![గేమ్స్, యాప్స్ కోసం](/styles/webp/s3/article_images/2017/09/2/71395865007_625x300.jpg.webp?itok=SaA2R1Oq)
గేమ్స్, యాప్స్ కోసం
న్యూఢిల్లీ: మొబైల్ సేవలందించే వొడాఫోన్ కంపెనీ, యానిమేషన్ దిగ్గజం డిస్నీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. గేమ్స్, యాప్స్ అందించడం కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని వొడాఫోన్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ మాధుర్ బుధవారం తెలిపారు. వినియోగదారులు ఫీచర్ ఫోన్లు, స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఈ గేమ్స్‌ను, యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చని వివరించారు. వేరీజ్ మై వాటర్? వేరీజ్ మై మిక్కీ? వేరీజ్ మై పెర్రీ?, టాయ్ స్టోరీ తదితర గేమ్స్‌ను, యాప్స్‌ను వినియోగదారులు పొందవచ్చని పేర్కొన్నారు. ఇటీవలనే వొడాఫోన్ మ్యూజిక్, వొడాఫోన్ స్పోర్ట్స్ వంటి సర్వీసులను అందజేశామని తెలిపారు. గేమింగ్ బిజినెస్ వృద్ధికి ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు.