెట్ షేరు 584 బేసిస్ పాయింట్లు పెరిగిందని తెలిసింది. సబ్‌స్క్రైబర్ బేస్ కూడా 16 కోట్లను తాకింది. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో జియో 23 బిలియన్ డాలర్లను మార్కెట్లో పెట్టుబడులుగా పెట్టనుందని టెలికాంటాక్ రిపోర్టు చేసింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో మరింత వేగంగా మార్కెట్లో దూసుకుపోతుందని తెలిపింది. -
టవర్ల విక్రయానికి ఓకే!
న్యూఢిల్లీ: త్వరలోనే విలీనం కానున్న టెలికం దిగ్గజాలు వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ సంస్థలు దేశీయంగా తమ తమ టవర్ల వ్యాపారాలను ఏటీసీ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి విక్రయించాలని నిర్ణయించాయి. ఈ డీల్ విలువ సుమారు రూ. 7,850 కోట్లు. ఈ ఒప్పందాల కింద వొడాఫోన్ ఇండియాకి రూ.3,850 కోట్లు (592 మిలియన్ డాలర్లు), ఐడియాకి రూ.4,000 కోట్లు (615 మిలియన్ డాలర్లు) లభిస్తాయని ఇరు సంస్థలు సంయుక్త ప్రకటనలో తెలియజేశాయి. రెండు కంపెనీలకు కలిపి మొత్తం 20,000 టవర్లున్నాయి. డీల్‌పై ఐడియాకు డీఎస్పీ మెరిల్ లించ్, వొడాఫోన్‌కి మోర్గాన్ స్టాన్లీ సంస్థలు అడ్వైజర్లుగా ఉన్నాయి. ఈ డీల్ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో పూర్తి కాగలదని అంచనా. రెండో అతిపెద్ద టవర్స్ అపరేటర్‌గా ఏటీసీ.. తాజా కొనుగోలుతో ఏటీసీ భారత్‌లో ఇండస్ టవర్స్ తర్వాత రెండో అతిపెద్ద టవర్ ఆపరేటింగ్ సంస్థగా నిలుస్తుంది. డీల్ అనంతరం ఏటీసీ వద్ద దాదాపు 70,000 టవర్లుంటాయి. వొడాఫోన్, ఐడియా (11.15 శాతం వాటా), టాటా టెలీ సంస్థల జాయింట్ వెంచర్ అయిన ఇండస్ టవర్స్‌కి ప్రస్తుతం 1.25 లక్షల టవర్లున్నాయి. రెండు సంస్థల విలీనంపై ఈ టవర్ డీల్ ప్రభావమేమీ ఉండదని కంపెనీలు పేర్కొన్నాయి. ‘ఈ డీల్ పూర్తిగా నగదు రూపంలో ఉండనుంది. మా 9,900 టవర్లకు గాను సుమారు రూ. 4,000 కోట్లు లభిస్తుంది. వొడాఫోన్తో విలీనమయ్యే దాకా ఈ మొత్తాన్ని వేరే ప్రత్యేక ఖాతాలో ఉంచుతాం‘ అని ఐడియా ఎండీ హిమాంశు కపానియా తెలిపారు. ‘20,000 టవర్లలో వొడాఫోన్, ఐడియాకి చెందిన 6,300 టవర్లు దాదాపు ఒకే దగ్గర ఉన్నాయి. దీంతో వీటిని విక్రయిస్తే ప్రతి నెలా ప్రతి టవర్‌పై రూ.50,000 నుంచి రూ. 55,000 దాకా మిగులుతుంది. ఆ ప్రకారం చూస్తే భారీగా ఆదా అయినట్లే లెక్క‘ అని ఆయన వివరించారు. దాదాపు రూ. 54,000 కోట్ల రుణభారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిధులు వెచ్చిస్తారా అన్న ప్రశ్నకు లేదని సమాధానమిచ్చారు. విలీన ఒప్పంద ప్రక్రియలో ఈ డీల్ కూడా భాగమేనని.. ప్రధాన వ్యాపారేతర అసెట్స్/టవర్స్ విభాగాలను మెర్జర్ ముందుగా లేదా విలీన సమయంలోనైనా విక్రయించాలని ఇరు సంస్థలు నిర్ణయించినట్లు ఆయన వివరించారు. కన్సాలిడేషన్ తప్పని పరిస్థితి.. కొత్తగా వచ్చిన రిలయన్స్ జియో... సంచలన ఆఫర్లతో టెల్కో దిగ్గజాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. దీంతో టెలికంలో కన్సాలిడేషన్ తెరతీస్తూ.. రెండు, మూడు స్థానాల్లో ఉన్న వొడాఫోన్ ఇండియా, ఐడియా సంస్థలు కొన్నాళ్ల క్రితమే విలీన నిర్ణయం తీసుకున్నాయి. ఇది పూర్తయితే సుమారు 35% మార్కెట్ వాటాతో ఏకంగా 23 బిలియన్ డాలర్ల పైగా విలువ చేసే దిగ్గజ టెల్కో ఏర్పాటవుతుంది. అగ్రస్థానంలో కొనసాగుతున్న ఎయిర్టెల్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. -
జియోకు చెక్: రూ.32వేల కోట్లతో ప్లాన్
సాక్షి, న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్లో దూసుకుపోతున్న రిలయన్స్ జియోకు చెక్ పెట్టడానికి దిగ్గజ కంపెనీలన్నీ భారీ ఎత్తున్న ప్లాన్లు వేస్తున్నాయి. టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ అయితే ఏకంగా రూ.32వేల కోట్లను వెచ్చించబోతుంది. తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడానికి వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.32వేల కోట్లకు పైగా వెచ్చించాలని చూస్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా రెవెన్యూ మార్కెట్ షేరులో 3-4 శాతం పాయింట్లను అధికంగా ఇది దక్కించుకోవాలనుకుంటోంది. మిగతా కంపెనీలు ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియాలు కూడా జియోకు అడ్డుకట్ట వేయడానికి విలీన ప్రక్రియకు తెరతీశాయి. ఇలా జియో దెబ్బకు అల్లాడుతున్న కంపెనీలన్నీ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి పలు వ్యూహాలను రచిస్తున్నాయి. జియో గతేడాది సెప్టెంబర్‌లో లాంచ్ చేసిన కమర్షియల్ సర్వీసులతో టెలికాం ఇండస్ట్రిలోని ఇంక్యుబెంట్లు భారీ ఎత్తున్న నష్టపోతున్నాయి. జియోను తట్టుకోవడానికి ఎన్ని ప్లాన్స్ వేసినా.. అవి వర్క్‌వుట్ కావడం లేదు. కానీ ఈ సారి ఎయిర్టెల్ పెద్ద ఎత్తునే ప్లాన్ వేస్తోంది.ఈ టెలికాం దిగ్గజం ఆర్పూ(ఒక్కో యూజర్‌పై ఆర్జించే కనీస రెవెన్యూ)ను కాపాడుకోవడం కోసం ధరలను మరింత తగ్గించుకోవాలనుకోవడం లేదని కూడా తెలుస్తోంది. ఎయిర్టెల్ ప్రస్తుతం పెడుతున్న పెట్టుబడులతో డేటా నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించనుంది. అంతేకాక వీటిని స్పెక్ట్రమ్ కొనుగోలుకు వెచ్చించనుంది. ఈ ఏడాది రూ.16వేల కోట్ల నుంచి రూ.17వేల కోట్ల వరకు మూలధన ఖర్చు రూపంలో వెచ్చించనున్నామని, వచ్చే రెండేళ్లలో కూడా అంతేమొత్తంలో ఇన్వెస్ట్ చేయనున్నట్టు కంపెనీకి చెందిన ఓ అధికారి తెలిపారు. ఈ కంపెనీకి క్యాష్‌ఫ్లోస్ కూడా వార్షికంగా రూ.20వేల కోట్లు మేర ఉన్నట్టు తెలిసింది. గతేడాది కూడా ఎయిర్టెల్ తన నెట్‌వర్క్‌లను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి భారీగానే వెచ్చించింది. వీటికోసం రూ.15వేల కోట్లను ఖర్చుచేసింది. వొడాఫోన్ రూ.8300 కోట్లను, ఐడియా రూ.8000 కోట్లను తమ నెట్‌వర్క్‌ల అప్‌గ్రేడ్ కోసం ఖర్చు చేసినట్టు తెలిసింది. -
అన్లిమిటెడ్ ప్లాన్: రోజుకు 180 రూపాయలు
సాక్షి, ముంబై : వొడాఫోన్ ఇండియా తన కస్టమర్లకు ఓ అన్లిమిటెడ్ ఇంటర్నేషనల్ ప్లాన్‌ను బుధవారం ఆవిష్కరించింది. రోజుకు 180 రూపాయలకు యూకే, యూరప్ ప్రాంత ప్రయాణికులకు ఈ అపరిమిత అంతర్జాతీయ ప్లాన్‌ను లాంచ్చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులు ఇప్పుడు చాలా తేలికగా ఈ ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చని, యూకే, యూరప్‌లోని ప్రముఖ సందర్శన ప్రాంతాల నుంచి తమ నెంబర్‌ను వాడుకోవచ్చని వొడాఫోన్ తెలిపింది. యూరప్ మినహా అమెరికా, యూఏఈ, సింగపూర్, మలేషియా ప్రయాణికులు ఇదే ప్యాక్‌పై అపరిమిత కాలింగ్‌తో పాటు, డేటాను వాడుకోవచ్చని చెప్పింది. మొత్తం 18 దేశాలకు ఈ ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాక్ కింద 28 రోజులకు రూ.5000, 24 గంటల వాడకానికి రూ.500 ధరల శ్రేణి కూడా ఉంది. ఏప్రిల్‌లోనే అమెరికా, సింగపూర్, యూఏఈలకు తమ అపరిమిత అంతర్జాతీయ రోమింగ్‌ను లాంచ్ చేశామని, ప్రస్తుతం ఈ ప్యాక్‌ను మరిన్ని ప్రాంతాలకు విస్తరించడం చాలా ఆనందంగా ఉందని వొడాఫోన్ ఇండియా కన్జ్యూమర్ బిజినెస్ అసోసియేట్ డైరెక్టర్ అన్వేష్ ఖోస్లా చెప్పారు. యూరప్, అమెరికా, యూఏఈ, సింగపూర్, మలేషియాల్లో మొత్తం రోమర్లు 50 శాతం పైగానే ఉన్నారని చెప్పారు. ఈ దేశాల్లో కాల్స్, డేటా పూర్తిగా ఉచితమన్నారు. -
మెగా డీల్‌కు ఐడియా గ్రీన్ సిగ్నల్
-
మెగా డీల్‌కు ఐడియా గ్రీన్ సిగ్నల్
దేశంలోనే అతిపెద్ద టెలికాం దిగ్గజంగా అవతరించడానికి ఐడియా సెల్యులార్ ఆమోదం తెలిపింది. వొడాఫోన్ ఇండియాను తనలో విలీనం చేసుకోవడానికి ఐడియా సెల్యులార్ బోర్డు ఆమోదం తెలిపినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. వొడాఫోన్ ఇండియా మొబైల్ సర్వీసులను తమలో విలీనం చేసుకుని దేశంలో అతిపెద్ద మొబైల్ ఫోన్ కంపెనీగా అవతరించనున్నామని ఐడియా పేర్కొంది. దీంతో ఐడియా సెల్యులార్ షేర్లు ఒక్కసారిగా పైకి జంప్ చేశాయి. మార్కెట్లు 15 శాతం ర్యాలీ నిర్వహిస్తూ లాభాలు పండిస్తున్నాయి. విలీనం తర్వాత అవతరించబోయే కంపెనీలో వొడాఫోన్ 45.1 శాతం యాజమాన్యాన్ని కలిగి ఉండనుంది. ఈ డీల్ ప్రకారం ఐడియా, వొడాఫోన్లు రెండూ చెరో ముగ్గురు డైరెక్టర్లను నామినేట్ చేసే హక్కులు కలిగి ఉంటాయి. అయితే చైర్మన్ అపాయింట్ చేసే అధికారం మాత్రం ఐడియా చేతికే వెళ్లిపోయింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ను అపాయింట్ మెంట్ ఇరు ప్రమోటర్లు నిర్ణయించనున్నారు. ఇండస్ టవర్స్ లోని వొడాఫోన్ 42 శాతం వాటాను ఈ డీల్ నుంచి మినహాయించారు. ఈ విలీనం అనంతరం ఏర్పడబోయే కంపెనీకి 40 కోట్ల మంది కస్టమర్లు ఉండనున్నారు. అంటే ఇండియాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ కంపెనీకే కస్టమర్. ఐడియా, వొడాఫోన్ ల కలయిక టెలికాం సెక్టార్ కు పాజిటివ్ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
దీపావళి కానుకగా... వొడాఫోన్ ఫ్రీ రోమింగ్!
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం కంపెనీ వొడాఫోన్ ఇండియా తాజాగా తన వినియోగదారులకు దీపావళి (అక్టోబర్ 30) నుంచి నేషనల్ రోమింగ్‌లో ఫ్రీ ఇన్కమింగ్ కాల్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ‘ఇకపై రోమింగ్‌లో ఉన్న యూజర్లు రెట్టింపు చార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 30 నుంచి వొడాఫోన్ కస్టమర్లు దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఉచిత ఇన్కమింగ్ కాల్స్ పొందొచ్చు. ఈ చర్య మా 20 కోట్ల మంది కస్టమర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది’ అని వొడాఫోన్ ఇండియా డెరైక్టర్ (కమర్షియల్) సందీప్ కటారియా తెలిపారు. -
గతవారం బిజినెస్
ఓఎన్జీసీ విదేశ్కు 6,100 కోట్ల పన్ను నోటీసు ప్రభుత్వ రంగ చమురు, సహజ వాయువుల సంస్థ (ఓఎన్జీసీ) విదేశీ సబ్సిడరీ ఓఎన్జీసీ విదేశ్కు ఆదాయపు పన్ను శాఖ రూ.6,100 కోట్లకుపైగా సేవా పన్ను నోటీసును జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల్లోని 37 చమురు, గ్యాస్ ప్రాజెక్టుల్లో ఓఎన్జీసీ విదేశ్కు వాటాలు ఉన్నాయి. అనుబంధ సంస్థలు, బ్రాంచీలు, జాయింట్ వెంచర్ల రూపంలో ఈ వాటాలు కొనసాగుతున్నాయి. సంబంధిత సంస్థలు, బ్రాంచీలు, జేవీల కార్యకలాపాలకు సంబంధించే తాజా పన్ను నోటీస్ జారీ అయ్యింది. అయితే ఆయా మార్గాల ద్వారా పెట్టుబడులు సేవల పన్ను పరిధిలోనికి రావని ఓఎన్జీసీ విదేశ్ పేర్కొంటోంది. అతిపెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభం ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ విద్యు త్ ప్లాంటును తమిళనాడులో అదానీ గ్రూప్ ప్రారంభించింది. దీనిని జాతికి అంకితం చేసినట్లు గ్రూప్‌లో భాగమైన అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రకటించింది. రూ.4,550 కోట్ల పెట్టుబడులతో 648 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్లాంటు ప్రపంచంలోనే అతిపెద్దదని పేర్కొంది. రామనాథపురం కౌముది వద్ద ఈ ప్లాంట్ ఏర్పాటయ్యింది. కాగా అదానీ గ్రూప్‌కు చెందిన ఒడిస్సాలోని రూ.6,000 కోట్ల ధామ్రా ఎల్ఎన్జీ ప్రాజెక్టులో 50 శాతం వాటాలను తీసుకునేందుకు సంబంధించిన ఒప్పందంపై ఐఓసీ (39 శాతం), గెయిల్ ఇండి యా (11 శాతం)లు సంతకాలు చేశాయి. మిగిలిన 50 శాతం వా టాను అదానీ పెట్రోలియం టెర్మినల్ లిమిటెడ్ కలిగి ఉంటుంది. మొబైల్‌తో కొటక్ మహీంద్రా అకౌంట్ ప్రైవేట్ రంగ బ్యాంక్ కొటక్ మహీంద్రా తాజాగా బ్యాంకింగ్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది తాజాగా ‘కొటక్ నౌ’ యాప్ సాయంతో బ్యాంక్ అకౌంట్‌ను తెరిచే వెసులుబాటును కస్టమర్లకు కల్పిస్తోంది. దీంతో అకౌంట్ ఓపెనింగ్ సులభతరం కావడంతోపాటు బ్యాంకుకు ఖాతా తెరవడానికి అయ్యే వ్యయం కూడా సగానికి తగ్గే అవకాశముంది. ఒక బ్యాంక్ ఇలాంటి సేవలను ప్రారంభించడం దేశంలో ఇదే తొలిసారి. ‘మా కొత్త యాప్ సాయంతో కస్టమర్ కేవలం 10 నిమిషాల్లో బ్యాంక్ అకౌంట్‌ను తెరవొచ్చు. దీనికోసం బ్యాంక్ శాఖలను సంప్రదించాల్సిన అవస రం లేదు’అని బ్యాంక్ చీఫ్ డిజిటల్ ఆఫీసర్ దీపక్ శర్మ తెలిపారు. సిగ్నా టీటీకేతో ఆంధ్రా బ్యాంక్ జట్టు బీమా సంస్థలు సిగ్నా టీటీకే, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఆంధ్రా బ్యాంకు కార్పొరేట్ ఏజెన్సీ ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ప్రకారం సిగ్నా టీటీకే ఆరోగ్య బీమా పాలసీలను, రిలయన్స్‌కి చెందిన సాధారణ బీమా పాలసీలను విక్రయించనుంది. పాలసీల విషయంలో ఖాతాదారులకు మరిన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉంచేందుకు ఈ ఒప్పందాలు తోడ్పడగలవని బ్యాంకు పేర్కొంది. ఫోర్బ్స్ ఇండియా కుబేరుల్లో పతంజలి ఎండీ అమెరికా బిజినెస్ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్’ తాజాగా రూపొందించిన భారత్‌లోని వంద మంది అత్యంత ధనవంతుల జాబితాలో పతంజలి ఆయుర్వేద్ మేనేజింగ్ డెరైక్టర్, ప్రధాన వాటాదారు ఆచార్య బాల్కృష్ణ తొలిసారి స్థానం పొందారు. ఈయన 2.5 బిలియన్ డాలర్ల సంపదతో 48వ స్థానంలో నిలిచారు. జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వరుసగా తొమ్మిదోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఈయన సంపద 18.9 బిలియన్ డాలర్ల నుంచి 22.7 బిలియన్ డాలర్లకి చేరింది. అంబానీ తర్వాత రెండో స్థానంలో సన్‌ఫార్మా దిలీప్ సంఘ్వీ ఉన్నారు. ఈయన సంపద విలువ 16.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక హిందూజా సోదరులు ఒకస్థానం ఎకబాకి 15.2 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో నిలిచారు. క్లౌడ్ యూజర్లలో ఆ కంపెనీలే ఎక్కువ! తమ దేశీ క్లౌడ్ సర్వీస్‌లకు హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన కంపెనీలు సహా పలు స్టార్టప్స్ కూడా ప్రధాన క్లయింట్స్‌గా ఉన్నాయని టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘మైక్రోసాఫ్ట్’ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ గతేడాది సెప్టెంబర్‌లో భారత్‌లో డేటా సెంటర్లను ఏర్పాటు చేసింది. బీఎస్ఈలో లిసై ్టన టాప్-100 కంపెనీల్లో 52 సంస్థలు తమ క్లౌడ్ సేవలను ఉపయోగించుకుంటున్నాయని కంపెనీ పేర్కొంది. కాగా మైక్రోసాఫ్ట్ క్లయింట్స్‌లో ఫోర్టిస్ హెల్త్‌కేర్, అపోలో హాస్పిటల్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్సీ, పేటీఎం, జస్ట్‌డయల్, స్నాప్‌డీల్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కంపెనీకి క్లయింట్‌గా ఉంది. విదేశీ రుణ భారం 485 బిలియన్ డాలర్లు భారత్ విదేశీ రుణ భారం 2016 మార్చి నాటికి 485.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 2.2 శాతం (10.6 బిలియన్ డాలర్లు) పెరిగింది. దీర్ఘకాల రుణ భారం ప్రత్యేకించి ఎన్ఆర్ఐ డిపాజిట్ల రూపంలో పెరిగింది. వార్షికంగా ఇది 3.3 శాతం పెరిగి 402.2 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఒక నివేదిక తెలిపింది. స్వల్పకాలిక రుణ భారం 2.5 శాతం తగ్గి 83.4 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. వాణిజ్య సంబంధ రుణాలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. పసిడి దిగుమతులు వెలవెల భారత్ పసిడి దిగుమతులు ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్- ఆగస్టు) గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 60.5 శాతం తగ్గాయి. విలువ రూపంలో 15.42 బిలియన్ డాలర్ల నుంచి 6.08 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు పేర్కొన్నాయి. విదేశీ మారకపు చెల్లింపుల అవసరం తగ్గడం వల్ల ఇది కరెంట్ అకౌంట్‌కు లాభించే పరిణామమని అధికార వర్గాలు భావిస్తున్నాయి. తగ్గిన కరెంట్ అకౌంట్ లోటు భారత్ కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ- క్యాడ్) ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి స్వల్ప స్థాయిలో నమోదయ్యింది. సంబంధిత త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 0.1 శాతం (300 మిలియన్ డాలర్లు)గా క్యాడ్ నమోదయినట్లు ఆర్బీఐ గణాంకాలు పేర్కొన్నాయి. ఎఫ్‌డీఐ,ఎఫ్ఐఐ, ఈసీబీలు మినహా నిర్దిష్ట కాలంలో దేశం చెల్లించే-పొందే విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసమే క్యాడ్. పసిడి సహా పలు కమోడిటీల దిగుమతులు భారీగా పడిపోవడం, ఇతర దేశాలకు చెల్లింపులు తగ్గడం వంటి కారణాలతో క్యాడ్ దిగివచ్చింది. వొడాఫోన్ ఇండియాకి భారీ పెట్టుబడులు రిలయన్స్ జియో ప్రవేశంతో టెలికం మార్కెట్లో పోటీ పెరిగిన నేపథ్యంలో వొడాఫోన్ ఇండియాకు బ్రిటన్ మాతృ సంస్థ వొడాఫోన్ నుంచి భారీ పెట్టుబడులు వచ్చాయి. తాజా మూలధనం రూపంలో రూ. 47,700 కోట్ల నిధులు అందినట్లు వొడాఫోన్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ సునీల్ సూద్ వెల్లడించారు. పబ్లిక్ ఇష్యూ ద్వారా భారీగా నిధులు సమీకరించాలన్న ప్రణాళికను ఇంతకుమునుపు కంపెనీ ప్రకటించింది. అయితే తక్షణ అవసరాల కోసం మాతృ సంస్థ హుటాహుటిన ఈ పెట్టుబడులు పంపించింది. భారత్‌లోకి వచ్చిన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) ఇదేనని సూద్ చెప్పారు. మైక్రోసాఫ్ట్ కొత్త నోకియా ఫీచర్ ఫోన్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘మైక్రోసాఫ్ట్’ తాజాగా ‘నోకియా 216’ అనే కొత్త మొబైల్ ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ. 2,495గా ఉంది. ఇందులో డ్యూయెల్ కెమెరా, డ్యూయెల్ సిమ్, ఎఫ్ఎం రేడియో, ఎంపీ3, వీడియో ప్లేయర్, బ్లూటూత్ ఆడియో సపోర్ట్, 1,020 ఎంఏహెచ్ బ్యాటరీ, మెమరీ కార్డ్ సపోర్ట్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. యూజర్లు ఒపెరా మొబైల్ స్టోర్ నుంచి యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని, అలాగే 2,000 వరకూ కాంటాక్ట్స్‌ను సేవ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఫోన్లు భారత్‌లో అక్టోబర్ 24 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నవి. స్పెక్ట్రమ్ వేలం రేసుకు ఏడు సంస్థలూ రెడీ అక్టోబర్ తొలి వారంలో జరగనున్న మెగా స్పెక్ట్రమ్ వేలం రేసు నుంచి ఏ ఒక్క సంస్థా తప్పుకోలేదు. దరఖాస్తుల ఉపసంహరణ గడువు ఈ నెల 22తో ముగియగా బరిలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, టాటా టెలీ, ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ ఉన్నట్టు టెలికం శాఖ తెలిపింది. అయితే, దరఖాస్తుల సమర్పణ చివరి రోజునఆర్కామ్, ఎయిర్‌సెల్ విలీనమవుతున్నట్టు ప్రకటించడంతో.. ఈ రెండూ విడివిడిగా బిడ్లు దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
తుపాన్ ప్రభావిత జిల్లాల్లో వొడాఫోన్ ఉచిత టాక్‌టైమ్
హైదరాబాద్: తుపాన్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న విశాఖపట్టణంలో ఇన్‌స్టా నెట్‌వర్క్‌ను నాలుగు ప్రాంతాల్లో (గాజువాక, కేజీహెచ్, జగదాంబ జంక్షన్, ఎంవీపీ కాలనీ)రికార్డ్ స్థాయిలో ఏర్పాటు చేశామని వొడాఫోన్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. తక్షణం కనెక్టివిటీని అందించేదుకు ఈ ఇన్‌స్టా నెట్వర్క్ తోడ్పటుతుందని పేర్కొంది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖలో ఇతర ప్రాంతాల్లోనూ కనెక్టివిటీని అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించింది. తుపాన్ ప్రభావిత ఐదు జిల్లాల్లోని వొడాఫోన్ వినియోగదారులకు ఉచిత టాక్‌టైమ్‌ను ఆఫర్ చేస్తున్నామని పేర్కొంది. వినియోగదారులు 144నంబర్‌కు క్రెడిట్ అని ఎస్ఎంఎస్ పంపించాలని సూచించింది. డాట్ ఆదేశాల ప్రకారం ఎలాంటి గుర్తింపు పత్రాలు తీసుకోకుండానే ప్రజలకు జారీ చేసేందుకు స్పెషల్ సిమ్‌లను తయారు చేశామని పేర్కొంది. -
ఇక ఆర్థిక వెలుగులు!
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ సారథ్యంలో వచ్చే సోమవారం అధికారం చేపట్టనున్న బీజేపీ ప్రభుత్వంపై వాణిజ్య, పారిశ్రామిక రంగాలు పూర్తి ఆశావహంగా ఉన్నాయి. మోడీ పాలనలో పారిశ్రామిక ప్రగతి వెల్లివిరుస్తుందనీ, ఆర్థిక రథ చక్రాలు పరుగందుకుంటాయనే నమ్మకం ఆయా వర్గాల్లో ద్యోతకమవుతోంది. కరెంటు అకౌంటు లోటు, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తాయనే విశ్వాసం వ్యక్తమవుతోంది. హామీలు అమలు చేస్తే చాలు: జేపీ మోర్గాన్ ఏఎంసీ ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను బీజేపీ అమలు చేస్తే సమీప భవిష్యత్తులోనే ఆర్థిక వ్యవస్థ జోరందుకుంటుందని జేపీ మోర్గాన్ ఏఎంసీ తెలిపింది. కొత్త ప్రభుత్వం తగిన చర్యలు చేపడితే వచ్చే ఏడాది ప్రారంభం నాటికి ఆర్థిక పరిస్థితి మెరుగవడం మొదలవుతుంది. తద్వారా కంపెనీల లాభాలు పెరుగుతాయి. సెన్సెక్స్ మరింత ఊపందుకుంటుందని సంస్థ పేర్కొంది. 2.3 శాతానికి క్యాడ్...: సిటీ గ్రూప్ అంచనా ఎగుమతుల పెంపు, దిగుమతుల తగ్గింపుపై మోడీ సర్కార్ దృష్టిసారించే అవకాశం ఉండడంతో ఈ ఏడాది కరెంటు అకౌంటు లోటు (క్యాడ్) స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2.3 శాతం ఉండవచ్చని సిటీగ్రూప్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం (2013-14)లో క్యాడ్ 3,600 కోట్ల డాలర్లు లేదా జీడీపీలో రెండు శాతం వరకు ఉండవచ్చని పేర్కొంది. ఈ ఏడాది ఇది కొంచెం హెచ్చుస్థాయిలో 2.3 శాతం వరకు ఉండవచ్చని అంచనావేసింది. బుధవారం విడుదల చేసిన నివేదికలో సిటీగ్రూప్ తెలిపిన అంశాలు: చమురు, బొగ్గు, ఇనుప ఖనిజం రంగాలు 2014-15లో క్యాడ్‌పై ప్రభావం చూపే అవకాశముంది. ముడిచమురు ధరలు పెరిగి, డిమాండు క్షీణించడంతో ఈ ఏడాది చమురు దిగుమతుల బిల్లు 10 శాతం మేరకు తగ్గవచ్చు. ఆర్థిక అంశాలపై బీజేపీ ధోరణినిబట్టి అభివృద్ధిని ప్రోత్సహించే చర్యలను కొత్త ప్రభుత్వం చేపట్టవచ్చు. రికవరీ గణాంకాలు క్రమక్రమంగా వెల్లడవుతాయి. ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు 5.6 శాతంగా ఉండవచ్చు. వచ్చే ఏడాది ఇది 6.5 శాతానికి పెరగవచ్చు. కొత్త ప్రభుత్వం చేపట్టబోయే సంస్థాగత సవరణల ఫలితాలు 2015-16, 2016-17లలో ప్రతిబింబిస్తాయి. మెరుగైన పాలన కావాలి: వొడాఫోన్ ఇండియా మోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం మెరుగైన పాలనను, వాణిజ్య వ్యవహారాల్లో మరింత పారదర్శకతను అందిస్తుందని టెలికం దిగ్గజం వొడాఫోన్ పేర్కొంది. నిన్నటి వరకు మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్లో సుపరిపాలనను చూశామని కంపెనీ ఎండీ, సీఈఓ మార్టెన్ పీటర్స్ చెప్పారు. గుజరాత్లో వొడాఫోన్ మార్కెట్ లీడర్‌గా ఉంది. సహజ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించాలి: వేదాంత చైర్మన్ అగర్వాల్ దేశంలో వెలికితీయకుండా ఉన్న సహజ వనరులను సద్వినియోగపర్చుకునే చర్యలను మోడీ సర్కార్ చేపడుతుందని ఆశిస్తున్నట్లు వేదాంత రిసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ చెప్పారు. ఇందుకుగాను తగిన సంస్కరణలకు, విధాన నిర్ణయాలకు కొత్త ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ధరలపై ఉన్నతాధికారుల సమీక్ష నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే అధికారాన్ని చేపట్టనున్న నేపథ్యంలో దేశంలో ధరల పరిస్థితిని ఉన్నతాధికారులు మదింపుచేశారు. రుతుపవనాలు విఫలమైతే పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వ సన్నద్ధతను పరిశీలించారు. పెట్టుబడుల ప్రతిపాదనలను సమీక్షించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్ల కార్యదర్శులతో కేబినెట్ సెక్రటరీ అజిత్ సేథ్ బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా అంశాలపై చర్చించారు. రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం చూపితే ఆహార ధాన్యాల లభ్యత ఏస్థాయిలో ఉంటుందనే అంశంపై సమావేశంలో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. -
గేమ్స్, యాప్స్ కోసం
న్యూఢిల్లీ: మొబైల్ సేవలందించే వొడాఫోన్ కంపెనీ, యానిమేషన్ దిగ్గజం డిస్నీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. గేమ్స్, యాప్స్ అందించడం కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని వొడాఫోన్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ మాధుర్ బుధవారం తెలిపారు. వినియోగదారులు ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ఫోన్ల ద్వారా ఈ గేమ్స్‌ను, యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చని వివరించారు. వేరీజ్ మై వాటర్? వేరీజ్ మై మిక్కీ? వేరీజ్ మై పెర్రీ?, టాయ్ స్టోరీ తదితర గేమ్స్‌ను, యాప్స్‌ను వినియోగదారులు పొందవచ్చని పేర్కొన్నారు. ఇటీవలనే వొడాఫోన్ మ్యూజిక్, వొడాఫోన్ స్పోర్ట్స్ వంటి సర్వీసులను అందజేశామని తెలిపారు. గేమింగ్ బిజినెస్ వృద్ధికి ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. -
80% వరకూ తగ్గిన వొడాఫోన్ డేటా చార్జీలు
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ ఆపరేటర్ వొడాఫోన్ ఇండియా డేటా రేట్లను 80 శాతం వరకూ తగ్గించింది. తమ వినియోగదారులకు ఇది దీపావళి బొనాంజా అని కంపెనీ గురువారం తెలిపింది. ఈ తగ్గింపు రేట్లు దేశవ్యాప్తంగా నేటి (శుక్రవారం) నుంచే అమల్లోకి వస్తాయని వివరించింది. ఈ ఏడాది జూన్‌లో కర్ణాటక, పశ్చిమ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, సర్కిళ్లలో 10 కేబీ డేటా చార్జీలను 10 పైసల నుంచి 2 పైసలకు తగ్గించామని పేర్కొంది. ఇప్పుడు ఈ తగ్గింపు రేట్లనే దేశమంతటా అమలు చేస్తామని వివరించింది. ప్రి-పెయిడ్, పోస్ట్-పెయిడ్ వినియోగదారులకు 2జీ నెట్‌వర్క్‌పై పే యాజ్ యు గో ప్రాతిపదికన ఈ తగ్గింపు డేటా చార్జీలు వర్తిస్తాయని పేర్కొంది. వినియోగదారు లు రోమింగ్‌లో ఉన్నప్పటికీ ఈ తగ్గింపు రేట్లు వర్తిస్తాయని వివరించింది. పే యాజ్ యు గో ఆఫర్లు 2జీ, 3జీ నెట్‌వర్క్‌లకు సంబంధించి దేశంలోనే అత్యంత చౌక ధరలని కంపెనీ పేర్కొంది. సెజ్‌లలో తయారీ ప్లాంట్ల నిబంధనలు సడలింపు న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్ళ (సెజ్) నుంచి ఎగుమతులను ప్రోత్సహించే దిశగా వీటిలో తయారీ ప్లాంట్లకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సడలించింది. భారీ తయారీ యూనిట్లు ఇకపై మూడేళ్ల దాకా పనులను బైటి యూనిట్లకు సబ్-కాంట్రాక్టు ఇచ్చే వెసులుబాటు కల్పించింది. ఇప్పటిదాకా ఈ వ్యవధి ఏడాది కాలం పాటు మాత్రమే ఉంది. నాలుగేళ్లలో కనీసం రెండేళ్ల పాటు సగటున రూ. 1,000 కోట్ల ఎగుమతులు చేసిన తయారీ యూనిట్లకు మాత్రమే తాజా వెసులుబాటు వర్తించనుంది. అలాగే, సదరు యూనిట్లపై ఎటువంటి ఉల్లంఘన ఆరోపణలు, జరిమానాలు ఉండకూడదు. ఇక సబ్‌కాంట్రాక్టు పొందబోయే డొమెస్టిక్ టారిఫ్ ఏరియా (డీటీఏ) యూనిట్.. కచ్చితంగా సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో రిజిస్టర్ అయి ఉండాలి. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, కనీస ప్రత్యామ్నాయ పన్ను విధింపు వల్ల సెజ్‌లు ఆకర్షణ కోల్పోతున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంత రించుకుంది. -
దేశీయ భాగస్వామి వాటాపై వొడాఫోన్ కన్ను
న్యూఢిల్లీ: దేశీయ టెలికం సంస్థ వొడాఫోన్ ఇండియాలో పూర్తి వాటాను సొంతం చేసుకోవాలని బ్రిటిష్ టెలికాం దిగ్గజం వొడాఫోన్ యోచిస్తోంది. దీనిలో భాగంగా దేశీయ భాగస్వాములు అజయ్ పిరమల్(పిరమల్ హెల్త్‌కేర్), అనల్జిత్ సింగ్ వాటాలను కొనుగోలు చేయాలని ప్రణాళికలు వేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తద్వారా తమ వాటాను 100%కు చేర్చుకోవాలని వొడాఫోన్ భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ అంశంపై కంపెనీ స్పందించనప్పటికీ, ఎస్సార్ గ్రూప్ నుంచి వాటాను కొనుగోలు చేయడం ద్వారా 2011లో తమ వాటాను 74%కు పెంచుకున్న విషయం విదితమే. అప్పటి వొడాఫోన్ ఎస్సార్‌లో ఎస్సార్కుగల 33% వాటాను 2011 జూలైలో 546 కోట్ల డాలర్లకు బ్రిటిష్ వొడాఫోన్ సొంతం చేసుకుంది. కాగా, మరోవైపు 2011 ఆగస్ట్‌లో రూ. 2,900 కోట్లను వెచ్చించడం ద్వారా వొడాఫోన్ ఇండియాలో పిరమల్ హెల్త్‌కేర్ 5.5% వాటాను దక్కించుకుంది. ఆపై తమ వాటాను 11%కు పెంచుకుంది. ఇక మ్యాక్స్ ఇండి యా ప్రమోటర్ అనల్జిత్ సింగ్‌కు సైతం వొడాఫోన్ ఇండియాలో 6% వాటా ఉంది.